Share News

కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా

ABN , Publish Date - Jul 24 , 2026 | 09:10 PM

పంజాబ్ బీజేపీ నాయకుడు రవ్‌నీత్ సింగ్ బిట్టూ కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా
Ravneet Singh Bittu,

ఇంటర్‌నెట్ డెస్క్: పంజాబ్ బీజేపీ నాయకుడు రవ్‌నీత్ సింగ్ బిట్టూ కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రవ్‌నీత్ సింగ్ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించారు. 2024 నుంచి రవ్‌నీత్ కేంద్ర మంత్రిమండలిలో కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది (2027) పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికే ఆయన తన కేంద్ర మంత్రి పదవిని వీడినట్లు సమాచారం.


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయడానికి ఒక రోజు ముందు (గురువారం), ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఓ లేఖ రాశారు. పంజాబ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలకమైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆ లేఖలో కోరారు. పంజాబ్ ఆర్థిక వృద్ధికి, కనెక్టివిటీకి ఈ రైల్వే ప్రాజెక్టులు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్

Updated Date - Jul 24 , 2026 | 09:38 PM