Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 11 , 2026 | 08:23 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Feb 11, 2026 20:32 IST

    అమరావతి: 24 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం

    • ఇరిగేషన్‌లో 7,189 పనుల నిర్వహణకు పరిపాలనా అనుమతులు

    • భూముల బదిలీ చట్టసవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం

    • ప్రభుత్వ భూముల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు జూన్‌ వరకు పెంపు

    • ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాలు బయోగ్యాస్‌ ప్లాంట్‌కు ఇచ్చేందుకు ఆమోదం

    • నంద్యాల జిల్లా సంజామలలో సౌరవిద్యుత్‌ ప్రాజెక్ట్‌కు 1,500 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం

  • Feb 11, 2026 19:38 IST

    రేపు భారత్‌ బంద్‌కు 10 కార్మిక, రైతు సంఘాల పిలుపు

    • 4 కొత్త లేబర్‌ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్

    • రేపటి భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు

    • బంద్‌లో పాల్గొనాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు AICC లేఖ

  • Feb 11, 2026 18:34 IST

    అసెంబ్లీ ముగిశాక పేషీలో ఉండి ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

    • సభలో మంత్రుల జవాబులు క్లుప్తంగా ఉండాలి: చంద్రబాబు

    • సచివాలయాల పేరును స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేందుకు అనుమతి: చంద్రబాబు

    • అసైన్డ్‌ భూములను సోలార్‌ ఎనర్జీ కింద కౌలుకు ఇచ్చేందుకు అనుమతి: చంద్రబాబు

    • ఎకరానికి ఏటా రూ.30 వేలు, రెండేళ్లకు 5 శాతం పెంచేలా కేబినెట్‌ అనుమతి: చంద్రబాబు

    • శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు: చంద్రబాబు

    • జలజీవన్‌ మిషన్‌ కింద రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది: చంద్రబాబు

  • Feb 11, 2026 17:44 IST

    అమరావతి: కొనసాగుతున్న ఏపీ మంత్రి మండలి సమావేశం

    • 24 అంశాలు ఎజెండాగా మంత్రిమండలి

    • పలు బిల్లులకు నేడు క్యాబినెట్‌లో ఆమోదం

    పూర్తి కథనం

  • Feb 11, 2026 17:30 IST

    తిరుపతి: సినీ ఫక్కీలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా

    • సినీ ఫక్కీలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా

    • ట్రాక్టర్ ట్యాంకర్‌లో రూ.1.65 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు

    • 72 దుంగలను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేసిన పోలీసులు

  • Feb 11, 2026 17:29 IST

    గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ

    • గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో పీటీ వారెంట్ వేసిన సత్తెనపల్లి పోలీసులు

    • సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన అంబటి రాంబాబు

    • అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలు

    పూర్తి కథనం

  • Feb 11, 2026 17:16 IST

    థాయ్‌లాండ్‌లో దుండగుల కాల్పులు

    • సోంక్లాలోని డే కేర్‌ సెంటర్‌పై దాడులు

    • 23మంది చిన్నారులు సహా 30మందికి పైగా మృతి

    పూర్తి కథనం

  • Feb 11, 2026 16:50 IST

    సంగారెడ్డి: ఇంద్రేశం వద్ద స్క్రాప్‌ గోదాంలో అగ్నిప్రమాదం

    • ఇంద్రేశం సమీపంలోని ఓ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు

    • మంటలను అదుపుచేస్తున్న ఫైర్‌ సిబ్బంది

  • Feb 11, 2026 16:49 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: భారత్-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్..

    • భారీగా పెరిగిన కొలంబో వెళ్లే విమానాల టికెట్ ధరలు

    • రూ.30వేల నుంచి రూ.90వేలకు పెరిగిన సాధారణ విమాన టికెట్ ధర

    • బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.1,92,000

    • ఈనెల 15న కొలంబో వేదికా భారత్, పాక్ మధ్య గ్రూప్ మ్యాచ్

  • Feb 11, 2026 16:47 IST

    జీబీఓ ఉద్యోగులకు గూగుల్ కంపెనీ షాక్.!

    • ఏఐ రంగానికి గూగుల్ ప్లాన్స్‌తో ఏకీభవించాలని ఉద్యోగులకు స్పష్టం

    • లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవచ్చని సూచన

    • జీబీఓ విభాగానికి చెందిన ఉద్యోగులకు లేఖ ద్వారా చీఫ్ ఫిలిప్ షిండ్లర్ వెల్లడి

    పూర్తి కథనం

  • Feb 11, 2026 16:41 IST

    జగన్ అండ్ కో పై సీఎం చంద్రబాబు ధ్వజం

    • అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని సీఎం సూచన

    • కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని చంద్రబాబు వ్యాఖ్య

    • టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు నోరుజారొద్దని పార్టీ నేతలకు హితవు

    పూర్తి కథనం

  • Feb 11, 2026 16:08 IST

    నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు

    • హైదరాబాద్‌: నాంపల్లి FSLలో అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు..

    • FSLలో CFSL, నాగ్‌పూర్ ఫైర్ నిపుణుల బృందాల తనిఖీ..

    • FSLలో దగ్ధమైన మెటీరియల్స్‌ శాంపిల్స్‌ సేకరించిన CFSL ..

    • ప్రమాదానికి గల కారణాలపై నాగ్‌పూర్‌ నిపుణుల బృందం ఆరా..

  • Feb 11, 2026 16:04 IST

    లోక్‌సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల దుమారం

    • ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పై రాహుల్‌ అసత్య ఆరోపణలు: కిరణ్ రిజిజు

    • సాయంత్రం 5 గంటల లోపు రాహుల్‌ వివరణ ఇవ్వాలి: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు

  • Feb 11, 2026 15:59 IST

    నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దొంగల హల్‌చల్..

    • నెల్లూరు: వెంకటగిరిలోని బంగారుపేటలో మంగళవారం అర్ధరాత్రి దొంగల హల్‌చల్..

    • మంజులమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు..

    • మహిళ మెడలో నుంచి 2 సవర్ల బంగారు గొలుసు అపహరణ..

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..

  • Feb 11, 2026 15:50 IST

    టీ20 ప్రపంచ కప్ 2026 అప్డేట్..

    • సౌతాఫ్రికా, అఫ్గాన్ మ్యాచ్‌లో తొలి సూపర్ ఓవర్ టై

    • తొలి సూపర్‌ ఓవర్‌

    • అఫ్గానిస్థాన్‌- 17/0

    • సౌతాఫ్రికా- 17/1

    • రెండో సూపర్ ఓవర్‌తో తేలిన సౌతాఫ్రికా, అఫ్గాన్ మ్యాచ్ ఫలితం

    • రెండో సూపర్ ఓవర్‌తో గెలిచిన సౌతాఫ్రికా..

    • 4 పరుగుల తేడాతో గెలిచిన సఫారీ జట్టు

    • దక్షిణాఫ్రికా 23/0, అఫ్గాన్ 19/2

  • Feb 11, 2026 15:41 IST

    మిశ్రమ ఫలితాలతో ముగిసిన భారత మార్కెట్లు

    • ఇవాళ (బుధవారం) మిశ్రమ ఫలితాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

    • స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టీ, స్వల్ప నష్టంతో క్లోజ్ అయిన సెన్సెక్స్..

    • నిఫ్టీ 18.70 పాయింట్లు పెరిగి 25,953.85 దగ్గర ముగిసింది..

    • సెన్సెక్స్ 40.28 పాయింట్లు కోల్పోయి 84,233.64 వద్ద ముగిసింది..

  • Feb 11, 2026 15:39 IST

    ఎన్నికలు రద్దు చేయాలి: జగ్గారెడ్డి

    • శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే సీఐ శివకుమార్‌ వచ్చారు: జగ్గారెడ్డి

    • సీఐ శివకుమార్‌ అండతో BRS అభ్యర్థి రిగ్గింగ్‌: జగ్గారెడ్డి

    • సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఎన్నికలు రద్దు చేయాలి: జగ్గారెడ్డి

    • సీఐ శివకుమార్‌ను సస్పెండ్‌ చేయాలి: జగ్గారెడ్డి

  • Feb 11, 2026 15:36 IST

    గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

    • అమరావతి: APPSC గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..

    • గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఉత్తర్వులు..

    • అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు..

    • అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు..

    • ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..

  • Feb 11, 2026 15:33 IST

    టీ20 వరల్డ్‌ కప్: ఆఫ్గనిస్థాన్‌పై సౌతాఫ్రికా విజయం

    • రెండో సూపర్‌ ఓవర్‌లో తేలిన మ్యాచ్‌ ఫలితం..

    • సూపర్‌ ఓవర్‌లో సౌతాఫ్రికా 23 పరుగులు..

    • 19 పరుగులే చేసిన ఆఫ్గనిస్థాన్..

    • ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం..

  • Feb 11, 2026 15:24 IST

    టీ20 ప్రపంచ కప్-2026 అప్డేట్..

    • సూపర్ ఓవర్‌తో తేలిన సౌతాఫ్రికా, అఫ్గాన్ మ్యాచ్ ఫలితం

    • సూపర్ ఓవర్లతో గెలిచిన సౌతాఫ్రికా..

    • సూపర్ ఓవర్లలో 4 పరుగుల తేడాతో గెలిచిన సఫారీ జట్టు

    • సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా 23/0, అఫ్గాన్ 19/2

  • Feb 11, 2026 15:14 IST

    టీ20 ప్రపంచ కప్2026: టెన్షన్ పుట్టించిన సఫారీ-అఫ్గాన్ మ్యాచ్

    • సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్

    • సౌతాఫ్రికా 187/6, అఫ్గాన్ 187/10

    • సూపర్ ఓవర్‌తో తేలనున్న విజేత

  • Feb 11, 2026 14:51 IST

    అంతా ఉ.9 గంటలకు అసెంబ్లీకి రావాల్సిందే: సీఎం చంద్రబాబు

    • ఉదయం నుంచి నేనూ అసెంబ్లీలోనే ఉంటా: సీఎం చంద్రబాబు

    • ఎవరేం మాట్లాడుతున్నారో గమనిస్తా..

    • ఏపీలో రూ.లక్ష కోట్ల జాతీయ రహదారుల పనులు..

    • విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది: సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు నాయుడు

  • Feb 11, 2026 14:48 IST

    అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..

    • గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..

    • ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి..

  • Feb 11, 2026 13:53 IST

    వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

    • హిందూ మతాన్ని.. వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: ఏపీ డిప్యూటీ సీఎం

    • దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని గౌరవిస్తారు..

    • ఏపీలో జగన్ అండ్ కో కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    పూర్తి కథనం..

  • Feb 11, 2026 13:48 IST

    కాంగ్రెస్‌, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ

    • ఖమ్మం: ఏదులాపురం జలగంనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత..

    • కాంగ్రెస్‌, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..

    • అడ్డుకున్న పోలీసులపై తిరగబడిన BRS కార్యకర్తలు..

    • పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం..

  • Feb 11, 2026 13:46 IST

    ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోంది: రాహుల్‌ గాంధీ

    • లోక్‌సభ సమావేశాలు: ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోంది: రాహుల్‌ గాంధీ

    • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం ఉందని అంటున్నారు..

    • ప్రతిభావంతులైన యువతరం భారత్‌కు పెద్ద ఆస్తి..

    • చైనా, భారత్‌.. ప్రపంచంలో అతిపెద్ద డేటా కేంద్రాలు..

    • వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తి భారత్‌కు సానుకూలాంశం: రాహుల్‌ గాంధీ

    పూర్తి కథనం..

  • Feb 11, 2026 13:30 IST

    రూ.35 లక్షల విలువైన 70 కిలోల గంజాయి సీజ్..

    • హైదరాబాద్‌లో రూ.35 లక్షల విలువైన 70 కిలోల ఎండు గంజాయి సీజ్..

    • వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్..

    • గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

    • ఒడిశాలో పండించిన గంజాయిని హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్..

  • Feb 11, 2026 13:21 IST

    వైసీపీ అవకాశం ఇవ్వకపోతే... సొంతంగా పోటీ చేస్తా: దువ్వాడ శ్రీనివాస్‌

    • అమరావతి: వైసీపీ అవకాశం ఇవ్వకపోతే.. సొంతంగా పోటీ చేస్తా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

    • వైసీపీ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత.. మొదటిసారి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ..

    • మండలిలో నా వాణి వినిపిస్తాను.. జగన్‌ని త్వరలోనే కలుస్తాను..

    • లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

    పూర్తి కథనం..

  • Feb 11, 2026 13:03 IST

    అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్‌డీఏ పక్షాల సమావేశం

    • అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎన్‌డీఏ పక్షాల సమావేశం ప్రారంభం..

    • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు..

  • Feb 11, 2026 12:44 IST

    అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ అటెండెన్స్..

    • అమరావతి: అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి వస్తుంది: స్పీకర్

    • పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలే బయోమెట్రిక్ వాడుతున్నారు..

    • పార్లమెంట్‌లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉంది..

    • సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

  • Feb 11, 2026 12:30 IST

    ఉద్దేశపూర్వకంగానే లేఖలు రాసి ఉంటారు: మంత్రు కందుల దుర్గేష్‌

    • అమరావతి: నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు..

    • సత్యకుమార్, అనగాని, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్‌కు బెదిరింపు లేఖలు..

    • బెదిరింపు లేఖ చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు: మంత్రి కందుల దుర్గేష్‌

    • మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావిడి ఏముంది?..

    • ఎవరో ఉద్దేశపూర్వకంగానే రాసి ఉంటారు: మంత్రు కందుల దుర్గేష్‌

    పూర్తి కథనం..

  • Feb 11, 2026 12:24 IST

    మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

    • ఈ నెల 14, 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ..

    • మహాశివరాత్రి తర్వాత 16వ తేదీ సెలవు..

    • 17 పని దినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు..

    • అవసరమైతే పనిదినాలు పొడిగించాలని నిర్ణయం..

    • మొత్తం 6 ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టాలని నిర్ణయం..

  • Feb 11, 2026 12:15 IST

    ముగిసిన బీఏసీ సమావేశం

    • అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం..

    • మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

  • Feb 11, 2026 12:13 IST

    సంగారెడ్డిలోని ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం

    • సంగారెడ్డి: పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం..

    • భారీగా వ్యాపించిన మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది..

    • స్కూల్‌కు సెలవు కావడంతో తప్పిన ప్రమాదం..

    • ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్‌ కారణమని అనుమానం..

  • Feb 11, 2026 11:56 IST

    ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

    • సభాపతి అధ్యక్షతన బీఏసీ సమావేశం..

    • అసెంబ్లీ అజెండా ఖరారు చేయనున్న బీఏసీ..

  • Feb 11, 2026 11:55 IST

    అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ సరదా వ్యాఖ్యలు

    • 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు: స్పీకర్‌

    • అంతకు మించి ఎక్కువ సమయం లేరుగా..

    • సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిది: స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు

  • Feb 11, 2026 11:49 IST

    అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి లోకేష్ శ్రీకారం

    • అమరావతి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు..

    • రోజుకో పార్లమెంట్ పరిధిలోని... ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు..

    • నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారాలకు దిశా నిర్దేశాలు..

  • Feb 11, 2026 11:31 IST

    ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన బీఏసీ సమావేశం..

    • అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన బీఏసీ సమావేశం..

    • అసెంబ్లీ పనిదినాలు, ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్ తదితర అంశాలపై చర్చ..

    • స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు..

  • Feb 11, 2026 11:27 IST

    ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం చెప్పాలి: బండి సంజయ్

    • ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్‌ రెడ్డివి ఊకదంపుడు ప్రసంగాలు మాత్రమే..

    • కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి భయపడుతున్నారా?.. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా?

    • రేవంత్‌కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

  • Feb 11, 2026 11:22 IST

    మరింత పెరిగిన కొలంబో విమాన టికెట్ ధరలు

    • ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్..

    • ఢిల్లీ, ముంబై నుంచి కొలంబోకు.. రూ.లక్ష మార్క్‌ను దాటిన విమాన టికెట్ ధరలు

  • Feb 11, 2026 11:05 IST

    మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై సందేహాలు

    • అమరావతి: మావోయిస్టుల పేరుతో మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై సందేహాలు..

    • ఈ లేఖ మావోయిస్టులు రాశారా.. లేక వేరే కోణం ఏదైనా ఉందా అనే దానిపై అనుమానాలు..

    • కందుల దుర్గేష్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ..

    పూర్తి కథనం..

  • Feb 11, 2026 10:58 IST

    జీరో పావర్టీ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ పాలన: గవర్నర్‌

    • ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టంతో అన్ని కుటుంబాలకూ ప్రయోజనం: గవర్నర్‌ ఎస్.అబ్దుల్ నజీర్

    • త్వరలో ఫ్యామిలీ కార్డు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు..

    • P4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు కృషి..

    • పేదల ఆకలి తీర్చేందుకు 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లు: గవర్నర్‌ ఎస్.అబ్దుల్ నజీర్

  • Feb 11, 2026 10:23 IST

    ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్‌..

    • అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే సభ నుంచి వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు

    • 11 నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్‌, వైసీపీ సభ్యులు

    • జై జగన్‌ అంటూ అసెంబ్లీ వెలుపుల వైసీపీ సభ్యుల నినాదాలు..

    పూర్తి కథనం..

  • Feb 11, 2026 10:10 IST

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..

    • అమరావతి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..

    • అసెంబ్లీలో నేరుగా పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లిన లోకేష్..

    • తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ..

    • అరగంట తర్వాత భేటీలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

  • Feb 11, 2026 10:04 IST

    అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యుల నినాదాలు..

    • అమరావతి: అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యుల నినాదాలు..

    • రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలి అంటూ నినాదాలు..

    • ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు..

    • మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ నినాదాలు..

    • వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీలోకి ప్రవేశం..

  • Feb 11, 2026 09:19 IST

    నాలుగో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

    • నంద్యాల: శ్రీశైలంలో నాలుగో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

    • కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ..

    • సాయంత్రం టీటీడీ నుంచి రానున్న పట్టు వస్త్రాలు..

    • సాయంత్రం మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం..

    • రాత్రి క్షేత్ర పుర వీధుల్లో గ్రామోత్సవం..

  • Feb 11, 2026 08:34 IST

    మూడు కార్పొరేషన్లకు కమిషనర్లు వీరే..

    • జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్.

    • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన.

    • మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి.

    • మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్‌ రంజన్ నియామకం.

    • కొత్త పాలకమండలి వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్.

    • మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ.

    • హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్.

    • లోక్‌భవన్ జాయింట్ సెక్రటరీగా కె.కిరణాచారి..

  • Feb 11, 2026 08:34 IST

    మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ..

    • జీహెచ్ఎంసీతో పాటూ సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లు..

    • 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

  • Feb 11, 2026 08:31 IST

    నారాయణపేట: మక్తల్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    • ఆత్మహత్య చేసుకున్న మహదేవ్ కుటుంబాన్ని పరామర్శించిన కిషన్‌రెడ్డి..

  • Feb 11, 2026 08:26 IST

    జలమండలి పరిధి విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

    • ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణ బాధ్యత జలమండలికి బదిలీ..

    • జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశం..

    • నీటి సరఫరా, మురుగు వ్యవస్థల నిర్వహణ చేపట్టనున్న జలమండలి..

    • మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేపట్టనున్న జలమండలి..

  • Feb 11, 2026 08:24 IST

    నేడు మధ్యాహ్నం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • పలవురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్.

    • తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ..

    • కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్..

    • ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం..

  • Feb 11, 2026 08:23 IST

    నేడు 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు

    • ఉభయసభల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ..

    • అవిశ్వాసం నోటీస్‌తో సమావేశాలకు స్పీకర్ దూరం..