Share News

నిరసన బాట పట్టాలని 'జెన్ జీ' యువతకు రాహుల్ గాంధీ పిలుపు

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:04 PM

మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'జెన్ జీ' యువతకు పిలుపునిచ్చారు. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు.

నిరసన బాట పట్టాలని 'జెన్ జీ' యువతకు రాహుల్ గాంధీ పిలుపు
Rahul Gandhi Urges Gen Z to Protest for Women’s Safety

ఢిల్లీ, సెప్టెంబర్ 29: మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలపాలని, మహిళల రక్షణ కోసం పోరాడాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.


నేరం చేసిన వారిని కాపాడి, బాధితులనే నిందించే సంస్కృతిని, వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మహిళలు బయటకు రావడానికి భయపడుతుంటే 'ఇళ్లలోనే ఉండండి' అని పరిమితులు విధించడం పితృస్వామ్య భావజాలానికి సంకేతమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత మహిళా రక్షణ కోసం రోడ్లపైకి వస్తున్నారని, ముఖ్యంగా 'జెన్ జీ' యువతులు మరింత పెద్ద సంఖ్యలో శాంతియుత నిరసనల్లో పాల్గొనాలని ఆయన కోరారు.


ఈ వార్తలనూ చదవండి:

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

Updated Date - Sep 29 , 2026 | 05:17 PM