Share News

ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు గ్లోబల్ గుర్తింపు.. లాన్సెట్‌లో కీలక పరిశోధనకు చోటు

ABN , Publish Date - Jul 24 , 2026 | 07:10 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. ప్రజారోగ్య రంగంలో అత్యంత కీలకమైన పోలియో టీకా సంబంధిత పరిశోధనకు ప్రపంచ ప్రఖ్యాత వైద్య జర్నల్ ది లాన్సెట్ గుర్తింపు లభించింది.

ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు గ్లోబల్ గుర్తింపు.. లాన్సెట్‌లో కీలక పరిశోధనకు చోటు
Medical-Colleges-in-AP

అమరావతి, జులై 24: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. ప్రజారోగ్య రంగంలో అత్యంత కీలకమైన పోలియో టీకా సంబంధిత పరిశోధనకు ప్రపంచ ప్రఖ్యాత వైద్య జర్నల్ ది లాన్సెట్ గుర్తింపు లభించింది. ఈ పరిశోధనలో భాగస్వాములైన ఆంధ్ర, కర్నూలుమెడికల్ కాలేజీలకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది.


పోలియో నియంత్రణ, టీకా ప్రభావం, ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంపు వంటి అంశాలపై సాగిన ఈ కీలక పరిశోధనలో ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన వైద్య పరిశోధకులు కీలక పాత్ర పోషించారు. శాస్త్రీయ ఆధారాలతో చేసిన ఈ అధ్యయనం అంతర్జాతీయ వైద్య రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పరిశోధన చేసిన వైద్యులు డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ విజయానంద్‌లను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.


ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి ప్రపంచ స్థాయి పరిశోధనలు వెలువడటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని మిగిలిన వైద్య కళాశాలలు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 07:33 PM