హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. సుమోపై విరిగిపడ్డ కొండచరియలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:45 PM
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాంగా ప్రాంతంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా గిరిజన ప్రాంతం పాంగిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిలాడ్-ఉదయ్‌పూర్ రహదారిపై కడు నాలా సమీపంలో వెళ్తున్న టాటా సుమో వాహనంపై అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా మట్టితో వాహనం పూర్తిగా కూరుకుపోవడంతో అక్కడికక్కడే 13 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగింపు..
ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు భర్మౌర్-పాంగా ఎమ్మెల్యే డాక్టర్ జనక్ రాజ్ ధ్రువీకరించారు. ఘటన అనంతరం జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాల నేపథ్యంలో పర్వత ప్రాంతాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్
విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News