-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 24th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 24 , 2026 | 07:17 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 24, 2026 21:45 IST
తూ.గో. జిల్లా: దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై ప్రమాదం
బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
బైకుపై ఉన్న వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి గాయాలు
మృతుడు సంగాయిగూడెం గ్రామానికి చెందిన రమణ(18)గా గుర్తింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న దేవరపల్లి పోలీసులు
-
Jul 24, 2026 21:19 IST
ఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా
రవ్‌నీత్ సింగ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జూన్ 21తో రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రాజీనామా చేసిన రవ్‌నీత్ సింగ్
-
Jul 24, 2026 21:15 IST
NTR: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు
ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్ కుటుంబసభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
చీటింగ్, హత్యాయత్నం, గృహ హింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు
జోగి రమేష్, జోగి రాము కుటుంబాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు
-
Jul 24, 2026 20:00 IST
తుంగతుర్తి కాంగ్రెస్ నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నా: MLA రాజగోపాల్‌రెడ్డి
తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించా: MLA రాజగోపాల్‌రెడ్డి
MLAగా సామేల్‌ను గౌరవిస్తాం.. ఆయన మాటలకు కార్యకర్తలు స్పందించవద్దు
మాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు: MLA రాజగోపాల్‌రెడ్డి
-
Jul 24, 2026 19:48 IST
కోనసీమ: రామచంద్రపురం మండలం వెంకటపాలెంలో విషాద ఘటన
పంట కాలువలో స్నానానికి దిగి ముగ్గురి గల్లంతు
గల్లంతైన వారిలో ఇద్దరు యువకులు, ఒక బాలిక
కనికెళ్ల రంజిత్ కుమా ర్(17) మృతదేహం లభ్యం
వీరేంద్ర (19), వసుధ పావని (14)కోసం గాలింపు
-
Jul 24, 2026 19:44 IST
గుంటూరు: రాజధానిలో నిర్మాణ సామగ్రి చోరీ ముఠా అరెస్టు
చోరీ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశాం: గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జింధాల్
నిర్మాణంలోని భవనాల్లో చోరీలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి
నిందితులపై గతంలో 15 పాత కేసులు ఉన్నాయి: ఎస్పీ వకూల్ జింధాల్
రాజధానిలో నిఘా పెంచాం: ఎస్పీ వకూల్ జింధాల్
-
Jul 24, 2026 19:18 IST
అమరావతి: జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్
కమిటీల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన పవన్ కల్యాణ్
నాయకత్వ బాధ్యతల కోసం 36 వేలకు పైగా జనసైనికుల దరఖాస్తులు
కమిటీల నియామకాన్ని పర్యవేక్షిస్తున్న పవన్ కల్యాణ్
-
Jul 24, 2026 19:17 IST
NTAలో భారీ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధం
NTA నుంచి 47 మందిని తొలగించే చాన్స్
ప్రశ్నపత్రాల లీకేజ్ నివారణకు చర్యలు
ఆగస్టులో NTA పునర్‌వ్యవస్థీకరణకు అవకాశం
నిపుణుల కమిటీ సిఫార్సులతో సంస్కరణలు
-
Jul 24, 2026 19:16 IST
అమరావతి: ఆగస్ట్ 1న భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం ఉత్తర్వులు
ప్రధాని పర్యటన విజయవంతం కోసం మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు
కమిటీలో మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులు
కమిటీ కన్వీనర్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
-
Jul 24, 2026 19:14 IST
TG ప్రభుత్వ స్కూళ్ల బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీగా విరాళాలు
అరబిందో ఫార్మా నుంచి రూ.10 కోట్ల విరాళం
దివీస్ లేబొరేటరీస్ నుంచి రూ.12.18 కోట్ల CSR నిధులు
మొత్తం రూ.22.18 కోట్లతో బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు సహాయం
హరే కృష్ణ మూవ్‌మెంట్ ద్వారా విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
సెంట్రలైజ్డ్ కిచెన్లకు రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లపై సీఎం రేవంత్ దృష్టి
-
Jul 24, 2026 19:12 IST
సంగారెడ్డి: ఆందోల్ మండలం రాంసాన్ పల్లి వద్ద ప్రమాదం
ముందు వెళ్తున్న కారుని వెనుక నుంచి ఢీకొట్టిన మరో కారు
వెనుక కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
క్షతగాత్రులు హైదరాబాద్‌లోని మల్లెపల్లి వాసులుగా గుర్తింపు
-
Jul 24, 2026 18:42 IST
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతిపై CBI విచారణ జరపాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
3 బ్యారేజీల అంశంలో CBI దర్యాప్తు కోరాం: ఆది శ్రీనివాస్
రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రధాని సహా కేంద్ర మంత్రులే అన్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
Jul 24, 2026 18:33 IST
అమరావతి: ప్రపంచ వేదికపై ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల ఘనత
పోలియో టీకాపై కీలక పరిశోధనకు 'ది లాన్సెట్' గుర్తింపు'
ఆంధ్ర, కర్నూలు మెడికల్ కాలేజీలకు అంతర్జాతీయ గౌరవం
పరిశోధక వైద్యులు చక్రవర్తి, విజయానంద్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
ఇదే స్ఫూర్తిని మిగిలిన కళాశాలలూ కొనసాగించాలని మంత్రి ఆకాంక్ష
-
Jul 24, 2026 18:31 IST
తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం
డిజిటల్ అడ్వర్‌టైజింగ్ హబ్‌లుగా మీసేవ కేంద్రాలు
మెటా సహకారంతో నూతన సేవలకు శ్రీకారం
చిన్న వ్యాపారాలకు తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రకటనలు
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ప్రకటనల సేవలు
మీసేవ నిర్వాహకులకు అదనపు ఆదాయ అవకాశాలు
-
Jul 24, 2026 17:53 IST
హైదరాబాద్: కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ కౌంటర్
గ్లోబరినా సంస్థతో కేటీఆర్‌కు సంబంధం ఉంది: బల్మూర్ వెంకట్
గ్లోబరినా సంస్థ నాదే అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చెప్పిండు: బల్మూర్ వెంకట్
గ్లోబరినాతో సంబంధం లేదని కేటీఆర్ తన కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పాలి: బల్మూర్ వెంకట్
నీట్ లీకేజ్‌పై అన్ని ప్రాంతీయ పార్టీలూ ఢిల్లీ నడిబొడ్డుపై కొట్లాడుతున్నాయి: బల్మూర్ వెంకట్
కేసీఆర్, కేటీఆర్ స్పందించే ప్రయత్నం చేయలేదు: బల్మూర్ వెంకట్
-
Jul 24, 2026 17:40 IST
నీట్ పేపర్ లీక్ అవగానే కేంద్రం చర్యలు తీసుకుంది: బండి సంజయ్
పేపర్ లీక్ చేసిన 17 మందిని అరెస్టు చేశాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
విద్యార్థులు, తల్లిదండ్రులకు మోదీ భరోసా ఇచ్చారు: బండి సంజయ్
విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారు: బండి సంజయ్
విద్యార్థుల దీక్షకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది: బండి సంజయ్
విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Jul 24, 2026 17:39 IST
వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన CBI కోర్టు
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ సునీత పిటిషన్
కేసులో సమగ్ర విచారణ పూర్తిచేశామన్న CBI
CBI వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
-
Jul 24, 2026 17:38 IST
అమరావతిలో నాన్ గెజిటెడ్ టవర్స్ పనుల అంశంలో మరో ముందడుగు
L&T సంస్థకు రూ.83.99 కోట్ల పనుల ఒప్పంద పత్రం అందజేసిన AGICL
L&T సంస్థకు ఒప్పంద పత్రం అందజేసిన AGICL ఎండీ అభిషేక్ కుమార్
NGO టవర్స్ తుది దశ పనులకు L&Tకి బాధ్యతలు
STPలు, కాంపౌండ్ వాల్స్, ఫినిషింగ్ పనులు చేపట్టనున్న L&T
-
Jul 24, 2026 17:23 IST
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా జో రూట్!
మరోసారి ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా రూట్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం
ఇటీవలే రిటైర్‌మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్
-
Jul 24, 2026 17:11 IST
కోర్టు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు
సోషల్ మీడియాలో కోర్టు వీడియోలపై పిల్ దాఖలు
న్యాయస్థానం గౌరవానికి భంగం కలిగించే ముప్పుందన్న పిటిషనర్
ఈ పిల్‌లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కోర్టులు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కావన్న సర్వోన్నత న్యాయస్థానం
కోర్టు అనుమతులు లేనిదే వీడియోల షేరింగ్ కుదరదన్న సుప్రీం
-
Jul 24, 2026 16:32 IST
హిమాచల్ ప్రదేశ్ : చంబాలో ఘోర ప్రమాదం
వాహనంపై కూలిన కొండచరియలు, 13 మంది మృతి
-
Jul 24, 2026 16:13 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
గుంతకల్లు-బళ్లారి మధ్య 3, 4వ రైల్వే లైన్‌కు ఆమోదం
రూ.1,264 కోట్లతో మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి
కర్ణాటక-ఏపీ మధ్య రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్‌తో 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం
వేదవతి నదిపై పెద్ద రైల్వే వంతెన నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
రూ.3,030 కోట్లతో భవ్య రపాయన పథకానికి ఆమోదం
-
Jul 24, 2026 16:07 IST
రాజస్థాన్ జట్టును వీడటం పెద్ద రిస్కే: సంజు శాంసన్
సీఎస్కేలో చేరడానికి ముందు మూడు వారాల పాటు నా భార్యతో చర్చించా: సంజు
కొత్త సవాళ్లను స్వీకరించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం: సంజు
ఐపీఎల్ 2026కు ముందు ఆర్ఆర్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంజు
-
Jul 24, 2026 16:07 IST
CJP డిమాండ్లలో న్యాయం ఉంది: రాహుల్ గాంధీ
విద్యార్థులు శాంతియుత నిరసన తెలుపుతున్నారు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ
పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
-
Jul 24, 2026 15:57 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
331 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
102 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 24, 2026 14:39 IST
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్
టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 500 కుటుంబాలు
ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో కుండువాలు కప్పుకున్న నేతలు, కార్యకర్తలు
టీడీపీలో చేరిన నాగులాదిన్నె, బోడబండ, గార్లదిన్నె, మేముగోడు గ్రామస్థులు
-
Jul 24, 2026 14:30 IST
కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
పేపర్ లీక్ మాఫియాపై కేంద్రం ఉక్కుపాదం
10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకూ జరిమానా?
విచారణకు చట్టబద్ధతతో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
కేసు నమోదు, దర్యాప్తు నుంచి 3 నెలల్లోనే తుది తీర్పు వెలువరించడం తప్పనిసరి
-
Jul 24, 2026 14:29 IST
CJP ప్రతినిధులతో ముగిసిన కేంద్రం చర్చలు
నీట్ సహా విద్యా వ్యవస్థలో కీలక అంశాలపై చర్చ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు CJP పట్టు
-
Jul 24, 2026 14:23 IST
నా బలం ఏంటో నాకు తెలుసు: వైభవ్ సూర్యవంశీ
జింబాబ్వేపై మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్
మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన యువ బ్యాటర్
నా హాఫ్ సెంచరీ నా కోచ్‌లు, కుటుంబానికి అంకితం: వైభవ్
-
Jul 24, 2026 14:10 IST
రాజ్యసభలో వందేమాతరం బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్
వందేమాతరం గేయాన్ని అవమానిస్తే జైలుశిక్ష విధించేలా చట్టం
వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడాల్సిందేనని నిబంధన
వందేమాతరం బిల్లుపై విపక్షాల తీవ్ర అభ్యంతరం
రాజ్యసభ సోమవారానికి వాయిదా
-
Jul 24, 2026 13:49 IST
పోలవరం: భవిష్యత్‌లో పిల్లలే ఆస్తి: సీఎం చంద్రబాబు
పిల్లలు పుడితే భారం కాదు.. ఆదాయంగా మార్చేశాం: సీఎం
ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నాం: సీఎం
67 లక్షల మంది పిల్లలకు రూ.10,120 కోట్లు జమ చేస్తున్నాం: సీఎం
గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి రూ.664 కోట్లు జమ చేస్తున్నాం: సీఎం
ఆగస్టు నుంచి సంజీవని ప్రోగ్రాం ప్రారంభిస్తాం: సీఎం
-
Jul 24, 2026 13:45 IST
పోలవరం: రంపచోడవరంలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశాం: చంద్రబాబు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదు: సీఎం చంద్రబాబు
తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యత: సీఎం చంద్రబాబు
పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
పీ4 కార్యక్రమంలో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
అప్పులు కాదు.. ఆదాయాన్ని పెంచాలి: సీఎం చంద్రబాబు
-
Jul 24, 2026 13:43 IST
హైదరాబాద్: ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతోంది: కేటీఆర్
యువతపై జరుగుతున్న దాడులు దారుణం: కేటీఆర్
విద్యార్థులకు ఏ రాజకీయ నాయకుల అండలేదు: కేటీఆర్
ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
ఈ జనరేషన్ మీ బెదిరింపులకు భయపడేదికాదు: కేటీఆర్
ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది: కేటీఆర్
-
Jul 24, 2026 13:42 IST
కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సీజేపీతో కేంద్రం చర్చలు
ప్రభుత్వం తరపున హాజరైన కేంద్ర మంత్రులు జెపి నడ్డా, జితేందర్ సింగ్
సీజేపీ నుంచి అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ హాజరు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు
-
Jul 24, 2026 13:39 IST
అమరావతి: పవన్ పదవుల కోసం జనసేన ఏర్పాటు చేయలేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేయాలి: నాదెండ్ల
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన: నాదెండ్ల
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం: నాదెండ్ల
పార్టీలో ఉన్న కార్యకర్తల మాట నాయకులు వినాలి: నాదెండ్ల
అభిప్రాయభేదాలు ఉంటే కూర్చుని చర్చించుకోండి: నాదెండ్ల
ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి: నాదెండ్ల
-
Jul 24, 2026 13:32 IST
ఢిల్లీ: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కేంద్రంతో చర్చలకు ముందు విద్యార్థుల తరఫున రాహుల్ 3 షరతులు
ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలి
లాఠీచార్జ్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలి
-
Jul 24, 2026 12:21 IST
హ్యారీ పోటర్ ప్రచురణకర్తకు భారీ పరిహారం
ఆంత్రోపిక్‌తో కాపీరైట్ వివాదానికి ముగింపు
బ్లూమ్స్‌బరీకి 19 మిలియన్ డాలర్ల పరిహారం
-
Jul 24, 2026 12:19 IST
హైదరాబాద్: కేటీఆర్‌కి వ్యతిరేకంగా సిటీలో ఫ్లెక్సీలు
బాప్ ఆఫ్ పేపర్ లీక్ అంటూ కేటీఆర్‌పై సెటైర్స్
కేటీఆర్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చామంటున్న కాంగ్రెస్ నేతలు
ఫ్లెక్సీల రూపంలో కేటీఆర్‌కి పలు ప్రశ్నలు
బీఆర్ఎస్ హయాంలో పేపర్ లేకేజీలను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు
మీ పాలనలోని పేపర్ లీకులపై ఏం చెప్తారంటూ కేటీఆర్‌కి ప్రశ్నలు
-
Jul 24, 2026 12:17 IST
లోక్‌సభ సోమవారానికి వాయిదా
సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాల ఆందోళన
ఐదోరోజూ ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాల పట్టు
-
Jul 24, 2026 12:14 IST
ఢిల్లీ: రాజ్యసభలో మ.2 గంటలకు వందేమాతరం బిల్లు
బిల్లు ప్రవేశపెట్టనున్న అమిత్ షా
వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడాలి
వందేమాతరం గేయానికి ఆటంకం కలిగిస్తే మూడేళ్ల కఠిన శిక్ష నిబంధనను కొత్త బిల్లులో చేర్చిన కేంద్రం
-
Jul 24, 2026 12:12 IST
హైదరాబాద్: గాంధీభవన్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
గాంధీభవన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు
కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
-
Jul 24, 2026 12:12 IST
ఢిల్లీ: నీట్‌పై సభలో ఇవాళే చర్చకు సిద్ధం: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
చర్చ నుంచి విపక్షం పారిపోతోంది: కిరణ్ రిజిజు
కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు: కిరణ్ రిజిజు
నీట్‌పై ఇప్పటికే మోదీ స్పందించారు: కిరణ్ రిజిజు
-
Jul 24, 2026 12:11 IST
పార్లమెంట్‌లో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన
రాజ్యసభ మ.2 గంటల వరకు వాయిదా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాల పట్టు
-
Jul 24, 2026 11:59 IST
ఢిల్లీ యూనివర్సిటీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకున్నందుకు విద్యార్థులను బెదిరించడానికి మీకెంత ధైర్యం?: రాహుల్
సమయం వచ్చినప్పుడు జవాబుదారీగా ఉండాల్సింది మీరే: రాహుల్
-
Jul 24, 2026 11:59 IST
ఢిల్లీ: ఇంటర్నెట్ సేవలు నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్
అత్యవసర పిటిషన్‌పై మ.2.30కి ఢిల్లీ హైకోర్టు విచారణ
కేంద్ర నిర్ణయం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: పిటిషనర్
-
Jul 24, 2026 11:27 IST
ఢిల్లీ: కేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ సంచలన ప్రకటన..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరేదీ అంగీకరించబోము: సీజేపీ
మధ్యాహ్నం 12:30 గంటలకు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ చర్చలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదన్న అభిజీత్ దిప్కే
ప్రధాని మోదీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళనకారుల డిమాండ్
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ప్రకటనలను నమ్మబోమన్న సీజేపీ
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడమే నిజమైన కఠిన చర్య: సీజేపీ
-
Jul 24, 2026 11:21 IST
హైదరాబాద్: ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ నేతల అరెస్ట్
ధర్నా చౌక్‌లో కేటీఆర్‌ను అడ్డుకునేందుకు బయల్దేరిన యూత్ కాంగ్రెస్
మాజీ ఎంపీ అంజన్ కుమార్, యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jul 24, 2026 11:15 IST
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ సంచలన ఆరోపణలు
విద్యార్థులను ‘దేశద్రోహులు’గా చూస్తున్నారంటూ ఆగ్రహం
విద్యార్థులపై మోదీ ప్రభుత్వం అనైతిక చర్యలు చేపట్టింది: సోనియా
గత 12 ఏళ్లలో 152 పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూశాయి: సోనియా
విద్యార్థుల ధైర్యానికి.. మోదీ ప్రభుత్వం దౌర్జన్యంతో సమాధానం ఇస్తోంది: సోనియా
విద్యార్థులపై టియర్ గ్యాస్, పెల్లెట్లు ప్రయోగించడం దారుణం: సోనియా
-
Jul 24, 2026 11:08 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
800 పాయింట్లకుపైగా నష్టంలో సెన్సెక్స్
200 పాయింట్లకుపైగా నష్టంలో నిఫ్టీ
-
Jul 24, 2026 11:08 IST
ఢిల్లీ: సీజేపీతో చర్చలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
తటస్థ వేదికపై చర్చలకు అంగీకరించిన కేంద్రం
మ.12.30 గంటలకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో చర్చలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని డిమాండ్
-
Jul 24, 2026 11:07 IST
ఐదోరోజూ పార్లమెంట్‌లో విపక్షాల నినాదాలు
ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వాయిదా
మ.12 గంటల వరకు లోక్‌సభ వాయిదా
-
Jul 24, 2026 11:00 IST
హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర బీఆర్ఎస్‌వీ నిరసన
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం
కాసేపట్లో ఇందిరాపార్క్‌కు కేటీఆర్
బీఆర్ఎస్‌వీ నిరసనను అడ్డుకుంటామన్న యూత్ కాంగ్రెస్
ఇందిరాపార్క్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు
బీఆర్ఎస్‌వీ నిరసనకు మ.2 గంటల వరకు పోలీసుల అనుమతి
-
Jul 24, 2026 10:43 IST
అమరావతి: ఏపీలో NH-42 అప్‌గ్రేడేషన్‌కు కేంద్రం భారీ నిధులు: డిప్యూటీ సీఎం పవన్
NH-42 అభివృద్ధికి రూ.679.71 కోట్లు మంజూరు: పవన్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
NH-42 అభివృద్ధితో ఏపీలో మరింత మెరుగుపడనున్న రహదారి కనెక్టివిటీ
ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి NH-42 ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది: పవన్
ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీకి ప్రపంచస్థాయి మౌలిక వసతులు: పవన్
-
Jul 24, 2026 10:42 IST
ఢిల్లీ: జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న సీజేపీ ఆందోళన
తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్న సీజేపీ
మ. 12:30 గంటలకు కేంద్రమంత్రులతో సీజేపీ అధికార ప్రతినిధుల భేటీ
-
Jul 24, 2026 10:41 IST
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం
దుబాయ్ వెళ్లడానికి నకిలీ టికెట్లతో వచ్చిన నేపాల్ దేశస్థులు
ఇద్దరు నేపాల్ దేశస్థులను అదుపులోకి తీసుకున్న అధికారులు
-
Jul 24, 2026 10:40 IST
నేడు ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం
పేపర్ లీకులపై కీలక బిల్లుకు కేంద్రం సిద్ధం
-
Jul 24, 2026 09:30 IST
మహారాష్ట్ర: చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి దాడి
పులి దాడిలో పశువుల కాపరి మృతి
సాతారా బోంస్లే గ్రామంలో ఘటన
-
Jul 24, 2026 09:28 IST
కోల్‌కతా: మాల్దా బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం
ఇద్దరు జవాన్ల మృతి
తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్
ఘటనలో మరో జవాన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
కాల్పులకు పాల్పడిన శివమ్ మిశ్రా అరెస్ట్
-
Jul 24, 2026 09:25 IST
కెనడా వస్తువులపై 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరిక
ఆగస్టు 19 నుంచి టారిఫ్‌లు అమల్లోకి వచ్చే అవకాశం
టారిఫ్‌లు అమలైతే ప్రతిచర్యకు సిద్ధంగా ఉన్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ
ఒప్పందం కుదరకపోతే అన్ని మార్గాలను పరిశీలిస్తామన్న కార్నీ
ముందుగానే స్పందించడం ప్రతికూల ఫలితాలకు దారితీయొచ్చన్న కెనడా ప్రధాని
-
Jul 24, 2026 09:22 IST
ఆసియాన్ రీజినల్ ఫోరం వేదికగా భారత్‌పై ఆరోపణలు చేసిన పాకిస్థాన్
పాక్ ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్
కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని తేల్చిచెప్పిన రణధీర్ జైశ్వాల్
-
Jul 24, 2026 09:17 IST
ఏపీలో SIR ఎన్యుమరేషన్‌కు నేడు చివరి తేదీ
నేటితో ముగియనున్న ఇంటింటి ఎన్యుమరేషన్
జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా
ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్‌కు అవకాశం
నేటితో ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా
-
Jul 24, 2026 09:16 IST
జెరూసలేంలో భారతీయ వ్యక్తి అనుమానాస్పద మృతి
కటమోన్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం గుర్తింపు
ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఇజ్రాయెల్ అధికారులు
ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jul 24, 2026 09:14 IST
తిరుపతి: నూతన దంపతులపై దాడి
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులపై పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాడి
రక్షణ కోసం తిరుపతి ఎస్పీ కార్యాలయం వెళుతుండగా ఘటన
యువతి మెడలో తాళిబొట్టును తెంచి యువకుడిపై దాడి చేసిన వైనం
భయంతో స్థానికంగా ఓ కార్యాలయంలోకి దూరిన నవ దంపతులు
స్థానికుల సహాయంతో ఇరువురిని ఎస్వీ యూనివర్సిటీ పోలీసుల చెంతకు చేర్చిన ఓ మహిళ
-
Jul 24, 2026 09:00 IST
కామారెడ్డి: భిక్కనూరు టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం
బైక్ అదుపుతప్పి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తండాకు చెందిన శివకుమార్(32) మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన భిక్కనూరు పోలీసులు
-
Jul 24, 2026 08:58 IST
పశ్చిమగోదావరి: ఉండి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్
రాజీనామా చేసే యోచనలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీఎల్ నరసింహారాజు
ఈరోజు రాజీనామా చేసే అవకాశం
ఉండి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను నియమించిన అధిష్ఠానం
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా పీవీఎల్ నర్సింహరాజు నియామకం
నరసింహరాజును ఇన్‌ఛార్జిగా తప్పించడంపై ఆయన వర్గీయుల తీవ్ర ఆగ్రహం
జగన్ వైఖరితో పార్టీకి రాజీనామా చేసే యోచనలో నరసింహరాజు
-
Jul 24, 2026 08:55 IST
ఢిల్లీ: భారత్, రుమేనియా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం
వచ్చే మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ముందుకు
మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు
మూడు దశాబ్దాల తర్వాత భారత రాష్ట్రపతి రుమేనియాలో పర్యటన
-
Jul 24, 2026 08:53 IST
హైదరాబాద్: కేటీఆర్‌కి వ్యతిరేకంగా సిటీలో ఫ్లెక్సీలు
బీఆర్ఎస్ హయాంలో పేపర్ లేకేజీలను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు
మీ పాలనలోని పేపర్ లీకులపై ఏం చెప్తారంటూ కేటీఆర్‌కి ప్రశ్నలు
-
Jul 24, 2026 08:50 IST
బాపట్ల: చినగంజాం మండలం సంతరావూరులో దారుణం
పొలాల్లో గొర్రెలకాపరిని కొట్టిచంపిన గుర్తుతెలియని వ్యక్తులు
మృతుడు సంతరావూరుకు చెందిన అతిన శ్రీనివాస్(58) గా గుర్తింపు
ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన చినగంజాం పోలీసులు
-
Jul 24, 2026 08:18 IST
ఇరాన్‌పై వరుసగా 13వ రోజు దాడులు: అమెరికా సెంట్రల్ కమాండ్
వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పును నివారించడమే లక్ష్యం
ఇరాన్‌ను జవాబుదారీగా చేయడమే ముఖ్య ఉద్దేశమని CENTCOM వెల్లడి
తొమ్మిది రోజులుగా కొనసాగుతోన్న ఇరాన్ నౌకాదళ దిగ్బంధం
-
Jul 24, 2026 08:17 IST
ఢిల్లీ: విద్యాశాఖలో కీలక అధికారుల బదిలీ
కొత్త కార్యదర్శుల నియామకం
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్
పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా టీకే అనిల్ కుమార్ నియామకం
-
Jul 24, 2026 08:16 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో ఆందోళనలు ఉధృతం
శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ
జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చిన యువత
ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్ల మూసివేత.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
-
Jul 24, 2026 08:13 IST
నంద్యాల: శ్రీశైలంలోని ఏపీ టూరిజం రోప్ వే తాత్కాలిక నిలుపుదల చేసిన అధికారులు
రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా నేటి నుంచి 30 రోజుల పాటు నిలుపుదల
రోప్ వే ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో మెయింటెనెన్స్ పనుల నిర్వహణ
మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తే 10 సంవత్సరాలు ఇబ్బందులు తలెత్తవన్న టూరిజం అధికారులు
-
Jul 24, 2026 07:59 IST
హైదరాబాద్: కేటీఆర్ దీక్షను అడ్డుకుంటామన్న యూత్ కాంగ్రెస్
ధర్నా చౌక్‌లో నేడు నిరసన దీక్ష చేయనున్న కేటీఆర్
గతంలో పేపర్ లీకులకు కారణం కేటీఆరే: యూత్ కాంగ్రెస్
ఇప్పుడు నిరసన పేరుతో కేటీఆర్ నాటకం: యూత్ కాంగ్రెస్
-
Jul 24, 2026 07:58 IST
హైదరాబాద్: ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగ జేఏసీ
ఖాళీగా ఉన్న అన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
-
Jul 24, 2026 07:54 IST
అమరావతి: నేడు పోలవరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
రంపచోడవరంలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్
సా.4 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
-
Jul 24, 2026 07:52 IST
ఢిల్లీ: నేడు కేంద్రమంత్రులను కలవనున్న సీజేపీ ప్రతినిధులు
మ.12:30కి కేంద్ర మంత్రులతో భేటీ
-
Jul 24, 2026 07:51 IST
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును నోటిఫై చేసిన ఢిల్లీ హైకోర్టు
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరుపుతామని కేంద్రం ప్రకటన
ప్రధాని ప్రకటించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
నీట్ పేపర్ లీకేజీపై 4 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడి
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో ఒకటి ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రం
-
Jul 24, 2026 07:35 IST
ఢిల్లీలో ఇవాళ కూడా పలు మెట్రో స్టేషన్ల బంద్
17 మెట్రో స్టేషన్లు మూసివేస్తూ అధికారుల ప్రకటన
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మెట్రో స్టేషన్ల బంద్
CJP ఆందోళనల దృష్ట్యా మెట్రోస్టేషన్లు బంద్
-
Jul 24, 2026 07:19 IST
హైదరాబాద్: ఉ.10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన
ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం
పాల్గొననున్న కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు
-
Jul 24, 2026 07:17 IST
ఢిల్లీ: భారత్ సహా 17 దేశాలపై అమెరికా 10 శాతం కొత్త సుంకాలు
భారత్, కెనడా, యూకే దేశాలకు 10 శాతం కొత్త సుంకాలు
బంగ్లా, పాకిస్థాన్ సహా 17 దేశాలకు 10 శాతం కొత్త సుంకాలు