ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. శ్రీకాళహస్తి ఆస్పత్రిలో స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ
ABN , Publish Date - Sep 29 , 2026 | 02:34 PM
శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ చేపట్టింది. ఆస్పత్రికి సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న కమిటీ.. జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న నిర్వహించిన బాధ్యతలపై ప్రధానంగా ఆరా తీస్తోంది.
తిరుపతి: శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ చేపట్టింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాల నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రత్యేక ఆడిట్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఆస్పత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ.. నిధుల లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా నిధుల గోల్‌మాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న నిర్వహించిన లావాదేవీలపై కమిటీ దృష్టి సారించింది.
2023 నుంచి గత ఆగస్టు వరకు ఆమె నిర్వహించిన బాధ్యతలు, సంబంధిత రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఆస్పత్రిలో పనిచేసిన ఒప్పంద ఉద్యోగి చందు నియామక కాలపరిమితి, ఆస్పత్రిలో కొనసాగింపుపై వివరాలను కూడా ఆడిట్ బృందం సేకరిస్తోంది. మరోవైపు గతంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో పనిచేసి పదవీ విరమణ చేసిన, బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన మాజీ సూపరింటెండెంట్లను కూడా కమిటీ విచారిస్తోంది.
Also Read:
‘రెండు నెలలు ఆలస్యం’ ప్రచారం అవాస్తవం.. ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ క్లారిటీ..
సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా