Share News

కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:11 PM

భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత తులిక మాన్‌కు షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సస్పెన్షన్ వేటు వేసింది.

కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్
Tulika Maan suspension

ఇంటర్నెట్ డెస్క్: భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత తులిక మాన్‌కు షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు తులిక మాన్ దూరం కానుంది. గత 12 నెలల వ్యవధిలో మూడు సార్లు తన ‘వేర్‌ అబౌట్స్’ వివరాలను అందించడంలో విఫలమైనందుకు నాడా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో భారత జూడో జట్టు నుంచి తులిక పేరును తొలగించారు.


2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 78 కిలోల విభాగంలో తులిక మాన్ రజత పతకం సాధించింది. దీంతో గ్లాస్గోలో కూడా ఆమె నుంచి పతకం ఆశించారు. అయితే తాజా పరిణామంతో ఆమె పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, మరో భారత జూడో క్రీడాకారుడు అరుణ్ కుమార్ (73 కిలోల విభాగం) కూడా ఈ పోటీలకు దూరమయ్యాడు. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో అతడిని కూడా జట్టు నుంచి తొలగించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో పోటీలు జులై 31 నుంచి ప్రారంభం కానున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్

నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Jul 24 , 2026 | 05:18 PM