Share News

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ABN , Publish Date - Jul 24 , 2026 | 07:48 PM

యువతకు మరింతగా చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న
Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: యువతకు మరింతగా చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు ఈ మేరకు సూచించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది యాక్టివ్‌గా ఉంటున్నారని ప్రధాని మోదీ మంత్రులను ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నట్టు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల్లో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్‌లో ఉండాలని ప్రధాని సూచించారు. యువతకు మరింత దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్‌ను పోస్టు చేస్తూ ఉండాలని కూడా ప్రధాని సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా చట్టంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం లభించినట్టు కూడా తెలుస్తోంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకూ జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్స్.. ప్రభుత్వ వర్గాల కీలక వ్యాఖ్యలు

కోర్టు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు

Updated Date - Jul 24 , 2026 | 08:31 PM