తుంగతుర్తి కాంగ్రెస్ నేతలకు క్షమాపణలు చెబుతున్నా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ABN , Publish Date - Jul 24 , 2026 | 08:47 PM
తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం భువనగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
భువనగిరి, జులై 24: తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం భువనగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తుంగతుర్తి కాంగ్రెస్ నేతలకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా సామేల్‌ను గౌరవిస్తాం.. ఆయన మాటలకు స్పందించ వద్దంటూ కార్యకర్తలకు సూచించారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.
ఆయారాం గయారాంలకు తాను భయపడనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లను గౌరవిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారింది తాను ఒక్కడినే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే మందుల సామేల్‌పై తానెప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో తాను అడిగింది రెండు సీట్లలో తుంగతుర్తి ఒకటిని చెప్పారు. మందుల సామేల్‌కు టికెట్ ఇప్పించి.. ఆయన గెలుపునకు సహకరించానని చెప్పారు.
తన అభిమానుల మద్దతుతో గెలిచి.. నేడు తనపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. వారి న్యాయం చేసేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు గ్లోబల్ గుర్తింపు.. లాన్సెట్‌లో కీలక పరిశోధనకు చోటు
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest TG News And Telugu News