నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

ABN, Publish Date - Jul 18 , 2026 | 12:14 PM

భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 'విక్రమ్-1' రాకెట్, 'మిషన్ ఆగమన్' పేరుతో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.


వాస్తవానికి నేడు ఉదయం 11:30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టాల్సింది. కానీ చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. ఇంధన ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను గుర్తించి సరిచేసిన అనంతరం 35 నిమిషాలు ఆలస్యంగా అనగా 12:05 ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ఈ ప్రయోగాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. కుమారుడు దేవాన్శ్‌తో కలిసి శ్రీహరికోటకు వెళ్లిన లోకేశ్‌.. ఇస్రో గ్యాలరీ నుంచి 'విక్రమ్‌-1' ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్‌ శాస్త్రవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated at - Jul 18 , 2026 | 12:33 PM