-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 1st June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 01 , 2026 | 06:34 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 01, 2026 21:33 IST
అమరావతి: పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
పంచాయతీలకు పన్ను ఎగవేస్తే ఉపేక్షించం: పవన్ కల్యాణ్
సామాన్యులే పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?
పన్ను ఎగవేతల వల్ల ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి: డిప్యూటీ సీఎం పవన్
-
Jun 01, 2026 21:32 IST
ఢిల్లీ: NHల నిర్వహణపై నితిన్ గడ్కరీ సమీక్ష
కాంట్రాక్టర్లకు కేంద్రమంత్రి గడ్కరీ హెచ్చరిక
NHల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించం: గడ్కరీ
వర్షాకాలంలో రోడ్డు భద్రతపై ముందస్తుచర్యలు చేపట్టాలి: గడ్కరీ
-
Jun 01, 2026 20:20 IST
ముంబై: బ్యాంక్ ఆఫ్ అమెరికా కాన్ఫరెన్స్‌లో మంత్రి నారా లోకేష్
సమర్థ నాయకత్వం, వేగం ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టాయి: మంత్రి లోకేష్
గూగుల్ మాదిరిగానే SME కంపెనీలు కూడా ముఖ్యం: మంత్రి లోకేష్
ఏపీలో 3 ఎకనామిక్ రీజియన్స్ అభివృద్ధి: మంత్రి లోకేష్
ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
-
Jun 01, 2026 20:19 IST
హైదరాబాద్: ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో టీజీ సీఎస్ సమావేశం
త్వరలో ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్: సీఎస్ రామకృష్ణారావు
EHS అమలుకు ప్రత్యేక ట్రస్ట్: సీఎస్ రామకృష్ణారావు
ట్రస్ట్‌కు ప్రత్యేక బ్యాంకు ఖాతా: సీఎస్ రామకృష్ణారావు
ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి: రామకృష్ణారావు
-
Jun 01, 2026 20:17 IST
కాకినాడ: చామవరంలో 'పేదల సేవ'లో కార్యక్రమం
కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి వెళ్లి రూ.4 వేల పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు
కల్లుగీత వృత్తిలో కష్టనష్టాలపై సీఎం చంద్రబాబు ఆరా
కార్మికుడు తెచ్చిన కల్లును రుచి చూసిన సీఎం చంద్రబాబు
-
Jun 01, 2026 20:17 IST
విజయవాడ: 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఉద్రిక్తత
పోలీసులు, అభిమానుల మధ్య తోపులాట
ఎంట్రీ గేటు మూసివేయడంతో ఫాన్స్ పడిగాపులు
సామర్థ్యానికి మించి పాస్‌లు ఎందుకు ఇచ్చారని మండిపాటు
-
Jun 01, 2026 19:44 IST
సిద్దిపేట: గజ్వేల్ మార్కెట్ యార్డు దగ్గర రైతులు ధర్నా
లారీలు రాకపోవడంతో సొంత వాహనాల్లోధాన్యాన్ని తరలించిన రైతులు
ఐకేపీ సెంటర్ నుంచి మార్కెట్ యార్డుకు ధాన్యం తరలింపు
-
Jun 01, 2026 19:41 IST
ఏపీలో 15 వేల మంది ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగులకు గుడ్ న్యూస్
పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు దస్త్రానికి సీఎం చంద్రబాబు ఆమోదం
త్వరలోనే క్యాబినెట్‌కు పంపే అవకాశం
ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తంచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
-
Jun 01, 2026 19:15 IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి మాటామంతీ
ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ ఆరా
తాగునీటి సమస్యలుంటే పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశం
మా ప్రభుత్వంలో ఆదిలాబాద్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పాం: సీఎం రేవంత్
ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం: సీఎం రేవంత్
-
Jun 01, 2026 18:41 IST
హైదరాబాద్‌లో రేపటి జనసేన సభకు అనుమతి నిరాకరణ
నవ నిర్మాణ సంకల్ప సభ తలపెట్టిన జనసేన
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరణ
నిరసనలు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా లభించని అనుమతి
అనుమతి కోసం కోర్టును ఆశ్రయించనున్న జనసేన
-
Jun 01, 2026 18:38 IST
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద విషాద ఘటన
గోదావరిలో స్నానానికి దిగి, ప్రమాదవశాత్తు ఇద్దరి మృతి
మృతదేహాల కోసం గాలిస్తున్న పోలీసులు
-
Jun 01, 2026 18:16 IST
కొమురంభీమ్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
కొత్తగూడలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
కాసేపట్లో కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్‌లో బహిరంగ సభ
-
Jun 01, 2026 18:15 IST
కొత్తగూడెం: పినపాకలో మంత్రి తుమ్మల పర్యటన
సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై పరిశీలన
జులై నాటికి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి: మంత్రి తుమ్మల
రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా భూసేకరణ: మంత్రి తుమ్మల
-
Jun 01, 2026 18:15 IST
ఖరీఫ్‌కు ఎరువుల కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు
కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖలు
యూరియా సరఫరాలో అంతరాయం ఉండదన్న కేంద్రం
యూరియా రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం
-
Jun 01, 2026 18:00 IST
హైదరాబాద్: రాయదుర్గం భూములకు మరోసారి భారీ ధర
TGIIC వేలంలో రూ.204 కోట్లు పలికిన ఎకరం
రెండు రోజుల క్రితం వేలంలో ఎకరం రూ.237 కోట్లు
ఇవాళ 5.09 ఎకరాలకు వేలం నిర్వహించిన TGIIC
-
Jun 01, 2026 17:35 IST
తమిళనాడు: నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: సీఎం విజయ్
ప్రజలు నన్ను సోదరుడిలా ఆదరించారు: సీఎం విజయ్
మా ప్రభుత్వం ప్రజలకు మంచి మాత్రమే చేస్తుంది
6 నెలల సమయమిచ్చి విమర్శిస్తామన్నారు: విజయ్
6 రోజుల నుంచే మాపై విమర్శలు చేస్తున్నారు: సీఎం విజయ్
-
Jun 01, 2026 17:10 IST
హైదరాబాద్: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం
మెడికవర్ ఆస్పత్రి దగ్గర సంఘం దాబాలో మంటలు
మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
-
Jun 01, 2026 17:09 IST
సిద్దిపేట: తొగుట మండలం రాంపూర్‌లో రైతుల ఆందోళన
లారీలు రాకపోవడంతో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
రాంపూర్ రహదారిపై రైతుల రాస్తారోకో
-
Jun 01, 2026 17:09 IST
కొమురంభీమ్ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి
కెరమెరి మండలం కొఠారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
అనంతరం కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్‌లో సీఎం రేవంత్ బహిరంగ సభ
-
Jun 01, 2026 16:10 IST
కూటమి ప్రభుత్వంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్
స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం: అజయ్ జైన్
ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం: అజయ్ జైన్
జాతీయ, అంతర్జాతీయంగా ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహం
అర్హత కలిగిన క్రీడాకారులతో DSCలో నియామకాలు: అజయ్ జైన్
-
Jun 01, 2026 15:42 IST
ఢిల్లీ: ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి భేటీ
జార్ఖండ్ రాజకీయాలపై ఏఐసీసీకి భట్టి నివేదిక
హేమంత్ సోరెన్‌తో చర్చల వివరాలు ఖర్గేకు వెల్లడి
రాజ్యసభ ఎన్నికలపై ఏఐసీసీ ఫోకస్
-
Jun 01, 2026 15:41 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
508 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
165 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 01, 2026 15:40 IST
తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నం
తెలంగాణను కించపరిస్తే ఊరుకోం: MLA యెన్నం
ఏపీ, తెలంగాణ మధ్య BRS వైషమ్యాలు రెచ్చగొడుతోంది
ఖమ్మంలో BRS నేతలు NTR విగ్రహం పెట్టలేదా?: యెన్నం
-
Jun 01, 2026 15:39 IST
నల్గొండ: హాలియాలోని ఇంట్లో పేలిన 4 గ్యాస్ సిలిండర్లు
మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
-
Jun 01, 2026 15:39 IST
నిర్మల్: పెంబి మండలం కొరకంటి తండాలో విషాదం
విద్యుత్ షాక్‌తో తండ్రి అర్జున్, కుమారుడు శ్రీనివాస్ మృతి
-
Jun 01, 2026 15:26 IST
వరి సాగులో దేశంలో తెలంగాణ టాప్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా 8,575 కేంద్రాలు ఏర్పాటు: మంత్రి ఉత్తమ్
64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: ఉత్తమ్
తడిసిన ధాన్యం కూడా MSPకే కొనుగోలు: ఉత్తమ్
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నగదు జమ: మంత్రి ఉత్తమ్
-
Jun 01, 2026 15:26 IST
ముంబై: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఏపీకి వస్తున్న పెట్టుబడులపై ఫడ్నవీస్‌కు వివరించిన మంత్రి నారా లోకేష్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై వివరాలు తెలిపిన లోకేష్
ఏపీ విద్యాశాఖలో సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై చర్చ
మహారాష్ట్రలో ఉత్తమ ఐటీ, విద్యా విధానాలపై మంత్రి లోకేష్ ఆరా
-
Jun 01, 2026 15:25 IST
నా కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారు: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఫోన్లు ట్యాప్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
-
Jun 01, 2026 15:16 IST
హైదరాబాద్‌లో రేపు సమావేశంపై జనసేన ట్వీట్
ఓ నా తమ్ముడూ.. అంటూ గద్దర్ పలుకులతో 17 సెకండ్ల వీడియో పోస్ట్
రేపటి కాలం మనదే, విజయం మనదే అంటూ ట్వీట్
-
Jun 01, 2026 14:38 IST
నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసం వెనుక వైసీపీ కుట్ర: మంత్రి అనగాని సత్యప్రసాద్
వారే ధ్వంసం చేసి.. వారే గొడవ చేస్తున్నారు: మంత్రి అనగాని
మాపై బురదజల్లే డ్రామాలు వైసీపీకి కొత్తకాదు: మంత్రి అనగాని
-
Jun 01, 2026 14:30 IST
ప్రకాశం: చీమకుర్తిలోని గ్రానైట్ కంపెనీలో అధికారుల తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, రాయల్టీ చెల్లింపుల్లో అక్రమాలపై అధికారుల సోదాలు
ఎంపీ అవినాష్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి చెందిన క్వారీలో తనిఖీలు
-
Jun 01, 2026 14:29 IST
BRS పాలనలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాశారు: MLA యెన్నం
ఫోన్ ట్యాపింగ్‌పై నిక్కచ్చిగా దర్యాప్తు చేసి సూత్రధారులు ఎవరో తేల్చాలి: యెన్నం
ఫోన్ ట్యాపింగ్‌పై మా పోరాటం ఆగదు: యెన్నం
దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి: MLA యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
-
Jun 01, 2026 13:39 IST
పల్నాడు: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరోసారి భూకబ్జా ఆరోపణలు
తమ భూమి కబ్జా చేశారని వినుకొండకు చెందిన దళిత కుటుంబం ఆరోపణలు
బ్రాహ్మణపల్లి గ్రామంలో 2 ఎకరాల భూమి కబ్జా చేసిన బొల్లా
-
Jun 01, 2026 13:33 IST
నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఓఎంఆర్ పద్ధతిలోనే జూన్ 21న నీట్ ఎగ్జామ్ నిర్వహణ: సుప్రీంకోర్టు
కంప్యూటర్ ఆధారంగా నిర్వహించాలన్న పిటిషన్ కొట్టివేత
-
Jun 01, 2026 13:30 IST
సుప్రీంకోర్టుకు ఐదుగురి కొత్త న్యాయమూర్తుల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సుప్రీంకోర్టు జడ్జిలుగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి
-
Jun 01, 2026 13:24 IST
పంజాబ్: లుధియానాలో విషాదం.. ఓ ఫ్యాక్టరీలో లీకైన విషవాయువు
ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి
మరో నలుగురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Jun 01, 2026 13:10 IST
చిత్తూరు: కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
అర్హతలు ఉన్నా ANM ఉద్యోగం రాకపోవడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
అడ్డుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తరలింపు
-
Jun 01, 2026 13:09 IST
పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్ను వసూళ్లపై ఆరా
పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి పన్ను వసూళ్లు కావడంలేదనే అంశంపై చర్చ
-
Jun 01, 2026 13:03 IST
పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం: చంద్రబాబు
గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దుచేశారు: సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం 3 నెలల వరకు ఇస్తోంది: సీఎం చంద్రబాబు
ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు: సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తాం: చంద్రబాబు
గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా: చంద్రబాబు
-
Jun 01, 2026 12:57 IST
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని నేను, పవన్ కలిశాం: చంద్రబాబు
మూడు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాం: సీఎం చంద్రబాబు
మూడు పార్టీలు కలిసింది ఈ జూన్‌లోనే: సీఎం చంద్రబాబు
జూన్ నెలకో ప్రత్యేకత ఉంది: సీఎం చంద్రబాబు
పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందం వేరు: చంద్రబాబు
అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదు: సీఎం చంద్రబాబు
-
Jun 01, 2026 12:46 IST
అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం
చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
హాజరైన ఐజీలు రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి
సంకల్పం యాంటీ డ్రగ్ పోస్టర్‌ను విడుదల చేసిన డీజీపీ
-
Jun 01, 2026 12:39 IST
టాలెంట్ ఉన్నవారికే అధికార ప్రతినిధుల పదవులు: TPCC చీఫ్ మహేశ్
అధికార ప్రతినిధుల ఎంపికలో పారదర్శకత తప్పనిసరి: TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
-
Jun 01, 2026 12:27 IST
రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
గేట్ల నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి: సీఎం
నిర్వహణ నిధులు తక్షణమే విడుదల చేయాలి: రేవంత్
విపత్తు నిర్వహణ శాఖ దగ్గర ఉన్న రూ.వెయ్యి కోట్ల నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలి: సీఎం
-
Jun 01, 2026 12:19 IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్
HCA అక్రమాలపై సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు: CID చీఫ్ చారు సిన్హా
ఈ-ఫార్ములా కేసులో ఇప్పటికే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు
ఫార్ములా కేసులో త్వరలోనే విచారణ: CID చీఫ్ చారు సిన్హా
మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయమని ఆదేశం
మైనింగ్ అక్రమాలపై విచారించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలు మరోసారి ప్రచారం చేస్తే చర్యలు: CID చీఫ్
-
Jun 01, 2026 12:11 IST
ఆంధ్ర-తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు లేవు: కవిత
ఆంధ్రా రాజకీయ నేతలతోనే మన పంచాయితీ: కవిత
ఇక్కడ సీఎం ఏపీ రాజకీయ నేతలకు ఏజెంట్: కవిత
కుట్రలతో తెలంగాణపై ఏదిపడితే అది మాట్లాడుతున్నారు: కవిత
-
Jun 01, 2026 12:09 IST
కాకినాడ: తుని చేరుకున్న సీఎం చంద్రబాబు
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమం
చామవరంలో ప్రజావేదిక సభ
-
Jun 01, 2026 12:06 IST
ప్రియురాలి కోసం భారత్‌లోకి చొరబడ్డ పాక్ యువకుడు
వెను వెంటనే అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు
పాక్ యువకుడు, కశ్మీర్ యువతిని విచారిస్తున్న భద్రతా దళాలు
-
Jun 01, 2026 11:47 IST
తమిళనాడు రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
రాంగ్ రూట్లో వస్తున్న రెండు బైకులను ఢీకొన్న కారు
అనంతరం చెట్టును ఢీకొట్టిన వైనం
ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు
ఈ ఘటనలో బైకులపై ఉన్న ముగ్గురి మృతి
-
Jun 01, 2026 11:40 IST
బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హాజరుకానున్న బీజేపీ చీఫ్ నితిన్ నబీన్
-
Jun 01, 2026 11:39 IST
అమరావతి: నేడు మరోసారి జగన్ పీఏ KNRను ప్రశ్నించనున్న సిట్
ఇప్పటికే రెండు రోజులపాటు KNRను ప్రశ్నించిన సిట్
సిట్ విచారణకు సహకరించని KNR
KNR బినామీలు శివశంకర్‌రెడ్డి, వీరరెడ్డి ఆస్తులపై సిట్ విచారణ
నేడు సిట్ ఆఫీస్‌కు KNR, శివశంకర్ రెడ్డి
శివశంకర్‌రెడ్డి, KNRను విడివిడిగా, కలిపి ప్రశ్నించే అవకాశం
-
Jun 01, 2026 11:38 IST
అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
ఘటనలో వరుడితో సహా ఇద్దరి మృతి
ప్రాణాలతో బయటపడిన వధువు
అమెరికా జార్జియాలో ఘటన
-
Jun 01, 2026 11:24 IST
బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులను నిలదీసిన సామాన్యుడు
గవర్నర్ వస్తున్నారంటూ ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులు
ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన గర్భవతి
అధికారుల తీరును తప్పుబడుతూ రోడ్డుపై ఆమె భర్త ధర్నా
గవర్నర్ వస్తున్న సమయంలో మెరుపు ధర్నాతో బిత్తరపోయిన పోలీసులు
వెంటనే అతని కారు వదిలేసిన పోలీసులు
-
Jun 01, 2026 11:19 IST
ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై తెలంగాణ CID ఆపరేషన్
11 మందిని అరెస్ట్ చేసిన CID అధికారులు
నిందితుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు వారు
అరెస్టైన వారిలో నిర్వాహకులు, సహాయకులు ఉన్నట్లు గుర్తింపు
నిందితుల నుంచి బెట్టింగ్ పరికరాలు, సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ స్వాధీనం
ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేసిన CID
108 ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన CID
-
Jun 01, 2026 11:12 IST
గుంటూరు: ప్రముఖ విద్యావేత్త పాతూరి కోటేశ్వరరావు కన్నుమూత
విజ్ఞాన్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన పాతూరి కోటేశ్వరరావు
-
Jun 01, 2026 11:04 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన MLAలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి
ఇద్దరి వాంగ్మూలాలను రికార్డ్ చేయనున్న సిట్
-
Jun 01, 2026 10:53 IST
ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు
తమ డ్రోన్‌ను కూల్చినందుకు అమెరికా ప్రతీకార దాడులు
-
Jun 01, 2026 10:53 IST
హైదరాబాద్: కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరుకానున్న ఇద్దరు MLAలు
సిట్ విచారణకు హాజరుకానున్న MLAలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి
బంజారాహిల్స్ ICCC ఆఫీస్‌లో సిట్ విచారణ
ఇద్దరి వాంగ్మూలాలను రికార్డ్ చేయనున్న సిట్
గత ప్రభుత్వ హయాంలో MLAల ఫోన్ల ట్యాప్
-
Jun 01, 2026 10:49 IST
హైదరాబాద్ పాతబస్తీలో మహిళ అనుమానాస్పద మృతి
రెయిన్‌బజార్‌లో మదీహా బేగం అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి
ముందు ఆత్మహత్యగా భావించినప్పటికీ హత్యగా అనుమానిస్తున్న కుటుంబసభ్యులు
మూడోసారి బాలిక పుడుతుందనే కారణంతో అత్తింటివారు వేధించారని ఆరోపణలు
భర్త నిజార్, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
-
Jun 01, 2026 10:49 IST
తెలంగాణ CID సంచలన ఆపరేషన్
రూ.100 కోట్ల ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు ఛేదించిన CID
కరీంనగర్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు
బెట్టింగ్ యాప్‌లో రూ.6 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో తెలంగాణ CID సోదాలు
ఓ యాప్ కేంద్రంగా నడిచిన మోసం
11 మంది నిందితులను గుర్తించిన CID
-
Jun 01, 2026 10:37 IST
పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
నేటి నుంచి అమల్లోకి ఉచిత ప్రయాణ పథకం
-
Jun 01, 2026 10:25 IST
అనకాపల్లి: మాడుగుల మండలంలో ప్రమాదం.. ఇద్దరి మృతి
గాదిరాయి దగ్గర అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్
వరుణ్, సాయికిరణ్ అనే ఇద్దరు యువకుల మృతి
-
Jun 01, 2026 10:18 IST
ఈ నెల 3న బెంగళూరుకు సీఎం రేవంత్‌రెడ్డి
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న రేవంత్
కోహెడ మార్కెట్ శంకుస్థాపన తేదీ ఈ నెల 3 నుంచి 6కు మార్పు
-
Jun 01, 2026 10:11 IST
సికింద్రాబాద్: మారేడుపల్లి పీఎస్ పరిధిలో శ్రావణ్ అనే వ్యక్తి దారుణ హత్య
స్నేహితులే హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
మద్యం మత్తులో కత్తితో శ్రావణ్‌పై దాడి
-
Jun 01, 2026 10:06 IST
IPL ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వివాదం
వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మార్చడంపై అభ్యంతరాలు
బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌ను మార్చారన్న డీకే శివకుమార్
అన్యాయం చేశారంటూ డీకే మండిపాటు
-
Jun 01, 2026 09:19 IST
వికారాబాద్ మహావీర్ ఆస్పత్రిలో దారుణం
వైద్యం వికటించి పసిపాప మృతి
సీనియర్ డాక్టర్ సలహాతో జూ.డాక్టర్ వైద్యం చేయడంతో చిన్నారి మృతి చెందిందని కుటుంబసభ్యుల ఆరోపణ
-
Jun 01, 2026 09:03 IST
నేడు భారత్‌కు అమెరికా వాణిజ్య బృందం
మధ్యంతర ఒప్పందం ఖరారుపై భారత్-అమెరికా చర్చలు
4 రోజులు భారత్‌లో అమెరికా బృందం పర్యటన
మధ్యంతర వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేయనున్న బృందం
-
Jun 01, 2026 08:58 IST
చెన్నైలో కూలిన వసతి గృహం పైకప్పు
చెన్నై రామాపురంలో కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ వసతి గృహం పైకప్పు
35 మంది కార్మికులకు గాయాలు
-
Jun 01, 2026 08:53 IST
ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత
పలు జిల్లాల్లో తీవ్ర ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు
-
Jun 01, 2026 08:52 IST
నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
మోదీ 12ఏళ్ల పాలన, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ
నితిన్ నబీన్ అధ్యక్షతన సమావేశం
ఈ నెలలోనే కొత్త టీమ్ ప్రకటించనున్న నితిన్‌నబీన్
-
Jun 01, 2026 08:41 IST
మయన్మార్‌లో భారీ పేలుడు
46 మంది మృతి, మృతుల్లో ఆరుగురు చిన్నారులు
మరో 70 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గోడౌన్‌లో పేలుడు
-
Jun 01, 2026 08:34 IST
తిరుమల: మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
మే నెలలో శ్రీవారిని దర్శించుకున్న 25,46,168 మంది భక్తులు
హుండీ ద్వారా రూ.120.28 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారుల వెల్లడి
-
Jun 01, 2026 08:28 IST
నేడు విజయవాడలో 'పెద్ది' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్
ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
హాజరుకానున్న రామ్‌చరణ్, జాహ్నవి కపూర్
-
Jun 01, 2026 08:15 IST
ముంబై: అలనాటి బాలీవుడ్ గాయని సుమన్ కల్యాణ్‌పురి(89) కన్నుమూత
వయసు సంబంధిత ఆరోగ్య సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచిన గాయని
-
Jun 01, 2026 08:02 IST
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుణ్ని అదుపులోకి తీసుకున్న అధికారులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్లేందుకు వచ్చిన మున్ను స్వామి
అతడి వద్ద నుంచి ఫేక్ వీసా లభ్యం.. స్వాధీనం చేసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు
మున్ను స్వామిని విచారిస్తున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీసులు
-
Jun 01, 2026 07:43 IST
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల
అర్హత సాధించిన 56,880 మంది అభ్యర్థులు
టాపర్‌గా నిలిచిన ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ ప్రక్రియ
-
Jun 01, 2026 07:36 IST
గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
ఫైనల్ మ్యాచ్ అనంతరం హోటల్‌కు తిరిగి వెళ్తుండగా బస్సులో చెలరేగిన మంటలు
షార్ట్‌సర్య్కూట్ కారణంగా బస్సులో మంటలు
మార్గమధ్యలోనే నిలిచిపోయిన జీటీ టీమ్ బస్
అందరూ సురక్షితంగానే బయటపడినట్లు సమాచారం
-
Jun 01, 2026 07:28 IST
జయశంకర్ భూపాలపల్లి: నేటితో ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు
కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలాచరించి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
అనంతరం ముక్తీశ్వరాలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు
-
Jun 01, 2026 07:16 IST
హైదరాబాద్: రామంతపూర్‌లో బస్సు ప్రమాదం
ఆగిఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్న కారు
నుజ్జు నుజ్జయిన కారు ముందు భాగం
ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు
-
Jun 01, 2026 07:14 IST
మరోసారి పెరిగిన వాణిజ్య సిలిండర్ల ధరలు
19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.42 పెంపు
ఢిల్లీలో రూ.3,113కు కమర్షియల్ సిలిండర్ రేటు
హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,357
-
Jun 01, 2026 07:04 IST
రేపు తెలంగాణ జనసేన నేతలతో పవన్‌కల్యాణ్ భేటీ
గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో కీలక సమావేశం
తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై చర్చ
జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ
-
Jun 01, 2026 07:03 IST
తమిళనాడు: నేడు తిరుచ్చిలో సీఎం విజయ్ పర్యటన
బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారి తిరుచ్చికి విజయ్
బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం విజయ్
-
Jun 01, 2026 07:03 IST
నేడు ఢిల్లీకి డీకే శివకుమార్, సిద్దరామయ్య
కేబినెట్‌పై అధిష్ఠానంతో చర్చించనున్న డీకే శివకుమార్
ఈనెల 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
10-12 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
-
Jun 01, 2026 06:59 IST
నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్
10 రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు
నామినేషన్ల స్వీకరణకు విడుదల కానున్న షెడ్యూల్
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తేదీలను వెల్లడించనున్న ఎన్నికల సంఘం
-
Jun 01, 2026 06:56 IST
అనకాపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన
పాయకరావుపేట మండలం సత్యవరంలో పెన్షన్లు పంపిణీ చేయనున్న మంత్రి
అరట్లకోటలో పంట దెబ్బతిని మరణించిన బాధిత కుటుంబాలకు పరామర్శ
నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం దగ్గర ప్రజల నుంచి వినతుల స్వీకరణ
విద్యుత్ శాఖ అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి
-
Jun 01, 2026 06:47 IST
అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన.. ఆస్పత్రిలో వైద్యులతో ఘర్షణకు దిగిన మమత
వీడియో విడుదల చేసిన బీజేపీ నేత డెబ్‌జిత్ సర్కార్
-
Jun 01, 2026 06:39 IST
నేడు పశ్చిమ బెంగాల్ కేబినెట్ విస్తరణ
35 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం
-
Jun 01, 2026 06:38 IST
నేడు కొమురంభీమ్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
కెరమెరి మం. కొఠారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పైలాన్ ఆవిష్కరణ
ఆదివాసులతో మాట ముచ్చట, సహాపంక్తి భోజనం
తర్వాత కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్డులో భారీ బహిరంగ సభ
-
Jun 01, 2026 06:37 IST
నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమం
ఉదయం 11:00 గంటలకు చామవరంలో ప్రజావేదిక సభ
మ.2:00 గంటలకు పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
తర్వాత తుని టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం
-
Jun 01, 2026 06:37 IST
హైదరాబాద్: హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ సమీక్ష
ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా పథకం అమలు
ట్రస్టు కమిటీని నేడు ప్రకటించే అవకాశం