గుడివాడ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:24 PM
కృష్ణా జిల్లాలోని గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి(50) పాయిజన్ టాబ్లెట్లు మింగి బలవన్మరణానికి యత్నించింది.
కృష్ణా జిల్లా, జులై 24: జిల్లాలోని గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆస్తి వివాదం నేపథ్యంలో కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి(50) పాయిజన్ టాబ్లెట్లు మింగి బలవన్మరణానికి యత్నించారు. విష మాత్రలు మింగిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ బృందం.. రమాదేవి పరిస్థితిని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహిళ చికిత్స పొందుతున్నారు.
వంశపారంపర్య భూమిని బాబాయి, అతని కొడుకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రమాదేవి ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగదన్న భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపారు. ఉపాధి పనులు చేసుకొని బతికే తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు. ఈ ఘటనపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్
విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి: మంత్రి కందుల దుర్గేశ్
Read Latest AP News And Telugu News