Share News

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:10 PM

పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని తెలిపారు.

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు
CM Chandrababu

పోలవరం జిల్లా, జులై 24: పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రంపచోడవరంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యతన్నారు. పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నామని తెలిపారు. పీ4 కార్యక్రమంలో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని సీఎం తెలిపారు.


పిల్లలు పుడితే భారం కాదని.. ఆదాయంగా మార్చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.10,120 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి రూ.664 కోట్లు జమ చేస్తున్నామన్నారు. గిరిజనులకు ఐఐటీలో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆగస్టు నుంచి సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటికీ సోలార్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతామని వెల్లడించారు. పది లక్షల కోట్లు అప్పులు ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్య పైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిపారు. పీటీఎం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గుడివాడ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 02:15 PM