-
-
Home » Mukhyaamshalu » ap telangana national international ABN Andhrajyothy General live updates of 11th february 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 11 , 2026 | 08:23 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 11, 2026 20:32 IST
అమరావతి: 24 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం
ఇరిగేషన్లో 7,189 పనుల నిర్వహణకు పరిపాలనా అనుమతులు
భూముల బదిలీ చట్టసవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం
ప్రభుత్వ భూముల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు జూన్ వరకు పెంపు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్‌కు ఇచ్చేందుకు ఆమోదం
నంద్యాల జిల్లా సంజామలలో సౌరవిద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,500 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం
-
Feb 11, 2026 19:38 IST
రేపు భారత్ బంద్‌కు 10 కార్మిక, రైతు సంఘాల పిలుపు
4 కొత్త లేబర్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్
రేపటి భారత్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
బంద్‌లో పాల్గొనాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు AICC లేఖ
-
Feb 11, 2026 18:34 IST
అసెంబ్లీ ముగిశాక పేషీలో ఉండి ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు
సభలో మంత్రుల జవాబులు క్లుప్తంగా ఉండాలి: చంద్రబాబు
సచివాలయాల పేరును స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేందుకు అనుమతి: చంద్రబాబు
అసైన్డ్ భూములను సోలార్ ఎనర్జీ కింద కౌలుకు ఇచ్చేందుకు అనుమతి: చంద్రబాబు
ఎకరానికి ఏటా రూ.30 వేలు, రెండేళ్లకు 5 శాతం పెంచేలా కేబినెట్ అనుమతి: చంద్రబాబు
శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు: చంద్రబాబు
జలజీవన్ మిషన్ కింద రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది: చంద్రబాబు
-
Feb 11, 2026 17:44 IST
అమరావతి: కొనసాగుతున్న ఏపీ మంత్రి మండలి సమావేశం
24 అంశాలు ఎజెండాగా మంత్రిమండలి
పలు బిల్లులకు నేడు క్యాబినెట్లో ఆమోదం
-
Feb 11, 2026 17:30 IST
తిరుపతి: సినీ ఫక్కీలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా
సినీ ఫక్కీలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా
ట్రాక్టర్ ట్యాంకర్లో రూ.1.65 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు
72 దుంగలను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేసిన పోలీసులు
-
Feb 11, 2026 17:29 IST
గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ
గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో పీటీ వారెంట్ వేసిన సత్తెనపల్లి పోలీసులు
సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన అంబటి రాంబాబు
అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలు
-
Feb 11, 2026 17:16 IST
థాయ్‌లాండ్‌లో దుండగుల కాల్పులు
సోంక్లాలోని డే కేర్ సెంటర్‌పై దాడులు
23మంది చిన్నారులు సహా 30మందికి పైగా మృతి
-
Feb 11, 2026 16:50 IST
సంగారెడ్డి: ఇంద్రేశం వద్ద స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం
ఇంద్రేశం సమీపంలోని ఓ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు
మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
-
Feb 11, 2026 16:49 IST
టీ20 ప్రపంచ కప్ 2026: భారత్-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్..
భారీగా పెరిగిన కొలంబో వెళ్లే విమానాల టికెట్ ధరలు
రూ.30వేల నుంచి రూ.90వేలకు పెరిగిన సాధారణ విమాన టికెట్ ధర
బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.1,92,000
ఈనెల 15న కొలంబో వేదికా భారత్, పాక్ మధ్య గ్రూప్ మ్యాచ్
-
Feb 11, 2026 16:47 IST
జీబీఓ ఉద్యోగులకు గూగుల్ కంపెనీ షాక్.!
ఏఐ రంగానికి గూగుల్ ప్లాన్స్‌తో ఏకీభవించాలని ఉద్యోగులకు స్పష్టం
లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవచ్చని సూచన
జీబీఓ విభాగానికి చెందిన ఉద్యోగులకు లేఖ ద్వారా చీఫ్ ఫిలిప్ షిండ్లర్ వెల్లడి
-
Feb 11, 2026 16:41 IST
జగన్ అండ్ కో పై సీఎం చంద్రబాబు ధ్వజం
అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని సీఎం సూచన
కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని చంద్రబాబు వ్యాఖ్య
టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు నోరుజారొద్దని పార్టీ నేతలకు హితవు
-
Feb 11, 2026 16:08 IST
నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు
హైదరాబాద్: నాంపల్లి FSLలో అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు..
FSLలో CFSL, నాగ్‌పూర్ ఫైర్ నిపుణుల బృందాల తనిఖీ..
FSLలో దగ్ధమైన మెటీరియల్స్ శాంపిల్స్ సేకరించిన CFSL ..
ప్రమాదానికి గల కారణాలపై నాగ్‌పూర్ నిపుణుల బృందం ఆరా..
-
Feb 11, 2026 16:04 IST
లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పై రాహుల్ అసత్య ఆరోపణలు: కిరణ్ రిజిజు
సాయంత్రం 5 గంటల లోపు రాహుల్ వివరణ ఇవ్వాలి: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
-
Feb 11, 2026 15:59 IST
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దొంగల హల్చల్..
నెల్లూరు: వెంకటగిరిలోని బంగారుపేటలో మంగళవారం అర్ధరాత్రి దొంగల హల్చల్..
మంజులమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు..
మహిళ మెడలో నుంచి 2 సవర్ల బంగారు గొలుసు అపహరణ..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..
-
Feb 11, 2026 15:50 IST
టీ20 ప్రపంచ కప్ 2026 అప్డేట్..
సౌతాఫ్రికా, అఫ్గాన్ మ్యాచ్‌లో తొలి సూపర్ ఓవర్ టై
తొలి సూపర్ ఓవర్
అఫ్గానిస్థాన్- 17/0
సౌతాఫ్రికా- 17/1
రెండో సూపర్ ఓవర్‌తో తేలిన సౌతాఫ్రికా, అఫ్గాన్ మ్యాచ్ ఫలితం
రెండో సూపర్ ఓవర్‌తో గెలిచిన సౌతాఫ్రికా..
4 పరుగుల తేడాతో గెలిచిన సఫారీ జట్టు
దక్షిణాఫ్రికా 23/0, అఫ్గాన్ 19/2
-
Feb 11, 2026 15:41 IST
మిశ్రమ ఫలితాలతో ముగిసిన భారత మార్కెట్లు
ఇవాళ (బుధవారం) మిశ్రమ ఫలితాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టీ, స్వల్ప నష్టంతో క్లోజ్ అయిన సెన్సెక్స్..
నిఫ్టీ 18.70 పాయింట్లు పెరిగి 25,953.85 దగ్గర ముగిసింది..
సెన్సెక్స్ 40.28 పాయింట్లు కోల్పోయి 84,233.64 వద్ద ముగిసింది..
-
Feb 11, 2026 15:39 IST
ఎన్నికలు రద్దు చేయాలి: జగ్గారెడ్డి
శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే సీఐ శివకుమార్ వచ్చారు: జగ్గారెడ్డి
సీఐ శివకుమార్ అండతో BRS అభ్యర్థి రిగ్గింగ్: జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఎన్నికలు రద్దు చేయాలి: జగ్గారెడ్డి
సీఐ శివకుమార్‌ను సస్పెండ్ చేయాలి: జగ్గారెడ్డి
-
Feb 11, 2026 15:36 IST
గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
అమరావతి: APPSC గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..
గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఉత్తర్వులు..
అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు..
అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు..
ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..
-
Feb 11, 2026 15:33 IST
టీ20 వరల్డ్ కప్: ఆఫ్గనిస్థాన్‌పై సౌతాఫ్రికా విజయం
రెండో సూపర్ ఓవర్లో తేలిన మ్యాచ్ ఫలితం..
సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా 23 పరుగులు..
19 పరుగులే చేసిన ఆఫ్గనిస్థాన్..
ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం..
-
Feb 11, 2026 15:24 IST
టీ20 ప్రపంచ కప్-2026 అప్డేట్..
సూపర్ ఓవర్‌తో తేలిన సౌతాఫ్రికా, అఫ్గాన్ మ్యాచ్ ఫలితం
సూపర్ ఓవర్లతో గెలిచిన సౌతాఫ్రికా..
సూపర్ ఓవర్లలో 4 పరుగుల తేడాతో గెలిచిన సఫారీ జట్టు
సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా 23/0, అఫ్గాన్ 19/2
-
Feb 11, 2026 15:14 IST
టీ20 ప్రపంచ కప్2026: టెన్షన్ పుట్టించిన సఫారీ-అఫ్గాన్ మ్యాచ్
సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్
సౌతాఫ్రికా 187/6, అఫ్గాన్ 187/10
సూపర్ ఓవర్‌తో తేలనున్న విజేత
-
Feb 11, 2026 14:51 IST
అంతా ఉ.9 గంటలకు అసెంబ్లీకి రావాల్సిందే: సీఎం చంద్రబాబు
ఉదయం నుంచి నేనూ అసెంబ్లీలోనే ఉంటా: సీఎం చంద్రబాబు
ఎవరేం మాట్లాడుతున్నారో గమనిస్తా..
ఏపీలో రూ.లక్ష కోట్ల జాతీయ రహదారుల పనులు..
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది: సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు నాయుడు
-
Feb 11, 2026 14:48 IST
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి..
-
Feb 11, 2026 13:53 IST
వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
హిందూ మతాన్ని.. వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: ఏపీ డిప్యూటీ సీఎం
దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని గౌరవిస్తారు..
ఏపీలో జగన్ అండ్ కో కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Feb 11, 2026 13:48 IST
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
ఖమ్మం: ఏదులాపురం జలగంనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత..
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..
అడ్డుకున్న పోలీసులపై తిరగబడిన BRS కార్యకర్తలు..
పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం..
-
Feb 11, 2026 13:46 IST
ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోంది: రాహుల్ గాంధీ
లోక్‌సభ సమావేశాలు: ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోంది: రాహుల్ గాంధీ
సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం ఉందని అంటున్నారు..
ప్రతిభావంతులైన యువతరం భారత్‌కు పెద్ద ఆస్తి..
చైనా, భారత్.. ప్రపంచంలో అతిపెద్ద డేటా కేంద్రాలు..
వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తి భారత్‌కు సానుకూలాంశం: రాహుల్ గాంధీ
-
Feb 11, 2026 13:30 IST
రూ.35 లక్షల విలువైన 70 కిలోల గంజాయి సీజ్..
హైదరాబాద్‌లో రూ.35 లక్షల విలువైన 70 కిలోల ఎండు గంజాయి సీజ్..
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్..
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
ఒడిశాలో పండించిన గంజాయిని హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్..
-
Feb 11, 2026 13:21 IST
వైసీపీ అవకాశం ఇవ్వకపోతే... సొంతంగా పోటీ చేస్తా: దువ్వాడ శ్రీనివాస్
అమరావతి: వైసీపీ అవకాశం ఇవ్వకపోతే.. సొంతంగా పోటీ చేస్తా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత.. మొదటిసారి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ..
మండలిలో నా వాణి వినిపిస్తాను.. జగన్‌ని త్వరలోనే కలుస్తాను..
లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
-
Feb 11, 2026 13:03 IST
అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ పక్షాల సమావేశం
అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభం..
హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు..
-
Feb 11, 2026 12:44 IST
అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ అటెండెన్స్..
అమరావతి: అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి వస్తుంది: స్పీకర్
పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలే బయోమెట్రిక్ వాడుతున్నారు..
పార్లమెంట్లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉంది..
సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
-
Feb 11, 2026 12:30 IST
ఉద్దేశపూర్వకంగానే లేఖలు రాసి ఉంటారు: మంత్రు కందుల దుర్గేష్
అమరావతి: నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు..
సత్యకుమార్, అనగాని, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్‌కు బెదిరింపు లేఖలు..
బెదిరింపు లేఖ చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు: మంత్రి కందుల దుర్గేష్
మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావిడి ఏముంది?..
ఎవరో ఉద్దేశపూర్వకంగానే రాసి ఉంటారు: మంత్రు కందుల దుర్గేష్
-
Feb 11, 2026 12:24 IST
మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 14, 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ..
మహాశివరాత్రి తర్వాత 16వ తేదీ సెలవు..
17 పని దినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు..
అవసరమైతే పనిదినాలు పొడిగించాలని నిర్ణయం..
మొత్తం 6 ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టాలని నిర్ణయం..
-
Feb 11, 2026 12:15 IST
ముగిసిన బీఏసీ సమావేశం
అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం..
మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
-
Feb 11, 2026 12:13 IST
సంగారెడ్డిలోని ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం
సంగారెడ్డి: పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం..
భారీగా వ్యాపించిన మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది..
స్కూల్‌కు సెలవు కావడంతో తప్పిన ప్రమాదం..
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం..
-
Feb 11, 2026 11:56 IST
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
సభాపతి అధ్యక్షతన బీఏసీ సమావేశం..
అసెంబ్లీ అజెండా ఖరారు చేయనున్న బీఏసీ..
-
Feb 11, 2026 11:55 IST
అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ సరదా వ్యాఖ్యలు
11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు: స్పీకర్
అంతకు మించి ఎక్కువ సమయం లేరుగా..
సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిది: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
-
Feb 11, 2026 11:49 IST
అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి లోకేష్ శ్రీకారం
అమరావతి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు..
రోజుకో పార్లమెంట్ పరిధిలోని... ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు..
నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారాలకు దిశా నిర్దేశాలు..
-
Feb 11, 2026 11:31 IST
ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన బీఏసీ సమావేశం..
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన బీఏసీ సమావేశం..
అసెంబ్లీ పనిదినాలు, ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్ తదితర అంశాలపై చర్చ..
స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు..
-
Feb 11, 2026 11:27 IST
ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం చెప్పాలి: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డివి ఊకదంపుడు ప్రసంగాలు మాత్రమే..
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?.. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా?
రేవంత్‌కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Feb 11, 2026 11:22 IST
మరింత పెరిగిన కొలంబో విమాన టికెట్ ధరలు
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఢిల్లీ, ముంబై నుంచి కొలంబోకు.. రూ.లక్ష మార్క్‌ను దాటిన విమాన టికెట్ ధరలు
-
Feb 11, 2026 11:05 IST
మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై సందేహాలు
అమరావతి: మావోయిస్టుల పేరుతో మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై సందేహాలు..
ఈ లేఖ మావోయిస్టులు రాశారా.. లేక వేరే కోణం ఏదైనా ఉందా అనే దానిపై అనుమానాలు..
కందుల దుర్గేష్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ..
-
Feb 11, 2026 10:58 IST
జీరో పావర్టీ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ పాలన: గవర్నర్
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంతో అన్ని కుటుంబాలకూ ప్రయోజనం: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
త్వరలో ఫ్యామిలీ కార్డు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు..
P4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు కృషి..
పేదల ఆకలి తీర్చేందుకు 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లు: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
-
Feb 11, 2026 10:23 IST
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్..
అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే సభ నుంచి వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు
11 నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్, వైసీపీ సభ్యులు
జై జగన్ అంటూ అసెంబ్లీ వెలుపుల వైసీపీ సభ్యుల నినాదాలు..
-
Feb 11, 2026 10:10 IST
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..
అమరావతి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..
అసెంబ్లీలో నేరుగా పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లిన లోకేష్..
తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ..
అరగంట తర్వాత భేటీలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..
-
Feb 11, 2026 10:04 IST
అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యుల నినాదాలు..
అమరావతి: అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యుల నినాదాలు..
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలి అంటూ నినాదాలు..
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు..
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ నినాదాలు..
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీలోకి ప్రవేశం..
-
Feb 11, 2026 09:19 IST
నాలుగో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
నంద్యాల: శ్రీశైలంలో నాలుగో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ..
సాయంత్రం టీటీడీ నుంచి రానున్న పట్టు వస్త్రాలు..
సాయంత్రం మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం..
రాత్రి క్షేత్ర పుర వీధుల్లో గ్రామోత్సవం..
-
Feb 11, 2026 08:34 IST
మూడు కార్పొరేషన్లకు కమిషనర్లు వీరే..
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి.
మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్ నియామకం.
కొత్త పాలకమండలి వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్.
మల్కాజ్గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ.
హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్.
లోక్‌భవన్ జాయింట్ సెక్రటరీగా కె.కిరణాచారి..
-
Feb 11, 2026 08:34 IST
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ..
జీహెచ్ఎంసీతో పాటూ సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు..
3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
-
Feb 11, 2026 08:31 IST
నారాయణపేట: మక్తల్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఆత్మహత్య చేసుకున్న మహదేవ్ కుటుంబాన్ని పరామర్శించిన కిషన్‌రెడ్డి..
-
Feb 11, 2026 08:26 IST
జలమండలి పరిధి విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణ బాధ్యత జలమండలికి బదిలీ..
జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశం..
నీటి సరఫరా, మురుగు వ్యవస్థల నిర్వహణ చేపట్టనున్న జలమండలి..
మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేపట్టనున్న జలమండలి..
-
Feb 11, 2026 08:24 IST
నేడు మధ్యాహ్నం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
పలవురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్.
తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ..
కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్..
ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం..
-
Feb 11, 2026 08:23 IST
నేడు 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు
ఉభయసభల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ..
అవిశ్వాసం నోటీస్‌తో సమావేశాలకు స్పీకర్ దూరం..