ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు: కర్ణాటక హైకోర్టు
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:29 PM
ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్, వృత్తి విద్యా కోర్సుల్లో NRI సీట్లు ప్రత్యేక కేటగిరీ కిందకే వస్తాయని హైకోర్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని NRI సీట్లు ప్రత్యేక కేటగిరీ కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ఈ సీట్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వేషన్లు వర్తించవని తెలిపింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు నిధుల సమీకరణే NRI కోటా సీట్ల ప్రధాన ఉద్దేశమని న్యాయస్థానం పేర్కొంది.
18 ఏళ్ల నీట్-యూజీ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. NRI కోటా సీట్లకు సామాజిక రిజర్వేషన్లను వర్తింపజేయడం సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. నీట్-యూజీ కౌన్సెలింగ్‌లో ప్రవాస భారతీయుల (NRI) కోటా సీట్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవని కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం. నాగప్రసన్న, జస్టిస్ హేమ కులకర్ణిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. NRI కోటా కింద సీట్ల కేటాయింపును ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది.
Also Read:
బిహార్, యూపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
నిరసన బాట పట్టాలని 'జెన్ జీ' యువతకు రాహుల్ గాంధీ పిలుపు