అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యంపై ఉగ్రదాడి.. జవాన్ మృతి
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:12 PM
భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక జవాన్ మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (మంగళవారం) అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌లో భారత సైనికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అస్సాం రైఫిల్ జవాన్ మృతి చెందారు. భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద కంచె పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ 21 మంది అస్సాం రైఫిల్స్ జవాన్లు గస్తీ కాస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు ఉదయం 6.30 నిమిషాలకు వీరిపై దాడికి పాల్పడ్డారు. ఇందులో హవిల్దార్ జంఖోకై కుకీ (42) అనే జవాను వీరమరణం పొందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారని తెలిపాయి.
కాగా గాయపడ్డ జవాన్లను అధికారులు మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ఆపరేషన్లను చేపట్టాయి. ఎన్ఎస్‌సీ కే-వైఏ అనే మిలిటెంట్ గ్రూప్ ఈ దాడి చేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీని గురించి అస్సాం రైఫిల్స్ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఈ వార్తలూ చదవండి
క్యాన్సర్ మందు తయారీ, అమ్మకానికి అంత వ్యత్యాసమా?.. కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు..
ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు: కర్ణాటక హైకోర్టు