అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో తన్విర్ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే
ABN , Publish Date - Oct 19 , 2026 | 09:01 PM
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది మొహమ్మద్ తన్విర్ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది మొహమ్మద్ తన్విర్ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ పేలుళ్ల కేసులో అంతకుముందు 38 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు గుజరాత్ హైకోర్టు వేసిన మరణశిక్షను తన్విర్.. సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. అతని పిటిషన్‌ను విచారించిన బెంచ్ అతని మరణశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఈనెల 9న ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ కేసు ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టును ఆదేశించింది. తన్విర్కు సంబంధించి ప్రొబేషన్ అధికారులు సిద్ధం చేసిన రిపోర్టులను 8 వారాల్లోగా సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వానికి కూడా బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, జైల్లో ఉన్న సమయంలో తన్విర్ ప్రవర్తనకు సంబంధించి 8 వారాల్లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌నూ ఆదేశించింది. అలాగే అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో సైకలాజికల్ పరీక్షలు చేయించాలని, దానికి సంబంధించిన రిపోర్టులను కూడా 8 వారాల్లోపు సమర్పించాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచించింది. తదుపరి విచారణను 12కు వారాలకు వాయిదా వేసింది. కాగా.. ఈ పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు 2022 ఫిబ్రవరిలో 38 మందికి మరణశిక్ష, 11 మంది జీవితఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఈ ఏడాది జులై 7న గుజరాత్ హైకోర్టు సమర్థించింది. తర్వాత దోషులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. కాగా.. 2008 జులై 26న అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 56 మంది చనిపోగా.. 200 మందిపైనే గాయపడ్డారు.
ఈ వార్తలూ చదవండి:
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో