-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 9th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 09 , 2026 | 06:26 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Sep 09, 2026 06:50 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,350
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,410
కిలో వెండి ధర రూ.2,54,900
-
Sep 09, 2026 06:46 IST
ఆసియా క్రీడలు: టీమిండియా వసతులపై బీసీసీఐ వివరణ
జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్
జపాన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన హోటళ్లలోనే భారత ప్లేయర్లు ఉంటారు: బీసీసీఐ
అవి ఫైవ్‌స్టార్ కాకపోయినా మంచి హోటళ్లే: బీసీసీఐ
-
Sep 09, 2026 06:43 IST
నెల్లూరు జిల్లా: రాపూరు–చిట్వేలు ఘాట్‌లో చిరుతల సంచారం
ఘాట్ రోడ్డు పిట్టగోడపై కనిపించిన చిరుత.. వీడియో తీసిన ప్రయాణికులు
అటవీశాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాహనదారులు
-
Sep 09, 2026 06:40 IST
ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ
పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్ర కేబినెట్
-
Sep 09, 2026 06:35 IST
టిబెట్‌లో మరోసారి భూకంపం
భూకంప తీవ్రత 5.3గా నమోదు
నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన నేపాల్ ప్రభుత్వం
-
Sep 09, 2026 06:32 IST
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
ఈ నెల 16 వరకూ గడువు పొడిగిస్తూ ఉత్తర్వుల జారీ
-
Sep 09, 2026 06:30 IST
మంచిర్యాల : కాసిపేట మండలంలో చిరుత కలకలం
నాయకపు గూడ సమీపంలో చిరుత పులి సంచారం
అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన
-
Sep 09, 2026 06:27 IST
వెనక్కి తగ్గిన హాకీ ఇండియా
ఆసియా గేమ్స్ కోసం ప్రైమరీ కలర్‌గా బ్లూ
సెకండరీ చాయిస్‌గా కాషాయ రంగు
గతంలో జెర్సీ రంగు మార్చడంపై పలు విమర్శలు
-
Sep 09, 2026 06:25 IST
రాబోయే 5 రోజులు తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాలకూ వర్ష సూచన
-
Sep 09, 2026 06:20 IST
ప్రపంచంలో అత్యధిక జీతం అందుకుంటున్న సింగపూర్ పీఎం లారెన్స్ వాంగ్
ఇంతవరకూ ఏడాదికి రూ.16 కోట్లు తీసుకుంటున్న లారెన్స్ వాంగ్
తాజా పెంపుతో రూ.27 కోట్లకు చేరిన వేతనం
-
Sep 09, 2026 06:18 IST
ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు
ఖర్గ్ ద్వీపంలోని ఒమన్ గల్ఫ్‌లోని జాక్స్ దగ్గర క్షిపణులతో అటాక్
తమ నౌకలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించిందని అమెరికా ఆరోపణ
అమెరికా ఆయిల్ ట్యాంకర్లను టార్గెట్‌గా చేసుకుంటామని అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు
-
Sep 09, 2026 06:15 IST
దేశంలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు
ఆగస్టులో మొత్తం 2.98 లక్షల ఈవీల విక్రయం
గతేడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి
9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగిన మార్కెట్ హవా
-
Sep 09, 2026 06:12 IST
ఢిల్లీ మాజీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య
నోయిడాలోని తన ఫ్లాట్‌లో రాకేష్ మెహతా సూసైడ్
ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం
అనారోగ్యం, మానసిక ఒత్తిడే కారణమని వెల్లడి
-
Sep 09, 2026 06:10 IST
యూకే ఏటీసీలో సమస్య.. 300 విమానాల రద్దు
లండన్‌లోని హీత్రూ, స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌లకు రాకపోకలు సాగించే పలు సర్వీసుల రద్దు
హీత్రూ సహా పలు విమానాశ్రయాలపై ప్రభావం
-
Sep 09, 2026 06:08 IST
హైదరాబాద్: BRS ఎమ్మెల్యేలకు గవర్నర్ అపాయింట్‌మెంట్
మధ్యాహ్నం 12:30కు గవర్నర్‌ను కలవనున్న నేతలు
పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్యేలు
-
Sep 09, 2026 06:05 IST
తెలంగాణ: ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం
పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి సీతక్క
గ్రామ పంచాయతీల ఆదాయం సమీపంలోని నేషనల్ బ్యాంకులో జమ చేసుకునేలా చట్ట సవరణ
-
Sep 09, 2026 06:03 IST
నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
అంబాజీపేట మండలం ఇరుసుమండకు సీఎం చంద్రబాబు
మాచవరం జయంతి నగర్‌లో రైతులతో సీఎం ముఖాముఖి
పండువారిపేట గ్రామ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్న సీఎం
-
Sep 09, 2026 06:00 IST
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం