Share News

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్

ABN , Publish Date - Jul 24 , 2026 | 07:47 PM

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హెడ్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్
Virat Kohli Travis Head

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హెడ్ స్పష్టం చేశాడు. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ.. హెడ్‌కు హ్యాండ్‌షేక్ చేయకుండా వెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత హెడ్ ఈ విషయం గురించి మాట్లాడాడు.


‘మా మధ్య సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏమీ లేదు. జరిగినది జరిగిపోయింది. పోటీ ఎలా ఉంటుందో, మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఊహించిందే. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు’ అని హెడ్ తెలిపాడు. ఈ ఘటన తర్వాత ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా హెడ్ స్పందించాడు. ‘జెస్సికా, నేను పరిస్థితులను అర్థం చేసుకునే విధానం చాలా బాగుంటుంది. మనం జీవిస్తున్న ప్రపంచం ఇదే. ఇలాంటి విషయాలను ఆమె ఎంతో గొప్పగా ఎదుర్కొంటుంది. ఆమెపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఓ ఘటన గురించి కుటుంబ సభ్యులపై ఆ ప్రభావం పడటమే నాకు ఎంతో బాధ కలిగించింది’ అని హెడ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్

Updated Date - Jul 24 , 2026 | 07:47 PM