-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 18th July 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 18 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 18, 2026 21:37 IST
అమరావతి: జనసేన ఎంపీలతో పవన్ కల్యాణ్ సమావేశం
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
-
Jul 18, 2026 21:36 IST
CBSE 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్ష-2026 ఫలితాల విడుదల
DigiLocker ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు
రెండో పరీక్షలో మెరుగైన మార్కులనే తుది ఫలితంగా పరిగణింపు
మార్కుల మెరుగుదల కోసం రాసిన వారిలో స్కోరు పెంచుకున్న 59.95% మంది విద్యార్థులు
కంపార్ట్‌మెంట్ విద్యార్థుల్లో 52.40% మంది ఉత్తీర్ణత
మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78%గా నమోదు
సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దని CBSE సూచన
-
Jul 18, 2026 21:32 IST
శ్రీశైలం స్పర్శ దర్శనంలో కీలక మార్పులు
శని, ఆది, సోమవారాల్లో ఆన్‌లైన్, మనమిత్ర టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఉదయం స్పర్శ దర్శనం
సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం స్పర్శ దర్శనం నిలిపివేత
సిఫారసు లేఖల భక్తులకు రాత్రి 9 గంటలకు అవకాశం మేరకు అనుమతి
సర్వ, ఉచిత, శీఘ్ర దర్శన భక్తులకు ఎక్కువ సమయం కేటాయింపు
కొత్త నిబంధనలు పాటించాలని దేవస్థానం విజ్ఞప్తి
-
Jul 18, 2026 21:26 IST
జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం హర్షణీయం: పవన్
నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక అభినందనలు తెలిపిన పవన్
తెలుగు చిత్రాలకు జాతీయ పురస్కారాలు రావడం శుభపరిణామం: పవన్
మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పవన్
‘కల్కి 2898 AD’, ‘35 - చిన్న కథ కాదు’, ‘పుష్ప 2’, ‘లక్కీ భాస్కర్’ బృందాలకు పవన్ అభినందనలు
-
Jul 18, 2026 21:24 IST
నంద్యాల: నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
కేసీ కెనాల్‌లో ఆటో బోల్తా
వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో
పలువురు కూలీలకు గాయాలు
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
-
Jul 18, 2026 21:21 IST
హైదరాబాద్‌లో 4 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా ఆంక్షలు
సైదాబాద్ వై జంక్షన్ - యాదగిరి థియేటర్ మార్గం ఒకవైపు మూసివేత
నల్గొండ ఎక్స్ రోడ్స్ - ఒవైసీ హాస్పిటల్ మార్గంలో ప్రయాణం నివారించాలని సూచన
నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాల మళ్లింపు
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు
ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి
-
Jul 18, 2026 21:17 IST
రేపు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సమావేశం
-
Jul 18, 2026 20:21 IST
కామారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లైంగిక వేధింపులు
ఘటనలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ నిజాం సస్పెండ్
మహిళా లెక్చరర్ పట్ల నిజాం అసభ్యకర ప్రవర్తన
సమగ్ర విచారణ అనంతరం నిజాం పై సస్పెన్షన్ వేటు
-
Jul 18, 2026 20:16 IST
హైదరాబాద్: రాజకీయాల్లో కేటీఆర్ ఉంటేనే కాంగ్రెస్‌కు మేలు: అద్దంకి దయాకర్
నాన్ సీరియస్ పొలిటీషియన్ కేటీఆర్: అద్దంకి దయాకర్
మేము ఇచ్చిన ఉద్యోగాల లెక్క చెప్పాం: అద్దంకి
రాజకీయ సన్యాసం ఎప్పుడో కేటీఆర్ చెప్పాలి: అద్దంకి
హరీష్‌రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదు?: అద్దంకి
శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె ఎలా దొరికింది?: అద్దంకి
-
Jul 18, 2026 20:15 IST
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు
కమిటీ ఛైర్మన్‌గా జి. చిన్నారెడ్డి నియామకం
వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేయనున్న కమిటీ
రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
కరవు నివారణ చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను కమిటీ కన్వీనర్‌గా నియామకం
-
Jul 18, 2026 19:40 IST
విశాఖ: జీవీఎంసీకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డు
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరుకు గుర్తింపు
-
Jul 18, 2026 19:39 IST
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)కు ఎదురుదెబ్బ
షిండే శివసేనలో ఆరుగురు తిరుగుబాటు ఎంపీల విలీనాన్ని గుర్తించిన లోక్‌సభ స్పీకర్
ఎంపీల విలీన దరఖాస్తును ఆమోదించిన లోక్‌సభ సచివాలయం
ఇటీవల ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరిక
స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
-
Jul 18, 2026 19:25 IST
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేశాం: ఇరాన్
ఇకపై ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండబోమన్న ఇరాన్
అమెరికానే తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపరణ
-
Jul 18, 2026 19:24 IST
బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
శివసేన కౌన్సిలర్ రమేష్ మాత్రేకు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధింపు
ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశం
డోంబివలిలో మున్సిపల్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి చేసిన రమేష్
-
Jul 18, 2026 19:23 IST
హైదరాబాద్: కోమటరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయిన జగ్గారెడ్డి
తుంగతుర్తి వివాదం ముగిసిన అంశం: జగ్గారెడ్డి
రాజగోపాల్ రెడ్డితో రాష్ట్ర రాజకీయాలపై చర్చించా: జగ్గారెడ్డి
ఉమ్మడి నల్లగొండలో రాజగోపాల్ రెడ్డి కీలక నాయకుడు: జగ్గారెడ్డి
రాహుల్‌ని ప్రధానిని చేయాలంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలి: జగ్గారెడ్డి
రాజగోపాల్ రెడ్డి టీమ్‌గా పనిచేస్తే పార్టీకి మేలు: జగ్గారెడ్డి
తుంగతుర్తి అంశం ప్రధాన ఎజెండా కాదు: జగ్గారెడ్డి
స్థానిక నాయకులే సమస్యను పరిష్కరించుకోవాలి: జగ్గారెడ్డి
-
Jul 18, 2026 19:21 IST
హైదరాబాద్: రైతులకు కీలక సూచనలు చేసిన మంత్రి సీతక్క
ఎల్‌నినో ప్రభావం దేశం, రాష్ట్రంపై తీవ్రంగా ఉంది: సీతక్క
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి: సీతక్క
ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోరు: సీతక్క
-
Jul 18, 2026 19:18 IST
కెవిన్ డ్యురాంట్.. మెస్సీని పట్టించుకోలేదా?
ఫ్యానాటిక్స్ ఫెస్ట్‌లో ప్రపంచ క్రీడా దిగ్గజాల సందడి
ఒకే వేదికపై నొవాక్ జకోవిచ్, టామ్ బ్రాడీ, కెవిన్ డ్యురాంట్, లియోనల్ మెస్సీ
క్రీడా ప్రపంచంలో అరుదైన క్రాస్‌ఓవర్‌గా నిలిచిన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో కెవిన్ డ్యురాంట్.. మెస్సీని పట్టించుకోలేదంటూ వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఘటనపై చర్చ
-
Jul 18, 2026 19:08 IST
హైదరాబాద్: అందెశ్రీ స్మృతివనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
అందెశ్రీ నాకు ఆత్మ బంధువు: సీఎం రేవంత్
అందెశ్రీని నా కుటుంబ సభ్యుడిగా, పెద్దన్నగా భావించా: సీఎం
గడీల ముందు మోకరిల్లనని చెప్పిన కవి అందెశ్రీ: సీఎం
అందెశ్రీని ఆనాటి ప్రభుత్వం అవమానించింది: సీఎం
గద్దర్‌ను ప్రగతిభవన్ ఎదుట ఎండలో నిలబెట్టారు: సీఎం
-
Jul 18, 2026 18:48 IST
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
హైదరాబాద్ నివాసంలో పవన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న లోకేశ్

-
Jul 18, 2026 18:43 IST
అహ్మదాబాద్: బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
8 మంది మృతి, ఐదుగురికి గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Jul 18, 2026 18:40 IST
హైదరాబాద్: అందెశ్రీ స్మృతివనం నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
-
Jul 18, 2026 18:38 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
ఉత్తమ చిత్రం - ఆర్టికల్ 370
జాతీయ ఉత్తమ నటులు - మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్
జాతీయ ఉత్తమ నటి - యామీ గౌతమ్(ఆర్టికల్ 370)
ఉత్తమ బాలల చిత్రం - 35 చిన్న కథ కాదు(తెలుగు)
ఉత్తమ సహాయ నటుడు - సంజయ్ మిశ్రా
ఉత్తమ పాపులర్ చిత్రం - కల్కి 2898 AD
ఉత్తమ దర్శకుడు - రాజ్‌కుమార్ పెరియస్వామి(అమరన్)
ఉత్తమ నూతన దర్శకుడు - రణ్‌దీప్ హూడా
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం - కెప్టెన్ మిల్లర్(తమిళం)
ఉత్తమ బాలనటుడు - పోతుల అరుందేవ్(35 చిన్న కథ కాదు)
బెస్ట్ మేకప్ - పి.రవికుమార్(కమిటీ కుర్రోళ్లు)
-
Jul 18, 2026 18:37 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
బెస్ట్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ కేటగిరీ - బి.సుకుమార్(పుష్ప 2)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - షెహనాద్ జలాల్(బ్రహ్మయుగం - మలయాళం)
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - విజయలక్ష్మి(మలయాళం)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - అభయ్ జోథ్‌పుర్కర్(మరాఠీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్- రూపాశ్రీ(మిథ్య- కన్నడ)
-
Jul 18, 2026 18:10 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
బెస్ట్ స్టంట్ డైరెక్షన్ - అరసు (మహారాజ) (తమిళం)
బెస్ట్ కొరియోగ్రఫీ - స్త్రీ2(హిందీ)
బెస్ట్ లిరిక్స్ - మైదాన్(హిందీ)
ఉత్తమ సంగీత దర్శకత్వం సినిమా కేటగిరీ - జీవీ ప్రకాష్(అమరన్)
ఉత్తమ సంగీత దర్శకత్వం పాటల కేటగిరీ - ఆర్టికల్ 370(హిందీ)
బెస్ట్ మేకప్ - కమిటీ కుర్రోళ్లు
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్- దీపాలీ నూర్, శీతల్ శర్మ(పుష్ప )
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ - నితిన్ జిహానీ(కల్కి 2898 AD)
బెస్ట్ ఎడిటింగ్ - అమరన్(తమిళం)
బెస్ట్ సౌండ్ డిజైన్ - మానస్ చౌధురీ(భూల్ బులయ్య 3)
బెస్ట్ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లూరి(లక్కీ భాస్కర్)
బెస్ట్ స్క్రీన్ ప్లే సినిమా కేటగిరీ - యోగేష్ దేశ్‌పాండే(స్వర్గంధర్వ సుధీర్ ఫడ్కే)
-
Jul 18, 2026 18:01 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ తమిళ చిత్రం - రాయన్(ధనుష్)
ఉత్తమ కన్నడ చిత్రం - మిథ్య
ఉత్తమ హిందీ చిత్రం - శ్రీకాంత్
ఉత్తమ గుజరాతీ చిత్రం - మారన్
ఉత్తమ మణిపురి చిత్రం - సునీత
ఉత్తమ మలయాళ చిత్రం - ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కొంకణి చిత్రం - మోగ్ అసుమ్
-
Jul 18, 2026 18:01 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
బెస్ట్ బయోగ్రఫికల్ ఫిల్మ్ - కకోరి(హిందీ)
ఉత్తమ నూతన దర్శకుడు - రవిరాజ్ ముర్ము(యాంగెన్)
ఉత్తమ నాన్‌ఫీచర్ ఫిల్మ్ - భాన్‌గర్(మరాఠీ)
-
Jul 18, 2026 18:00 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ - టచ్డ్ యాజ్ వాటర్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్- ఎ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం
బెస్ట్ డాక్యుమెంటరీ - రామ్-నామి(హిందీ)
ఉత్తమ కళలు, సాంస్కృతిక చిత్రం - మై నిదా(హిందీ)
-
Jul 18, 2026 17:52 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ: ద చోలా డోరా ఔర్ సూయికి స్పెషల్ జ్యూరీ
నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భద్రకాళి నాటకం
నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో బెస్ట్ స్క్రిప్ట్ - ఓబుర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ - లైఫ్ ఇన్ లూమ్
బెస్ట్ డైరెక్షన్ - స్టాట్యూ ఆఫ్ యూనిటీ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్
బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ - హమ్‌సఫర్(మరాఠీ)
-
Jul 18, 2026 17:48 IST
ఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
2024 ఏడాదికి అవార్డులు ప్రకటించిన కేంద్రం
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ - సంజీవ్ శ్రీవాస్తవ(హిందీ)
సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత - ప్రదీప్‌కుమార్ శెట్టి(కన్నడ)
-
Jul 18, 2026 17:47 IST
హైదరాబాద్: అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
నెల రోజుల పసిపాపను సురక్షితంగా రక్షించిన చందానగర్ పోలీసులు
తల్లి ఒడిలో నుంచి పాపను కిడ్నాప్ చేసిన నిందితుల అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌కు తరలించే కుట్రను భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో ఐదుగురు నిందితుల అరెస్ట్
వికారాబాద్-హైదరాబాద్-కోల్‌కతా లింకుల గుర్తింపు
సీసీటీవీ ఆధారాలతో వేగంగా కేసును ఛేదించిన పోలీసులు
కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే పాపను తల్లికి అప్పగింత
-
Jul 18, 2026 17:45 IST
ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరోసారి హెచ్చరిక
టెహ్రాన్‌లో ట్రంప్ లక్ష్యంగా కొత్త బ్యానర్ ఏర్పాటు
బ్యానర్‌లో ట్రంప్ కుటుంబ సభ్యులపై అమెరికా జెండా కప్పిన శవపేటికలు
బ్యానర్‌పై ‘రక్తానికి రక్తం’ అనే నినాదం
బ్యాక్‌గ్రౌండ్‌లో మంటల్లో ఉన్న వైట్ హౌస్ చిత్రం
-
Jul 18, 2026 17:40 IST
రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ చెక్
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన బీసీసీఐ
ఇంగ్లండ్‌తో మూడో వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేసిన బీసీసీఐ
రిటైర్మెంట్ ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
-
Jul 18, 2026 17:31 IST
మరి కాసేపట్లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన
72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించనున్న సమాచార శాఖ
2024వ సంవత్సరం చిత్రాలకు సంబంధించిన అవార్డుల ప్రకటన
-
Jul 18, 2026 17:17 IST
H1-B వీసాల కోసం ఈ ఏడాది రెండో లాటరీ లేదు: అమెరికా
ఇప్పటికే సరిపడా దరఖాస్తులు అందాయి: యూఎస్ ఇమ్మిగ్రేషన్
-
Jul 18, 2026 17:16 IST
ముంబై: సోషల్ మీడియాలో ‘CID’ సీరియల్ నటీనటుల వీడియో వైరల్
చాలాకాలం తరువాత ఒక్కచోట కలుసుకున్న CID టీమ్
పాత జ్ఞాపకాలు పంచుకున్న నటీనటులు
నవ్వులు, సరదాతో సందడి
షో ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న తారలు
-
Jul 18, 2026 17:12 IST
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేయడంపై రాహుల్ గాంధీ ఫైర్
సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్‌మంతర్ నుంచి బలవంతంగా తరలించడం సరికాదు: రాహుల్ గాంధీ.
మోదీ ప్రభుత్వ మూల సూత్రాలు ‘అసత్యం, హింస’: రాహుల్ గాంధీ
ప్రశ్నాపత్రాల లీకులు, విద్యా ఖర్చుల పెరుగుదల ఆందోళనకరం: రాహుల్
బలప్రయోగంతో విద్యార్థుల గొంతు అణచలేరు: రాహుల్ గాంధీ
-
Jul 18, 2026 16:35 IST
హైదరాబాద్: KBR పార్క్‌లో కొండచిలువ ప్రత్యక్షం
వాకర్స్‌కు కనిపించిన 20 అడుగుల కొండచిలువ
అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన వాకర్స్
-
Jul 18, 2026 15:50 IST
అమెరికాకు మద్దతిచ్చే దేశాలకు ఐఆర్‌జీసీ (IRGC) హెచ్చరిక
ఇరాన్‌పై దాడులకు భూభాగం ఇచ్చిన దేశాలు తమ నుంచి వచ్చే ప్రతిదాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: ఐఆర్‌జీసీ
కువైట్‌లోని విద్యుత్-వాటర్ డీసాలినేషన్ ప్లాంట్‌పై ఐఆర్‌జీసీ దాడి
దాడితో ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, దెబ్బతిన్న కీలక భాగాలు
24 గంటల్లో రెండోసారి విద్యుత్-నీటి మౌలిక సదుపాయాలపై దాడి
నష్టం అంచనా వేస్తున్న కువైట్ అధికారులు
-
Jul 18, 2026 15:35 IST
ముంబై: మలాడ్‌లోని హైరైజ్ బిల్డింగ్‌లో షాకింగ్ ఘటన
లిఫ్ట్‌లో ముగ్గురు యువతులపై దాడికి యత్నించిన పెంపుడు కుక్క
యువతులు వెంటనే అప్రమత్తమవడంతో తప్పిన ప్రమాదం
సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
-
Jul 18, 2026 15:27 IST
హైదరాబాద్: కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారు: ఎంపీ లక్ష్మణ్
ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు: ఎంపీ లక్ష్మణ్
కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ అభివృద్ధిపై మోదీ ప్రత్యేక చొరవ: ఎంపీ లక్ష్మణ్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: ఎంపీ లక్ష్మణ్
-
Jul 18, 2026 15:26 IST
అమరావతి: గోదావరిలో ఐదుగురి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అనిత
ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశం
-
Jul 18, 2026 15:22 IST
హైదరాబాద్: ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ముగిసిన బీజేపీ నేతల భేటీ
బండి సంజయ్, ఈటలతో అభయ్ పాటిల్ సమావేశం
ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చిన అభయ్ పాటిల్
-
Jul 18, 2026 15:18 IST
కృష్ణా: జోసఫ్ రావణ్‌కు 14 రోజుల రిమాండ్ పొడిగించిన గన్నవరం కోర్టు
ఈ నెల 31వ తారీకు వరకు రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం
-
Jul 18, 2026 15:14 IST
కామారెడ్డి: బాన్సువాడ మండలం కొత్తబాది మోడల్ స్కూల్‌లో వేధింపుల కలకలం
కాంట్రాక్ట్ టీచర్లు అసభ్యంగా ప్రవరిస్తున్నారని విద్యార్థినుల ఆరోపణ
విచారణ అనంతరం విధుల నుంచి ఇద్దరు టీచర్ల తొలగింపు, కేసు నమోదు
-
Jul 18, 2026 15:12 IST
విశాఖ: టెకీ రాధా గాయత్రి మృతి కేసు విచారణ
శ్రీచరణ్ తల్లిదండ్రుల వాంగ్మూలం నమోదుచేసిన మెజిస్ట్రేట్
గాయత్రి మృతిచెందిన హోటల్ యజమాని, సిబ్బంది సహా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుల వాంగ్మూలం నమోదు
విచారణకు హాజరుకాని శ్రీ చరణ్ సోదరి సౌందర్య లహరి
శ్రీచరణ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో శ్రీ చరణ్
-
Jul 18, 2026 15:11 IST
మేడ్చల్: పీర్జాదిగూడ చెరువులో అమ్మవారి విగ్రహం కోసం గాలింపు
నిన్న అమ్మవారి విగ్రహంతోపాటు చెరువులో దూకి తేజస్విని ఆత్మహత్య
తేజస్విని ఆత్మహత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 18, 2026 15:05 IST
ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్: ఒక్క టికెట్ ధర రూ.27 లక్షలు!
అత్యంత ఖరీదైన పోరుగా చరిత్ర సృష్టించనున్న ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్
ఈ పోరుకి లీస్ట్ టికెట్ ధర 6,943 డాలర్లు(సుమారు రూ.6 లక్షలు)
ఆదివారం స్పెయిన్-అర్జెంటీనా జట్ల మధ్య ఫైనల్ పోరు
-
Jul 18, 2026 14:55 IST
ఢిల్లీ: ఎల్లుండి జంతర్‌మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చిన ఎన్‌సీపీ
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్
NCPకి జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ మద్దతు
-
Jul 18, 2026 14:54 IST
కృష్ణా: గొడ్డలి పార్టీతో పెద్ద సమస్య వచ్చింది: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్‌గా మారారు: సీఎం చంద్రబాబు
మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఓ వ్యక్తి చనిపోయాడు
పోస్టర్లు, కటౌట్‌లకు పొట్టేళ్లను బలి ఇస్తున్నారు: చంద్రబాబు
నా జీవితంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదు: చంద్రబాబు
ప్రజల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోం: చంద్రబాబు
రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు
-
Jul 18, 2026 14:52 IST
పోలవరం: ఎటపాక మండలం గొల్లగూడెంలో విషాదం
గోదావరిలో గల్లంతైన ఐదుగురి మృతి
గొమ్ముకొత్తగూడేనికి చెందిన భారతి(40), సుశీల(37), లక్ష్మి(37), బాలరాజు(38), రమేష్(38) మృతి
-
Jul 18, 2026 14:04 IST
కృష్ణా: అమృత్ 2.0 AIUDF శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులను అందించిన సీఎం
ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది: సీఎం చంద్రబాబు
చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు
-
Jul 18, 2026 14:02 IST
అమరావతి: స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మాధవ్
గ్రామస్థాయిలో పనిచేస్తున్న నేతలకు అవకాశం ఇస్తాం: మాధవ్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని వనరులూ సమకూర్చుకోండి: మాధవ్
ఎవరైనా సరే పార్టీ ఆదేశించిన చోటే పోటీ చేయాలి: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
-
Jul 18, 2026 13:48 IST
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
70వేల ఉద్యోగాలిచ్చినట్టు నోటిఫికేషన్లు చూపించాలి: కేటీఆర్
నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా: కేటీఆర్
-
Jul 18, 2026 13:42 IST
నెల్లూరు జిల్లా: తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
చాట్ల వాసును దారుణంగా హత్య చేసిన వైసీపీ నేత
పరారీలో ప్రధాన నిందితుడు వైసీపీ నేత, మాజీ సర్పంచ్ మందా మధు
మందా మధు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ముఖ్య అనుచరుడు
-
Jul 18, 2026 13:22 IST
శ్రీకాకుళం: కాశీబుగ్గ పోలీసులపై ఉన్నతాధికారుల చర్యలు
సీఐ రామకృష్ణను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు
ఇప్పటికే ఎస్‌ఐ సునీల్‌ను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు
మాజీమంత్రి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసుపై చర్యలు
విధుల్లో అలసత్వం, నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో చర్యలు
-
Jul 18, 2026 13:21 IST
మా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాం: స్కైరూట్ సీఈఓ
మా బృందం సగటు వయస్సు 28 మాత్రమే: సీఈఓ పవన్‌కుమార్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విక్రమ్-1 తయారు చేశాం: సీఈఓ
-
Jul 18, 2026 13:21 IST
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ
శాస్త్రవేత్తలతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
స్కైరూట్ విజయం.. దేశ యువతకు స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ
విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని నేను కూడా వీక్షించా: ప్రధాని మోదీ
స్కైరూట్ కృషికి ఫలితమే ఈ విజయం: ప్రధాని మోదీ
-
Jul 18, 2026 12:41 IST
ఇస్రో విక్రమ్-1 ప్రయోగం చారిత్రక ఘట్టం: పవన్ కల్యాణ్
ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది పెద్ద ముందడుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
స్కైరూట్, ఇస్రో, ఇన్-స్పేస్ బృందానికి అభినందనలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jul 18, 2026 12:30 IST
మెస్సిపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్
హ్యారీ కేన్‌ను సరిగ్గా వినియోగించుకోలేదని ఇంగ్లండ్ మేనేజర్ థామస్ టచెల్‌పై ట్రంప్ విమర్శలు
మెస్సి, రొనాల్డోల ప్రతిభ అసాధారణం అంటూ ప్రశంసలు
-
Jul 18, 2026 12:29 IST
ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఇస్రో గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని కుమారుడితో సహా వీక్షించిన లోకేశ్
-
Jul 18, 2026 12:09 IST
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
స్కైరూట్‌కు చారిత్రక విజయగాథ
షార్ నుంచి విజయవంతంగా రాకెట్ ప్రయోగం
అరగంట ఆలస్యంగా సాగిన ప్రయోగం
స్వదేశీ రాకెట్‌తో కొత్త మైలురాయి
350 కేజీల బరువున్న ఉపగ్రహాలను లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి తీసుకెళ్లిన రాకెట్
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఊతం
శ్రీహరికోట నుంచి ప్రయోగించిన శాస్త్రవేత్తలు
శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో ఛైర్మన్
-
Jul 18, 2026 11:58 IST
థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్
ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ ఆడటానికి ఆసక్తిగా లేదు: ఫ్రాన్స్ కోచ్
సెమీస్‌లో ఓడిన ఇంగ్లండ్-ఫ్రాన్స్ మధ్య నేడు మరో పోరు
మూడో స్థానం కోసం పోటీపడనున్న ఈ రెండు జట్లు
-
Jul 18, 2026 11:42 IST
గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు
నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు, అరెస్ట్
ఘటనతో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తపై సస్పెన్షన్ వేటు
మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు అంగీకారయోగ్యం కావు: సీఎం
రాజకీయ అనుబంధం పేరుతో ఎవరికీ రక్షణ ఉండదు: సీఎం చంద్రబాబు
-
Jul 18, 2026 11:35 IST
సాంకేతిక సమస్యతో విక్రమ్-1 ప్రయోగంలో అంతరాయం
చివరి నిమిషంలో విక్రమ్-1 ప్రయోగంలో అంతరాయం
-
Jul 18, 2026 11:14 IST
ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి
స్పెయిన్ యువ సంచలనం యమాల్‌పై మెస్సి ప్రశంసల జల్లు
యమాల్‌ను చిన్నప్పుడు మెస్సి ఎత్తుకుని స్నానం చేయించిన ఫొటోలు వైరల్
దీనిపై స్పందిస్తూ మెస్సి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదివారం స్పెయిన్-అర్జెంటీనా మధ్య ఫైనల్ పోరు
-
Jul 18, 2026 11:11 IST
కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ATC టవర్, అధికారిక భవనం ప్రారంభం
ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
పాల్గొన్న ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఛైర్మన్ విపిన్‌కుమార్
-
Jul 18, 2026 11:10 IST
అమరావతి: రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
పిఠాపురంలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో రివ్యూలు
రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో శాంతిభద్రతలపై చర్చ
-
Jul 18, 2026 11:10 IST
విశాఖ: గాజువాక పరిధిలో దారుణం
మానసిక రోగి అయిన కుమార్తెపై తండ్రి అఘాయిత్యం
పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు
-
Jul 18, 2026 10:47 IST
ఇరాన్‌పై అమెరికా వరుసగా ఏడో రోజు దాడులు
ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు
అమెరికా దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిక
-
Jul 18, 2026 10:46 IST
పెరిగిన బంగారం ధరలు
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 760 రూపాయలు..
22 క్యారెట్ల బంగారంపై రూ.700 పెరుగుదల
18 క్యారెట్ల బంగారంపై రూ.570 పెరుగుదల
మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290
-
Jul 18, 2026 10:44 IST
ములుగు: వాజేడు మండలంలో యువకుడి దారుణ హత్య
వేట కొడవళ్లతో నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు
దుబ్బగూడెం గ్రామానికి చెందిన మడే చలపతి(30) మృతి
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 18, 2026 10:15 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల మూడో రోజు కస్టడీ విచారణ
నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ విచారణ
నేటి సాయంత్రం నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపర్చనున్న ED
లిక్కర్ రవాణా స్కామ్‌పై నిందితులను ప్రశ్నించి, వాంగ్మూలం రికార్డు చేసిన ED
లిక్కర్ రవాణా ఆదాయంపై మనీలాండరింగ్ కోణంలో ED విచారణ
-
Jul 18, 2026 10:00 IST
చైనాలో విషాదం
కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి, 34 మంది గల్లంతు
10 మందిని కాపాడిన సహాయ సిబ్బంది
వుజియాంగ్ నది దగ్గర ప్రమాదం
-
Jul 18, 2026 09:45 IST
ఏలూరు: దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో విషాదం
పడవలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు ఏసుబాబు(7) మృతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 18, 2026 09:30 IST
గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో ఆమీర్‌ఖాన్
ఆమీర్‌ఖాన్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ గురి
సల్మాన్ ఖాన్ తర్వాత ఆమీర్‌కు బెదిరింపులు
సోషల్ మీడియాలో ఆమీర్‌పై బిష్ణోయ్ పేరుతో పోస్ట్
లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని పోస్ట్
-
Jul 18, 2026 09:00 IST
హైదరాబాద్‌లో BRS నేతల హౌస్ అరెస్ట్
యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్
R.S. ప్రవీణ్, కార్తీక్‌రెడ్డి హౌస్ అరెస్ట్
సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ హౌస్ అరెస్ట్ చేయడంపై BRS నేతల ఆగ్రహం
-
Jul 18, 2026 08:45 IST
ప్రకాశం: సంతనూతలపాడు మండలం మద్దులూరు దగ్గర ప్రమాదం
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
10 మంది ప్రయాణికులకు గాయాలు
-
Jul 18, 2026 08:30 IST
రంగారెడ్డి: శంషాబాద్ మండలం బహదూర్‌గూడ భూముల దగ్గర హైటెన్షన్
భూముల దగ్గరకు హైడ్రా బృందాల చేరికతో ఉద్రిక్తత
బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు
అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఆరు రోజులుగా రైతుల అందోళన
స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలంటున్న రైతులు
-
Jul 18, 2026 08:20 IST
గంజాయి పండిస్తున్న కాశీ సాధువు అరెస్ట్
వికారాబాద్: తాండూరు గోవిందరావుపేట స్వామీజీ శ్రీరామ్‌గిరి ఆశ్రమంలో గంజాయి సాగు గుట్టురట్టు
స్వామీజీ ముసుగులో గంజాయి పండిస్తున్న కాశీ సాధువు అరెస్ట్
36 గంజాయి మొక్కలను పీకేసిన పోలీసులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 18, 2026 08:12 IST
ఛలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చిన CJP
సోమవారం పార్లమెంట్ ముట్టడికి CJP పిలుపు
జూన్ 20 నుంచి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ CJP ఆందోళన
CJP ఆందోళనను భగ్నం చేసిన పోలీసులు
-
Jul 18, 2026 08:03 IST
తూ.గో.జిల్లా: దేవరపల్లి గ్రామ శివారులో పొగాకు లోడు లారీ దగ్ధం
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు
పూర్తిగా దగ్ధమైన లారీ.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్
గోపాలపురం నుంచి అనపర్తి వెళ్తుండగా జరిగిన ప్రమాదం
-
Jul 18, 2026 07:52 IST
కాకినాడలో కుండపోత వర్షం
భారీ వర్షంతో జలమయమైన రోడ్లు
-
Jul 18, 2026 07:51 IST
ఢిల్లీ: వాంగ్‌చుక్ దీక్ష భగ్నం
సోనమ్ వాంగ్‌చుక్‌ను దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలింపు
21 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా వాంగ్‌చుక్ దీక్ష
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
-
Jul 18, 2026 07:20 IST
నేడు వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రుల పర్యటన
రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు శంకుస్థాపన
-
Jul 18, 2026 07:18 IST
ఇవాళ మెదక్ జిల్లాకు సినీ హీరో మంచు విష్ణు రాక
ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని, మెదక్ ఖిల్లాను సందర్శించనున్న మంచు విష్ణు
-
Jul 18, 2026 07:17 IST
మేడ్చల్-మల్కాజిగిరి: అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి నేడు శంకుస్థాపన
సాయంత్రం 5:15గంటలకి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఘట్‌కేసర్‌లో అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలో విగ్రహ ఏర్పాటుతో పాటూ స్మృతి వనం నిర్మాణం
-
Jul 18, 2026 07:14 IST
విశాఖ జీవీఎంసీకి.. ఆపరేషన్ క్లీన్ స్విప్ అవార్డు
నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గే
రోడ్లు, డ్రైనేజీలను క్లీన్‌గా ఉంచే కార్యక్రమంలో భాగంగా దక్కిన అవార్డు
-
Jul 18, 2026 07:04 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
రూ.1,43,550కి చేరిన 24క్యారెట్ల 10గ్రాముల బంగారం
రూ.1,30,640కి చేరిన 22క్యారెట్ల 10గ్రాముల బంగారం
కిలో వెండి ధర రూ.2,34,900
-
Jul 18, 2026 06:28 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అన్నా లేజినోవా
స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న లేజినోవా
-
Jul 18, 2026 06:28 IST
నేడు నింగిలోకి భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో నేడు ఆవిష్కృతం కానున్న కొత్త అధ్యాయం
స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం
ఉదయం 11:30కు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు
-
Jul 18, 2026 06:28 IST
నేడు సరూర్‌నగర్ స్టేడియంలో BRS యువ సంగ్రామ సభ
BRS సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో అనుమతి
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సభ నిర్వహించాలని ఆదేశం
-
Jul 18, 2026 06:28 IST
అమరావతి: నేడు సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన
గుడివాడ ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ప్రజావేదిక సభకు సీఎం హాజరు
మధ్యాహ్నం కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులతో సమావేశం
తర్వాత గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష
సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
-
Jul 18, 2026 06:01 IST
నేడు హైదరాబాద్‌లో జనసేన పార్లమెంటరీ పార్టీ భేటీ
ఎంపీలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం