Share News

పల్లె పండుగ 3.0ని ఘనంగా ప్రారంభించిన కూటమి అగ్రనేతలు..

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:40 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పల్లె పండుగ 3.0 పనులను ప్రారంభించారు.

పల్లె పండుగ 3.0ని ఘనంగా ప్రారంభించిన కూటమి అగ్రనేతలు..
Palle Panduga 3.0

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పల్లె పండుగ 3.0 పనులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురానికి చేరుకున్న వీరంతా.. పల్లె పండుగ కింద రూ.11,085 కోట్లతో చేపట్టనున్న గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మాధవ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. కూటమి అగ్రనేతలు సభా వేదికపైకి రాగానే.. కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు వారికి అపూర్వ స్వాగతం పలికారు. తమ మెడలో వేసుకున్న కూటమి పార్టీల జెండాలను గాల్లో ఊపుతూ ఘనంగా స్వాగతించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చూసి ఆనందంతో పలువురు మహిళలు డ్యాన్సులు చేశారు.


సీఎం, డిప్యూటీ సీఎం సభా వేదికపై నడిచిన సందర్భంలో పలువురు అభిమానులు తమ కుర్చీల్లో నుంచే ఫోన్లలో ఫొటోలు తీశారు. కాగా, పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా గత ప్రభుత్వంలో రోడ్లు, గ్రామాల దుస్థితిని గుర్తు చేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధిని వివరిస్తూ అధికారులు ప్రజలకు వీడియో ప్రజెంటేషన్లు చూపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.. శ్రీకాళహస్తి ఆస్పత్రిలో స్పెషల్‌ ఆడిట్‌ కమిటీ విచారణ

రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ హర్షం..

Updated Date - Sep 29 , 2026 | 03:43 PM