రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ హర్షం..
ABN , Publish Date - Sep 29 , 2026 | 02:59 PM
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సర్వతోముఖ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. డిప్యూటీ సీఎం ఆలోచన, కార్యాచరణతో పల్లెలు ప్రగతిపథంలో ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గ్రామీణ మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో పల్లె పండుగ కార్యక్రమం కీలకంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. రూ.11,085 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. శ్రీకాళహస్తి ఆస్పత్రిలో స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ
‘రెండు నెలలు ఆలస్యం’ ప్రచారం అవాస్తవం.. ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ క్లారిటీ..