Share News

వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:51 AM

జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌‌ను ఢిల్లీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వాంగ్‌చుక్‌కు సరైన వైద్యసాయం అందించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్ద నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
Sonam Wangchuk

న్యూఢిల్లీ, జులై 18: జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌‌ను ఢిల్లీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వాంగ్‌చుక్‌కు సరైన వైద్యసాయం అందించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్ద నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో నిరసనకారులు పోలీసులను అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.


వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి ఇది..

గత 20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం వల్ల వాంగ్‌చుక్ దాదాపు 20 శాతం బరువు కోల్పోయారు. సుమారు 9 కేజీలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 56.55 కిలోలు మాత్రమే. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. ఆయన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయి. కండరాల క్షీణతతో ఆరోగ్యం బాగా దెబ్బతింది. డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీక్ష ఇలాగే కొనసాగి ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.


ఇవి కూడా చదవండి

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు మరింత తీవ్రం

Updated Date - Jul 18 , 2026 | 11:50 AM