Share News

ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది అధికారుల మంది తొలగింపు!

ABN , Publish Date - Jul 24 , 2026 | 08:44 PM

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఎన్‌టీఏలో కేంద్రం భారీ ప్రక్షాళన చేపట్టింది. సుమారు 47 మంది అధికారులను తొలగించినట్టు తెలుస్తోంది.

ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది అధికారుల మంది తొలగింపు!
NTA Overhaul

ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం భారీ ప్రక్షాళన తెరతీసినట్టు తెలుస్తోంది. విద్యార్థుల దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్‌టీఏలో వివిధ స్థానాల్లోని 47 మంది కీలక వ్యక్తులను తొలగించినట్టు సమాచారం. మరికొందరిపై చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఈ అధికారులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఎన్‌టీఏ పునర్‌వ్యవస్థీకరణ దిశగా ఔట్‌సోర్సింగ్ విధానాలకు సమూల మార్పులు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లీకేజీలకు ఎలాంటి అవకాశం లేకుండా నిబంధనలు కఠినతరం చేయనున్నట్టు సమాచారం. ఎన్‌టీఏ పనితీరును మెరుగుపరిచేందుకు ఓ ప్రత్యేక కమిటీ సూచనలు చేయనుందని కూడా తెలుస్తోంది. పేపర్ లీక్స్‌ను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే ముసాయిదా బిల్లుకు నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, పేపర్ లీకేజీ దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది.


ఈ మేరకు పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ ) యాక్ట్-2024 చట్టానికి మార్పులకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. పేపర్ లీక్స్‌కు పాల్పడే నిందితులకు శిక్ష వేసే చట్టాలు ఇప్పటికే అందుబాటులో ఉండగా, పేపర్ లీక్ ముఠాలు, గ్యాంగులను, సంస్థలను కూడా టార్గెట్ చేసేలా కేంద్రం మార్పులకు సిద్ధమైంది. ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం దేశవ్యాప్త ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించేందుకు కేంద్రం ఎన్‌టీఏను 2017లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్స్.. ప్రభుత్వ వర్గాల కీలక వ్యాఖ్యలు

Updated Date - Jul 24 , 2026 | 09:23 PM