Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 17 , 2026 | 08:41 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 17, 2026 21:54 IST

    కోనసీమలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలి: అచ్చెన్నాయుడు

    • విశాఖ–పారాదీప్‌ తీరప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

    • కోస్ట్‌గార్డ్‌ సమన్వయంతో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లు వేగవంతం చేయాలని సూచన

    • గాలింపు పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని మంత్రి ఆదేశం

  • Aug 17, 2026 21:45 IST

    హైదరాబాద్: బోట్ క్లబ్ వద్ద రేపు ట్రాఫిక్ ఆంక్షలు

    • సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆంక్షలు

    • ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమం

    • కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు

    • సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకూ ట్రాఫిక్ రద్దీకి అవకాశం

    • ఇక్బాల్ మీనార్ నుంచి ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్ వరకూ రద్దీ ఉండే అవకాశం

    • ఎన్‌టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు

    • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసుల సూచన

  • Aug 17, 2026 21:30 IST

    మహబూబాబాద్: మరిపెడ మండలం గిరిపురం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం

    • బైక్‌ని ఢీకొట్టిన బొలెరో వాహనం

    • ప్రమాదంలో మరిపెడ మండలం వెంకంపాడు సర్పంచ్ ఉప్పల సోమన్న మృతి

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 17, 2026 21:15 IST

    అమరావతి: కోనసీమ జిల్లాలో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా

    • జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం

    • గాలింపు చర్యలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశం

  • Aug 17, 2026 21:08 IST

    విశాఖ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

    • సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడుందని ప్రశ్నించిన హైకోర్టు

    • ప్రి లిటిగేషన్‌ పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో పీఎస్‌కు పిలిపించడంపై హైకోర్టు అభ్యంతరం

    • సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని విశాఖ సీపీకి ఆదేశం

    • కేసు విచారణ సెప్టెంబర్‌ 21కి వాయిదావేసిన హైకోర్టు

  • Aug 17, 2026 20:44 IST

    హైదరాబాద్: రాంపల్లి చౌరస్తాలో తప్పిన ప్రమాదం

    • జీహెచ్‌ఎంసీ చెత్త బండిలో ఒక్కసారిగా చేలరేగిన మంటలు

    • దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు

    • మంటలు చెలరేగిన చెత్త బండిని రోడ్డు పక్కకు తరలించిన పోలీసులు

    • స్థానికుల సహకారంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన ట్రాఫిక్ పోలీసులు

  • Aug 17, 2026 20:41 IST

    దేశంలో ఉన్నది ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్‌: బండి సంజయ్‌

    • వందేమాతరం గీతాన్ని MIM బహిష్కరిస్తే.. కాంగ్రెస్ అవమానించింది: బండి సంజయ్‌

    • BRSతో బీజేపీకి సంబంధాలు లేవు: బండి సంజయ్‌

    • BRS అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏమయ్యాయి?: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

  • Aug 17, 2026 20:40 IST

    హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

    • పూల్-డి గేమ్‌లో 2-4 తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఓటమి

  • Aug 17, 2026 20:13 IST

    ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

    • హిందీలో పుస్తకాన్ని రచించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

    • పుస్తకాన్ని ఆవిష్కరించిన నితిన్ నబీన్‌

    • పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

  • Aug 17, 2026 20:10 IST

    రూ.5 లక్షల పరిహారం చెల్లించాల్సిందే.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

    • స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యంపై బాంబే హైకోర్టు ఆగ్రహం

    • నిబంధనలు పాటిస్తున్నా జాప్యం ఎందుకని సూటి ప్రశ్న

    • 34 రోజుల పాటు స్వీట్ షాపు మూసివేత

    • షాపు వారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు

    పూర్తి కథనం..

  • Aug 17, 2026 20:00 IST

    రాజమండ్రి: రాజానగరం మండలం చక్రద్వారాబంధం గ్రామంలో దారుణం

    • కుటుంబ కలహాలతో భార్య మట్టపర్తి కుమారి(23)ని గొంతు నులిమి హతమార్చిన భర్త నాగరాజు

    • భార్యను చంపేసిన అనంతరం కత్తితో పొడుచుకున్న నాగరాజు

    • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నాగరాజు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాజానగరం పోలీసులు

  • Aug 17, 2026 19:54 IST

    ప్రజా పాలనలో విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం: సీఎం రేవంత్‌

    • విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పొందాలని కృషి

    • పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 17, 2026 19:45 IST

    ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు భేటీ

    • గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధానితో సమావేశం

    • గోవా రాష్ట్ర అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించిన అశోక్ గజపతి రాజు

    • రేపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలవనున్న గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు

    ashok-gajapathi-raju.jpg

  • Aug 17, 2026 19:44 IST

    రాజమండ్రి: AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు

    • ధోబీ ఘాట్ దగ్గర గోదావరిలో నూకరాజు మృతదేహం లభ్యం

    • అతని భార్య, కుమార్తె మృతదేహాల కోసం గాలింపు

  • Aug 17, 2026 19:40 IST

    నంద్యాల: ర్యాపిడో డ్రైవర్ మనోజ్‌పై దాడి ఘటనలో ట్విస్ట్‌

    • యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులే పిలిపించి దాడి చేశారన్న బాధితుడు

    • మనోజ్‌పై దాడి చేసి నగదు, వాచీ దోపిడీ చేసిన దుండగులు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

  • Aug 17, 2026 19:30 IST

    వేటకు వెళ్లి తిరిగిరాని మత్స్యకారుల పడవపై అధికారులు అప్రమత్తం

    • బోటు గల్లంతుపై సమీక్షించిన కలెక్టర్ మహేశ్‌కుమార్‌

  • Aug 17, 2026 19:15 IST

    రేపటి నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలు

    • కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ రెండేళ్లపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

    • గూగుల్‌ మ్యాప్స్‌లో సింగిల్‌ లేన్‌ రూట్‌ అప్‌డేట్‌

    • ట్రాఫిక్‌ కోసం 450 మంది సిబ్బంది మోహరింపు

    • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ

  • Aug 17, 2026 19:00 IST

    జగిత్యాల జిల్లా: మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం

    • ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

    • క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • Aug 17, 2026 18:38 IST

    సర్కార్ నడుపుతున్నవా.. లేక సర్కస్ నడుపుతున్నవా రేవంత్ రెడ్డి?: ఎక్స్‌లో హరీశ్ రావు

    • మీ తప్పులకు ప్రభుత్వ అధికారులు బలి కావాలా?: హరీశ్ రావు

    • తప్పు మీరు చేస్తే శిక్ష వారు అనుభవించాలా?: హరీశ్ రావు

    • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను బంద్ చేసే కుట్ర: హరీశ్ రావు

    • కుట్ర బయటపడటంతో ఆ తప్పును అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: హరీశ్ రావు

  • Aug 17, 2026 18:17 IST

    ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం

    • నిషాన్ ఏ ఇంతియాజ్ పురస్కారానికి ఎంపికైన ఇద్దరు బాంబే వైద్యులు

    • దేశ విభజన సమయంలో జిన్నా అనారోగ్యాన్ని దాచి ఉంచిన డాక్టర్లు

    • వారి వృత్తిపరమైన నిబద్ధతోనే పాక్ ఏర్పాటైందన్న ఆ దేశ మంత్రి ఎహ్సాన్

    • మరణానంతరం ఇద్దరు డాక్టర్లను ఎంపిక చేసిన పాక్

    • జిన్నా అనారోగ్యం గురించి గాంధీ, నెహ్రూలకూ తెలియలేదన్న చరిత్రకారులు

    పూర్తి కథనం..

  • Aug 17, 2026 18:15 IST

    సనత్‌నగర్‌లో టిమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

    • పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర, కోమటిరెడ్డి, పొన్నం

    • రూ.1,126 కోట్లతో సనత్‌నగర్‌ టిమ్స్‌ నిర్మాణం

    • టిమ్స్‌లో వెయ్యికిపైగా పడకలు, 300 ఐసీయూ బెడ్స్‌

    • దాదాపు 30 వరకు ఆపరేషన్‌ థియేటర్‌లు

  • Aug 17, 2026 18:05 IST

    ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌ నాగబాబుకు పవన్‌ శుభాకాంక్షలు

    • నాగబాబుకు కేబినెట్‌ హోదా కల్పించిన సీఎం చంద్రబాబుకు పవన్‌ ధన్యవాదాలు

    • 2047 నాటికి ఏపీలో 50 శాతం గ్రీన్‌కవర్‌ లక్ష్యం: పవన్‌ కల్యాణ్

    • హరితాంధ్ర లక్ష్యాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి: పవన్‌ కల్యాణ్

    • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

  • Aug 17, 2026 17:58 IST

    విమాన ఛార్జీల పెరుగుదల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

    • రద్దీ సమయాల్లో విమాన ఛార్జీల పెంపుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

    • నిబంధనలు పాటించని విమానాలు నిలిపివేయండి: సుప్రీం

  • Aug 17, 2026 17:24 IST

    హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ

    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన హీరో అల్లుఅర్జున్

    • తదుపరి విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా

  • Aug 17, 2026 17:20 IST

    అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం: సీఎం చంద్రబాబు

    • ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు: సీఎం చంద్రబాబు

    • నీటి పంపకాల్లో రాష్ట్రాల మధ్య విభేదాలు: సీఎం చంద్రబాబు

    • ఈ ఏడాది 35.5 శాతం లోటు వర్షపాతం ఉంటుందని అంచనా

    • కొన్ని జిల్లాల్లో 42 శాతం లోటు వర్షపాతం: సీఎం చంద్రబాబు

    • ఈసారి ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి: చంద్రబాబు

  • Aug 17, 2026 17:10 IST

    విజయనగరం: సంతకవిటి మండలం పనసపేటలో విషాదం

    • మోటారు శుభ్రం చేయటానికి బావిలో దిగిన అన్నదమ్ములు

    • ఆక్సిజన్ అందక అన్నదమ్ములు విష్ణు, రామకృష్ణ మృతి

    • మృతుల స్వగ్రామం పొందూరు మండలం మజిలీపేట

    • గ్రామదేవత పండుగ కోసం తాతగారి ఇంటికి వచ్చిన అన్నదమ్ములు

  • Aug 17, 2026 16:58 IST

    భారత్‌తో టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్

    • మూడో రోజు 284 పరుగులకు లంక ఆలౌట్

    • సెంచరీ బాదిన శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుశా(100)

    • 4 వికెట్లతో చెలరేగిన భారత బౌలర్ మానవ్ సుతార్

    • రవీంద్ర జడేజాకు 3, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్‌లకు తలొక వికెట్

    • శ్రీలంకపై 178 పరుగుల ఆధిక్యంలో భారత్

  • Aug 17, 2026 16:55 IST

    తెలంగాణ SIR ముసాయిదా విడుదల: CEO సుదర్శన్‌ రెడ్డి

    • 90 లక్షల మందికి నోటీసులు ఇస్తాం: సుదర్శన్‌ రెడ్డి

    • SIR ప్రక్రియకు ముందు రాష్ట్రంలో మొత్తం ఓట్లు 3.38 కోట్లు

    • 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇచ్చారు: సుదర్శన్‌ రెడ్డి

    • సెప్టెంబర్ 16లోగా సమాధానం ఇవ్వాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి

    పూర్తి కథనం..

  • Aug 17, 2026 16:42 IST

    ఓ స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..!

    • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్కూల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కపిల్ దేవ్

    • కార్యక్రమం నిర్వహించిన తీరుపై తీవ్ర అసంతృప్తి

    • ఫొటో కోసమే పిలిచారా? అంటూ యాజమాన్యంపై ఆగ్రహం

    • రెండు రోజుల తర్వాత తాజాగా నెట్టింట వీడియోలు వైరల్

  • Aug 17, 2026 16:40 IST

    NTA నుంచి 50 మంది సిబ్బంది తొలగింపు

    • CTO, CISO సహా 10 కొత్త పోస్టుల భర్తీ

    • సైబర్ సెక్యూరిటీకి ప్రైవేట్ నిపుణుల సేవలు

    పూర్తి కథనం..

  • Aug 17, 2026 16:40 IST

    ఏపీ అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్ల ప్రకటన

    • ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధప్రసాద్‌, కోళ్ల లలిత

    • ప్యానల్ స్పీకర్లుగా జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్‌

    • ప్యానల్ స్పీకర్లుగా వరదరాజులరెడ్డి, దాసరి సుధ

  • Aug 17, 2026 16:39 IST

    ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి అనుమతి

    • రెండు రోజుల కస్టడీకి అనుమతించిన ఉప్పరపల్లి కోర్ట్

    • రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి 4.30 వరకూ కస్టడీకి అనుమతి

    • ఉదయకృష్ణారెడ్డికి స్పెర్మ్ టెస్ట్‌కి కూడా అనుమతి

  • Aug 17, 2026 16:30 IST

    వనపర్తి: చిన్నారెడ్డి వ్యాఖ్యలకు MLA మేఘారెడ్డి కౌంటర్‌

    • కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందన్న వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

    • చిన్నారెడ్డి 8సార్లు బీఫామ్ తెచ్చుకున్నారు.. ఎంత డబ్బు ఇచ్చారు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

    • ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న మీకు వనపర్తిలో ఏం పని?: ఎమ్మెల్యే మేఘారెడ్డి

    • వనపర్తిలో తన అధికారాలకు అడ్డుతగిలితే సహించేది లేదు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

  • Aug 17, 2026 16:20 IST

    హైదరాబాద్‌: కాసేపట్లో సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభోత్సవం

    • MCR టిమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • టిమ్స్‌లో వెయ్యికిపైగా పడకలు, 300 ఐసీయూ బెడ్స్‌

    • దాదాపు 30 వరకూ ఆపరేషన్‌ థియేటర్లు

  • Aug 17, 2026 16:15 IST

    హైదరాబాద్: 22A భూములపై 4 జిల్లాల నుంచి దరఖాస్తులు: మంత్రి పొంగులేటి

    • మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారడ్డి, సంగారెడ్డి నుంచి దరఖాస్తులు: మంత్రి పొంగులేటి

    • ప్రైవేట్ భూమిని 22Aలో పెట్టారని 750 మంది దరఖాస్తు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • Aug 17, 2026 16:00 IST

    అమరావతి: పురపాలక శాఖ సవరణ బిల్లుకు ఆమోదం

    • ఆస్తుల ఆటోమ్యుటేషన్‌ అమల్లోకి వచ్చేలా చట్టంలో సవరణలు

    • రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్‌ ఫీజు చెల్లించేలా సవరణ

  • Aug 17, 2026 15:45 IST

    నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 281, నిఫ్టీ 78 పాయింట్ల నష్టం

  • Aug 17, 2026 15:30 IST

    1999లోనే ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్ రద్దు చేశారు: హరీశ్ రావు

    • అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు: మాజీ మంత్రి హరీశ్‌ రావు

    • సరూర్‌నగర్‌లో భూములను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు: హరీశ్‌ రావు

    • సీఎం నివాసం కూడా నిషేధిత జాబితాలో పెట్టారు: హరీశ్‌ రావు

    • నిషేధం నుంచి తీసివేయాలంటే 30 శాతం చెల్లించాలి: మాజీ మంత్రి హరీశ్‌ రావు

  • Aug 17, 2026 15:09 IST

    బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి

    • బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన

    • 13 మందికి ఉపాధ్యక్ష పదవులు

    • బీజేపీ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ

    • జాయింట్‌ కో-ఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి

    • ఉపాధ్యక్ష పదవి నుంచి డీకే అరుణను తప్పించిన బీజేపీ

    • కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్‌ చుగ్‌

    • OBC కొత్త ఉపాధ్యక్షుడిగా అమర్‌పాల్‌ మౌర్య

    • సంస్థాగత జనరల్‌ సెక్రటరీగా B.L. సంతోష్

    • సంస్థాగత జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా శివప్రకాష్‌

    • బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు దక్కని చోటు

    పూర్తి కథనం..

  • Aug 17, 2026 14:40 IST

    DSCపై చర్చ పెట్టమంటే వెనుకడుగు వేస్తున్నారు: బొత్స

    • ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై మాకు నమ్మకం లేదు: బొత్స

    • అందుకనే.. సీబీఐ విచారణ కోరుతున్నాం: బొత్స

    • గ్రూప్‌-1పైనా సీబీఐ విచారణకు మేం సిద్ధం: బొత్స

  • Aug 17, 2026 14:30 IST

    అసెంబ్లీ వేదికగా వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్

    • దమ్ముంటే వైసీపీ నేతలు అసెంబ్లీకి రావాలి: చంద్రబాబు

    • వాళ్ల దగ్గర ఉన్న సాక్ష్యాలు బయటపెట్టాలి: చంద్రబాబు

    • వైసీపీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టే.. సభకు రాకుండా రోడ్లపై నిరసనలు చేస్తున్నారు

    • అసెంబ్లీకి వస్తే దొరికిపోతామని వైసీపీ భయపడుతోంది: సీఎం చంద్రబాబు

  • Aug 17, 2026 14:20 IST

    ముంబైలో భారీ అగ్నిప్రమాదం

    • కండీవలీలోని ఐటీ భవనంలో చెలరేగిన మంటలు

    • భారీగా ఎగసిపడుతున్న మంటలు

    • మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు

  • Aug 17, 2026 14:15 IST

    హైదరాబాద్‌లో 28 వాహనాలకు బహిరంగ వేలం

    • 27 ద్విచక్ర వాహనాలు.. ఒక ఆటో బహిరంగ వేలం

    • కిస్మత్‌పూర్‌లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అకాడమీలో వేలం నిర్వహించనున్న అధికారులు

    • ఈ నెల18న ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం

  • Aug 17, 2026 14:10 IST

    కోనసీమ: సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

    • అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

    • ఈ నెల 3న విశాఖ తీరానికి వేటకు వెళ్లిన మత్స్యకారులు

    • వెళ్లిన గంట నుంచే బోటు నుంచి నిలిచిపోయిన సిగ్నల్స్

    • పది రోజుల్లో తిరిగి రావాల్సిన మత్స్యకారులు.. ఇప్పటివరకు రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన

  • Aug 17, 2026 14:00 IST

    విద్య విషయంలో టీడీపీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు: సీఎం చంద్రబాబు

    • గురుకులాల్లో నూతన విధానం తీసుకొచ్చింది ఎన్టీఆర్: చంద్రబాబు

    • విద్య విషయంలో అనేక సంస్కరణలు తెచ్చాం: చంద్రబాబు

    • దేశంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్: చంద్రబాబు

    • వైసీపీ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్‌మెంట్ జరగలేదు: చంద్రబాబు

    • సీఎంగా 11 సార్లు DSC నిర్వహించా: సీఎం చంద్రబాబు

  • Aug 17, 2026 13:51 IST

    ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

  • Aug 17, 2026 13:51 IST

    ఐపీఎల్‌ ట్రేడ్‌పై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు

    • ఏదైనా సరే పారదర్శకంగానే జరగాలి: గావస్కర్

    • అలా చేస్తేనే జవాబుదారీతనం ఉంటుంది..

    • లేనిపోని అపోహలు కల్పించి ప్రచారం చేయొద్దని సూచించిన గావస్కర్

  • Aug 17, 2026 13:38 IST

    సూర్యాపేట: మట్టపల్లిలోని NCL సిమెంట్ ఫ్యాక్టరీపై అటవీ శాఖ కొరడా

    • 12 ఎకరాల 6 కుంటల అటవీ భూమిని ఆక్రమించినట్లు గుర్తింపు

    • రేకుల షెడ్లు, వాటర్ ప్లాంట్‌తోపాటు పలు నిర్మాణాలు కూల్చివేత

    • అటవీ భూమిపై తమకు హక్కు ఉందన్న కంపెనీ యాజమాన్యం

    • కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు DFO అధికారి వెల్లడి

  • Aug 17, 2026 13:36 IST

    కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

    • తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలని ఆదేశం

    • కావేరి అథారిటీ ఆదేశాలను కర్ణాటక పాటించాలి: సుప్రీంకోర్టు

    • CWMA ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల జరగాలి

    • 12 రోజుల పాటు 12వేల క్యూసెక్కులు విడుదల చేయాలి: సుప్రీం

    • తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    • నీటి విడుదల పరిస్థితి పరిశీలించి 24న ఆదేశాలు ఇచ్చే అవకాశం

  • Aug 17, 2026 13:29 IST

    రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

    • అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

    • తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విచారణ నిలిపివేయాలని ఆదేశం

    • రాహుల్ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ

    • హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించొద్దని CBI, EDకి ఆదేశం

    • రాహుల్ గాంధీ వాదన వినకుండానే..

    • అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై CJI ఆగ్రహం

  • Aug 17, 2026 12:39 IST

    బిహార్‌: అశోక్ ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

    • తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం

    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రధాని

    • బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ

  • Aug 17, 2026 12:21 IST

    కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కచ్చితంగా అమలు చేస్తాం: మంత్రి పొన్నం

    • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను యథాతథంగా కొనసాగిస్తాం..

    • హైకోర్టులో స్టే ఎత్తివేయించి.. మళ్లీ అమలుకు ప్రయత్నం

    • స్టేను సాకుగా చూపి BRS రాజకీయం చేస్తోంది

    • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఎత్తివేసినట్టు BRS దుష్ప్రచారం చేస్తోంది

    • స్టేపై BRS నేతలు న్యాయపరంగా ఎందుకు పోరాడలేదని పొన్నం ప్రశ్న

  • Aug 17, 2026 12:18 IST

    IND vs SL: రవీంద్ర జడేజా ఖాతాలో వికెట్‌

    • లంక కెప్టెన్ ధనుంజయ(21)ను ఔట్ చేసిన జడేజా

  • Aug 17, 2026 12:16 IST

    భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసుల ప్రారంభంపై ఎక్స్‌లో సీఎం పోస్ట్

    • చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా భోగాపురం: సీఎం చంద్రబాబు

    • హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి రాక

    • తొలి విమాన రాకతో కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు

  • Aug 17, 2026 12:16 IST

    IND vs SL: ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక

    • 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక

    • ప్రస్తుతం క్రీజులో సోనల్(14), నిరోషన్(8)

  • Aug 17, 2026 12:14 IST

    జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు రాహుల్‌గాంధీ లేఖ

    • ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడాలని సూచన

    • శాంతియుత నిరసన హక్కు ప్రజాస్వామ్యానికి కీలకమని వెల్లడి

    • విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తుందన్న రాహుల్ గాంధీ

  • Aug 17, 2026 12:10 IST

    కొందరికి DSC అంటే అర్థం కూడా తెలియదు: మంత్రి నారా లోకేశ్

    • వాళ్లే పేపర్ లీక్ అని మాట్లాడుతున్నారు

    • డీఎస్సీ నిర్వహణలో ఎన్‌క్రిప్ట్ చేయలేని ఆన్‌లైన్ సిస్టం ప్రవేశపెట్టాం

    • ప్రశ్నలు ఒకేలా ఉండకుండా జంబ్లింగ్ విధానం తెచ్చాం

    • సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కాగా జరిగాకే ఉద్యోగాలిచ్చాం

    • ఏడాది తర్వాత DSCలో అక్రమాలంటూ వైసీపీ ఆరోపిస్తోంది

    • మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి..

    • DSCపై టీమ్ 11వి అనవసర ఆరోపణలు: మంత్రి లోకేశ్

  • Aug 17, 2026 12:06 IST

    'నా యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 వంటి స్కామ్ చూడలేదు': ఏపీ సీఎం చంద్రబాబు

    • అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌‌చాట్ సందర్భంలో చంద్రబాబు వ్యాఖ్యలు

    • ఎల్లుండి అన్ని వాస్తవాలు అసెంబ్లీ ముందు ఉంచుతామని సీఎం వెల్లడి

  • Aug 17, 2026 12:00 IST

    ఏపీ అసెంబ్లీ: DSC మీద141 కేసులు వేసినా కోర్టుల్లో నిలబడలేదు: మంత్రి లోకేశ్

    • కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా పెంచాం..

    • ఏ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఏ క్వశ్చర్ ఇచ్చారో మా దగ్గర రిపోర్ట్ ఉంది..

    • ఏ ప్రశ్న లీక్ అయినా.. వెంటనే తెలుసుకునే వ్యవస్థను తీసుకొచ్చాం

    • TCS అయాన్ సెంటర్స్ ద్వారా DSC నిర్వహించాం: మంత్రి లోకేశ్

  • Aug 17, 2026 11:53 IST

    వైసీపీ నేతలు కావాలనే DSCపై కేసులు వేశారు: మంత్రి నారా లోకేశ్

    • వర్టికల్, హారిజాంటల్ పద్ధతిలో DSC నిర్వహించాం

    • వర్టికల్, హారిజాంటల్ అమలు దేశ చరిత్రలోనే తొలిసారి

    • టెట్ తప్పనిసరి చేసి.. 20శాతం వెయిటేజ్ ఇచ్చాం

    • గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే.. మేం 65కు పెంచాం: మంత్రి నారా లోకేశ్

  • Aug 17, 2026 11:47 IST

    ఏపీ అసెంబ్లీ: గత ప్రభుత్వం టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టింది: లోకేశ్

    • కూటమి ప్రభుత్వం టీచర్లను సింగపూర్, ఫిన్‌లాండ్‌కు పంపింది: మంత్రి లోకేశ్

    • 2019-24 మధ్య ఒక్క టీచర్ రిక్రూట్‌మెంట్ జరుగలేదు..

    • 12లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు

    • జీవో 117తో ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా నష్టపోయాయి: లోకేశ్

  • Aug 17, 2026 11:44 IST

    DSC-2025పై మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

    • DSCని మా బాధ్యతగా భావించాం..

    • 148 రోజుల్లోనే DSC నియామకాలు పూర్తి చేశాం: లోకేశ్

    • 16 వేల పోస్టులతో మెగా DSC నిర్వహించాం..

    • ఏటా DSC నిర్వహిస్తాం: మంత్రి నారా లోకేశ్

    • టీచర్ రిక్రూట్‌మెంట్, ట్రాన్స్‌ఫర్స్.. గతంలో జడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవి

    • పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చాం: మంత్రి లోకేశ్

  • Aug 17, 2026 11:38 IST

    అమరావతి: BAC (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయాలు

    • 4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయం

    • బిల్లుల రూపంలో 9 ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టాలని నిర్ణయం

    • గ్రూప్-1 పరీక్షలో జరిగిన అక్రమాలపై ఎల్లుండి అసెంబ్లీలో చర్చ

  • Aug 17, 2026 11:36 IST

    యూజీసీ-నెట్‌ రీ-ఎగ్జామ్‌పై రాహుల్‌ గాంధీ విమర్శలు

    • ప్రధాని మోదీ, ఎన్‌టీఏ తీరుపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

    • తప్పుల కారణంగా యూజీసీ-నెట్‌ పరీక్షల రద్దు

    • మూడు సబ్జెక్టుల పరీక్షలు రీషెడ్యూల్‌

    • విద్యావ్యవస్థను ‘ఎక్స్‌ట్రాక్షన్‌ మెషీన్‌’ అని సంబోధించిన రాహుల్‌

    • విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందన్న రాహుల్‌

  • Aug 17, 2026 11:33 IST

    మంచిర్యాల: చెన్నూరులో బీఆర్ఎస్ రాస్తారోకో

    • కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ స్కీమ్‌లను కొనసాగించాలని డిమాండ్

  • Aug 17, 2026 11:33 IST

    మేడ్చల్: మల్కాజిగిరి పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్‌కు భూమి పూజ చేసిన సీపీ సుమతి

    • పోలీస్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా కొత్త ఫ్యూయల్ స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం

    • ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయం పక్కనే త్వరలో ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు

    • పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యూయల్ స్టేషన్

  • Aug 17, 2026 11:31 IST

    హైదరాబాద్: నార్సింగి పీఎస్ పరిధి అప్ప జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం

    • ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పడంతో ప్రమాదం

    • తీవ్ర గాయాలతో బండ వికాస్ అక్కడికక్కడే మృతి

    • జగిత్యాల ప్రాంతానికి చెందిన వికాస్

    • బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వికాస్

    • మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు

  • Aug 17, 2026 11:28 IST

    సిద్దిపేట: సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా

    • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దు యోచనకు నిరసనగా ధర్నా

    • హాజరైన సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు

  • Aug 17, 2026 11:24 IST

    బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా రాజీనామా

    • రాజీనామా ఆమోదించాలని బీజేపీని కోరిన పూనావాలా

    • తొలి రాజీనామా తిరస్కరణతో ఎక్స్‌ వేదికగా పోస్టు

    • ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో వైదొలగాలని నిర్ణయం

    • ప్రైవేట్‌ రంగంలోకి వెళ్లేందుకు రాజీనామా!

    • తొలి లేఖను తిరస్కరించిన బీజేపీ నాయకత్వం

  • Aug 17, 2026 11:16 IST

    అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో బీదర్ పోలీస్‌ల కస్టడీకి నిందితులు

    • 15 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు

    • ఏడాది క్రితం బీదర్‌లో ATM దగ్గర కాల్పులు, రూ.95లక్షలు చోరీ

    • తర్వాత అఫ్జల్‌గంజ్‌లో ట్రావెల్స్ నిర్వాహకుడిపై కాల్పులు

    • ఇటీవల నిందితులను బీదర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

  • Aug 17, 2026 11:14 IST

    జకార్తా: ఇండోనేషియాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు

    • ఆగస్టు 15న భూకంపం సంభవించి 59 మంది మృతి

    • తాజాగా నేడు ఇండోనేషియాను వణికించిన మరో భూకంపం

    • ఫ్లోరెస్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో మరో భూకంపం

    • భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం

  • Aug 17, 2026 11:14 IST

    IND vs SL: కష్టాల్లో శ్రీలంక

    • 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక

    • విజృంభిస్తున్న భారత్ బౌలర్లు

    • రెండు వికెట్లు పడగొట్టిన సుతార్

    • ఒక వికెట్ తీసిన సిరాజ్

  • Aug 17, 2026 11:12 IST

    ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన

    • మెగా DSCపై చర్చించాలంటూ వైసీపీ నిరసన

    • DSCలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు

  • Aug 17, 2026 11:11 IST

    తమిళనాడు: విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం

    • TVK మంత్రుల అవినీతిపై ఆధారాలున్నాయి: అన్నామలై

    • TVK మంత్రులు కమీషన్ల కోసం పాకులాడుతున్నారు

    • ప్రతి టెండర్‌లో పర్సంటేజ్ అడుగుతున్నారు

    • మంత్రుల ఆడియో క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి

    • మంత్రులను సీఎం విజయ్ కట్టడి చేయాలి..

    • లేదంటే ఆడియో క్లిప్స్ బయటపెడతా: అన్నామలై

  • Aug 17, 2026 11:11 IST

    అమరావతి: స్పీకర్ అయ్యన్న అధ్యక్షతన BAC సమావేశం

    • అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయనున్న BAC

    • హాజరైన చంద్రబాబు, పయ్యావుల, నాదెండ్ల, విష్ణుకుమార్‌రాజు

  • Aug 17, 2026 11:03 IST

    ఏపీ అసెంబ్లీ: 2029లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల

    • గోదావరి పశ్చిమ డెల్టాలో యనమదురు డ్రెయిన్ కీలకం: మంత్రి నిమ్మల

    • యనమదురు డ్రెయిన్ సామర్థ్యాన్ని 30వేల క్యూసెక్కులకు పెంచడానికి..

    • శిథిలావస్థకు చేరిన ఇన్‌లెట్ల పునఃనిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

    • రూ.3.2కోట్లు కేటాయించి 10 ఇన్‌లెట్లను పునఃనిర్మిస్తున్నాం

    • గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రెయిన్‌ల ఆధునీకరణ కోసం..

    • లైడార్ సర్వే పూర్తి చేసి డీపీఆర్ తయారు చేస్తున్నాం: మంత్రి నిమ్మల

    • కేసనపల్లి కెనాల్ ప్రాజెక్ట్‌కు అంచనాలు తయారు చేస్తున్నాం

    • 2027 మే నాటికి శంఖరగుప్తం డ్రెయిన్ పనులు పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల

  • Aug 17, 2026 10:57 IST

    USA: ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు!

    • అమెరికా కాంగ్రెస్‌ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ సంచలన వ్యాఖ్యలు

    • ఇరాన్‌పై అణు దాడులు ప్రారంభించడానికి ట్రంప్ రహస్యంగా సన్నద్ధమవుతున్నారని వ్యాఖ్య

    • త్వరలో అణుదాడులు చేయడానికి ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందన్న గ్రీన్

    • ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడి

    • ప్రపంచం మొత్తం పెద్ద సంఘర్షణలోకి.. ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిక

  • Aug 17, 2026 10:50 IST

    అసెంబ్లీ లాబీలో మంత్రి అచ్చెన్నకు పలువురు అభినందనలు

    • మండలిలో DSCపై వైసీపీ నేత బొత్సకు అచ్చెన్న స్ట్రాంగ్ కౌంటర్

    • అచ్చెన్నాయుడు కౌంటర్‌తో మండలిలో వెనక్కి తగ్గిన బొత్స

    • అచ్చెన్నాయుడును అభినందించిన మంత్రులు, MLCలు

  • Aug 17, 2026 10:49 IST

    IND vs SL: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్

    • 462 పరుగులకు ఆలౌటైన భారత్

    • తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక

    • ఆరంభంలోనే లంకకు బిగ్ షాక్

    • తొలి ఓవర్లోనే నిషాన్ ఫెర్నాండో ఔట్

  • Aug 17, 2026 10:49 IST

    పెరిగిన బంగారం ధరలు..

    • రూ.530 పెరిగి రూ.1,55,660కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం..

    • రూ.500 పెరిగి రూ.1,42,700కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం..

    • కిలో వెండి ధర రూ.2,55,000

  • Aug 17, 2026 10:44 IST

    హైదరాబాద్: 22-A భూములపై మంత్రి పొంగులేటి సమీక్ష

    • 22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించం: పొంగులేటి

    • ప్రజలను ఆఫీస్‌ల చుట్టూ తిప్పినా.. జాప్యం చేసినా ఉపేక్షించం

    • ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాం

    • పెండింగ్ దరఖాస్తులు ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టత ఇవ్వాలి

    • 22-Aలో భూమి ఉందని దరఖాస్తున్నా తిరస్కరించొద్దు

    • రికార్డులు, వాస్తవ పరిస్థితి పరిశీలించాలి: మంత్రి పొంగులేటి

    • భూ హక్కుదారులకు న్యాయం చేయాలి

    • ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలి

    • జాప్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం: మంత్రి పొంగులేటి

  • Aug 17, 2026 10:41 IST

    విజయనగరం: ఎయిర్‌పోర్టు రాకతో ఉత్తరాంధ్రలో కొత్త అధ్యాయం: రామ్మోహన్

    • విశాఖలో ఆపరేషన్స్ ఆపడంతో కొందరు బాధపడుతున్నారు..

    • కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంత బాధ కూడా ఉంటుంది

    • భవిష్యత్‌లో విశాఖ ఎయిర్‌పోర్టును ఎలా వినియోగించాలో ప్లాన్ చేస్తాం

    • విశాఖ నుంచి కొన్ని రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం..

    • బీచ్ కారిడార్ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్

  • Aug 17, 2026 10:41 IST

    ఏపీ మండలి: DSCలో అక్రమాలు జరిగాయి: బొత్స సత్యనారాయణ

    • అవినీతి వ్యవహారాలపై విచారణ జరపాలి: బొత్స

  • Aug 17, 2026 10:41 IST

    DSC పోస్టులపై చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు

    • 2019-24 మధ్య మెగా DSC వేస్తామన్నారు.. ఏమైంది?

    • సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారా?: అచ్చెన్న

    • DSCపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు..

    • కోర్టు కేసులతో మెగా DSCని అడ్డుకోవాలని చూశారు..

    • కష్టపడి చదివినవారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారు: అచ్చెన్న

  • Aug 17, 2026 10:41 IST

    వైసీపీ నినాదాలపై మంత్రి నాదెండ్ల తీవ్ర అభ్యంతరం

    • సభను ఆర్డర్‌లోకి తీసుకురావాలని చైర్మన్‌కు వినతి

    • సభను అడ్డుకోవడం సరికాదు: మంత్రి నాదెండ్ల

    • సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారు: నాదెండ్ల

  • Aug 17, 2026 10:19 IST

    అమరావతి: వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

    • పెద్దల సభలో వైసీపీ సభ్యులు ఇలా చేయటం సరికాదు

    • సభా గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారు

    • వైసీపీ వారిచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఇలా చేస్తున్నారు

    • వైసీపీ సభ్యుల నినాదాలతో సభ కొద్ది సేపు వాయిదా

  • Aug 17, 2026 10:18 IST

    ఏపీ శాసనమండలిలో గందరగోళం

    • మెగా DSCపై చర్చించాలంటూ వైసీపీ ఆందోళన

    • DSCలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు

    • మెగా DSC.. దగా DSC అంటూ వైసీపీ సభ్యుల నినాదాలు

    • వైసీపీ నినాదాలపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం

    • సభను ఆర్డర్‌లోకి తీసుకురావాలని ఛైర్మన్‌కు వినతి

  • Aug 17, 2026 10:13 IST

    ఢిల్లీ: సోనియా, రాహుల్‌పై ఐపీ ఎస్టేట్ పీఎస్‌లో ఫిర్యాదు

    • ఆగస్ట్ 15న 'వందేమాతరం' ఆలాపనకు ఆటంకం కలిగించారని ఆరోపణ

    • ఫిర్యాదు చేసిన అడ్వకేట్స్ శుభ్‌ శర్మ, కుణాల్ వినాయక్

    • 'వందేమాతరం' ఆలాపిస్తున్న సమయంలో సోనియా సైగలు చేస్తూ..

    • గేయాన్ని మధ్యలోనే ఆపేయాలని సూచించినట్టు ఫిర్యాదు

  • Aug 17, 2026 10:11 IST

    ఏపీ మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ

    • మెగా DSCపై చర్చించాలని వైసీపీ తీర్మానం, తిరస్కరించిన చైర్మన్

    • చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ ఆందోళన, ప్లకార్డులతో నినాదాలు

  • Aug 17, 2026 10:07 IST

    వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్-2లో ప్రమాదంపై స్పందించిన మంత్రి నిమ్మల

    • ప్రాజెక్ట్ సీఈ, మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధులతో సమీక్ష

    • హైడ్రాలిక్ మిషన్ తగిలి యూపీ వాసి మృతిపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి

    • మృతుడి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం అందించాలని ఆదేశం

    • ప్రాజెక్ట్ పనుల చివరి దశలో ఘటన జరగడం విచారకరం..

    • టన్నెల్ పనుల్లో కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి నిమ్మల

  • Aug 17, 2026 10:02 IST

    సిరిసిల్ల: పాత బస్టాండ్ ప్రాంతంలో మద్యం మత్తులో దంపతుల మధ్య గొడవ

    • కత్తితో పరస్పరం దాడి, భార్య బాలామణి మణికట్టును కత్తితో కోసిన భర్త సాయిలు

    • తీవ్ర రక్తస్రావం, ఆస్పత్రికి తరలింపు, పోలీసుల అదుపులో భర్త సాయిలు

  • Aug 17, 2026 10:00 IST

    సంగారెడ్డి: తెల్లాపూర్‌లో కాంగ్రెస్ వర్సెస్ BRS

    • ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనకు హాజరైన బీఆర్ఎస్ MLA మహిపాల్‌రెడ్డి

    • అదే సమయంలో సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

    • శిలాఫలకం, అధికారులు లేకుండానే స్కూల్ నిర్మాణానికి..

    • MLA ఎలా శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం

  • Aug 17, 2026 09:57 IST

    కామారెడ్డి: రామారెడ్డి మండలం రంగపేట శివారులో రైలు కిందపడి లోకోటి జగదీప్(52) ఆత్మహత్య

    • హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న ఇస్రోజీవాడికి చెందిన జగదీప్

    • కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జగదీప్

  • Aug 17, 2026 09:52 IST

    మేడ్చల్: హాష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు

    • రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం

    • ఆరుగురు పెడ్లర్లను అరెస్ట్ చేసిన మల్కాజిగిరి పోలీసులు

  • Aug 17, 2026 09:52 IST

    సిద్దిపేట: హుస్నాబాద్‌లోని హనుమాన్‌ నగర్‌లో దారుణం

    • భర్త వెంకటేశం(61)ని రోకలిబండతో కొట్టి చంపిన భార్య రాజమణి

    • ఆసిఫాబాద్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా చేస్తున్న భర్త వెంకటేశం

    • హుస్నాబాద్‌లో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న భార్య రాజమణి

    • ఈనెలలో పదవీవిరమణ కావాల్సిఉన్న సీటీవో వెంకటేశం

    • ఆస్తి పంపకాల గొడవే కారణమంటున్న కుటుంబ సభ్యులు

    • నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Aug 17, 2026 09:52 IST

    పశ్చిమ బెంగాల్‌: బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో ఘోర అగ్నిప్రమాదం

    • హోటల్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం

    • ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి గ్రౌండ్ ఫ్లోర్‌కి అంటుకున్న మంటలు

    • ఈ భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురి మృతి, పలువురికి తీవ్రగాయాలు

  • Aug 17, 2026 09:46 IST

    సిద్దిపేట: మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్

    • 13 మంది విద్యార్థులకు అస్వస్థత, ప్రభుత్వాస్పత్రికి తరలింపు

  • Aug 17, 2026 09:45 IST

    యాంకర్ అనసూయకు షాక్!

    • బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

    • అనసూయపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

    • హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతల ఆగ్రహం.

    • జైశ్రీరామ్ ముసుగులో కొందరు దాడులకు దిగుతున్నారంటూ..

    • ఇటీవల వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ

    • తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన అనసూయ

  • Aug 17, 2026 09:45 IST

    రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌పై కైఫ్‌ విమర్శలు

    • కామన్‌సెన్స్‌ వాడాలి కదా.. అంటూ కైఫ్ చురకలు

    • శ్రీలంకతో తొలి టెస్టులో ఔటైన తీరుపై మహ్మద్ కైఫ్‌ విమర్శలు

    • కొత్త బంతితో తొలి ఓవర్‌లోనే షాట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు: కైఫ్‌

  • Aug 17, 2026 09:43 IST

    క్రిస్టియానో రొనాల్డో సంచలన కామెంట్స్

    • ఫుట్‌బాల్ కెరీర్‌కు ఇదే ఆఖరి సీజన్: రొనాల్డో

    • తన కెరీర్‌ చివరి దశకు చేరుకుందన్న పోర్చుగల్ స్టార్

    • ఇదే ఆఖరి ఏడాది కావచ్చని ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో

  • Aug 17, 2026 09:42 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,55,120

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,42,190

    • కిలో వెండి ధర రూ.2,54,900

  • Aug 17, 2026 09:41 IST

    విశాఖపట్నం: ప్రతి అరగంటకు భోగాపురం విమానాశ్రయానికి బస్సు

    • నేటి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బస్సు నడిపేలా ఆర్టీసీ ప్రణాళిక

    • పాతగాజువాక నుంచి ఉదయం 4.55 గంటలకు తొలి సర్వీసు

    • సాధారణ ప్రయాణికులకు కూడా అనుమతి

    • నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి బస్సు సర్వీసులు: APSRTC

  • Aug 17, 2026 09:32 IST

    ఏపీ అసెంబ్లీ: 29 గ్రామాల్లో లేఅవుట్‌లు చేస్తున్నాం: మంత్రి నారాయణ

    • రూ.904 కోట్ల అంచనా వ్యయంతో గ్రామాల అభివృద్ధి: నారాయణ

    • అండర్ గ్రౌండ్, డ్రెయిన్, లైట్ల అభివృద్ధి పనులు

    • గతంలోని పైప్‌లైన్లు తొలగించి కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు

    • రాజధాని అమరావతిలో 119 పనులు ప్రపోజ్ చేయగా..

    • 103 పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చాం

    • 97 పనులు జరుగుతున్నాయి

    • వరల్డ్ బ్యాంక్, ADB, నాబార్డుల ద్వారా,..

    • రూ.41,187.7 కోట్లు ట్రూఅప్ చేసి రూ.12,737.13 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి నారాయణ

  • Aug 17, 2026 09:28 IST

    'డా.ఎంసీఆర్‌ టిమ్స్‌' ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్‌ ఎర్రగడ్డలో అత్యాధునిక వైద్యశాల

    • మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌)

    • నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్న సనత్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

    • ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్

    • మొత్తం 22.6 ఎకరాల్లో రూ.1,100 కోట్ల వ్యయంతో టిమ్స్‌ నిర్మాణం

    • వెయ్యి పడకలతో అత్యాధునికంగా నిర్మించిన టిమ్స్‌లో ఐదు బ్లాకుల్లోని అన్ని వసతులు సిద్ధం

  • Aug 17, 2026 09:21 IST

    వనపర్తి: కాంగ్రెస్‌పై మాజీమంత్రి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నా..

    • లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడిని: చిన్నారెడ్డి

    • కాంగ్రెస్‌లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి..

    • మీరే సీఎం అవుతారని రేవంత్‌కు చెప్పా..

    • సోనియా చెప్పినా డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వలేదు

    • పార్టీకి అన్యాయం చేస్తున్నవారిని బయటకు గెంటేస్తాం

    • 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం కృషి చేశా..

    • వనపర్తిని సర్వ నాశనం చేస్తున్నారు: చిన్నారెడ్డి

  • Aug 17, 2026 09:19 IST

    అమెరికా పర్యటనకు కుటుంబ సభ్యులతో కేటీఆర్

    • కుమార్తెను కాలేజీలో చేర్పించేందుకు వెళ్తున్న కేటీఆర్

    • 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో కేటీఆర్

  • Aug 17, 2026 09:18 IST

    ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • ప్రశ్నోత్తరాల తర్వాత BACలో అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు

    • కాసేపట్లో ప్రారంభంకానున్న శాసనమండలి

    • అసెంబ్లీకి దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు

  • Aug 17, 2026 09:10 IST

    మేడ్చల్: బోడుప్పల్ శ్రీ సాయిరామ్‌నగర్‌లో ఇంట్లో ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేష్(29) ఆత్మహత్య

    • తల్లిదండ్రులు, చెల్లిని మిస్ అవుతున్నానంటూ చెల్లికి మెసేజ్ పెట్టిన మృతుడు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 17, 2026 09:09 IST

    నేడు యథాతథంగా KRMB త్రిసభ్య కమిటీ భేటీ

    • రేపు జరగాల్సిన GRMB సమావేశం వాయిదా

    • అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా భేటీ వాయిదా

    • తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్న GRMB

  • Aug 17, 2026 09:08 IST

    నేటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్ల ఫేజ్-3 ఆందోళన

    • ఉదయం 8 గంటల నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ

    • ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

  • Aug 17, 2026 09:08 IST

    నేడు విశాఖకు బీజేపీ చీఫ్‌ నితిన్ నబీన్‌

    • రేపు బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

    • పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రగతిపై చర్చ

  • Aug 17, 2026 09:07 IST

    సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ ఆస్తుల వివాదం

    • అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై రాహుల్‌ పిటిషన్

    • రాహుల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

    • రాహుల్ పిటిషన్‌ విచారించనున్న CJI త్రిసభ్య ధర్మాసనం

  • Aug 17, 2026 09:07 IST

    ఢిల్లీ: నేడు బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన

    • నూతన కార్యవర్గాన్ని ప్రకటించనున్న నితిన్ నబీన్

    • ఏపీ, తెలంగాణ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు

    • కొత్త కార్యవర్గంలో యువత, మహిళలకు కీలక పదవులు

    • పలువురు కేంద్ర మంత్రులకూ చోటు దక్కే అవకాశం

  • Aug 17, 2026 09:07 IST

    నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు BRS పిలుపు

    • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై BRS నిరసనలు

    • పథకాలపై హైకోర్టు స్టే విధించడంతో నిరసనలకు పిలుపు

  • Aug 17, 2026 09:05 IST

    జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు కుట్ర!

    • గుంటూరు: ఓ రౌడీషీటర్‌తో సుపారీ మాట్లాడిన వైసీపీ నేత

    • హత్యకు రూ.కోటిన్నరకు సుపారీ మాట్లాడిన వైసీపీ నేత నరేంద్ర రెడ్డి

    • ఉదయం జిమ్‌కు వెళ్లే క్రమంలో హత్య చేయాలని పథకం

    • ఇప్పటికే రెండుసార్లు రెక్కీ నిర్వహించిన ఓ గ్యాంగ్

    • వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చేసిన నరేంద్ర రెడ్డి

    • నరేంద్ర రెడ్డి అరాచకాలు అడ్డుకున్న బోనబోయిన

    • గత ఎన్నికల పోలింగ్‌ రోజు ఎంపీ అభ్యర్థి పెమ్మసానిపై దాడికి యత్నం

    • వైసీపీ నేత నరేంద్రరెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు

    • కుట్ర బయట పడటంతో పరారీలో ఉన్న నరేంద్ర రెడ్డి

    • వైసీపీ నేత నరేంద్ర రెడ్డి కోసం పోలీసులు గాలింపు

  • Aug 17, 2026 09:05 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉ.9 నుంచి సా.5గంటల వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు

    • రా.7 గంటలకు ఏపీ హైకోర్టు సీజేతో మర్యాదపూర్వక భేటీ

    • రా.7:35కు విజయవాడలో ఓ వివాహ వేడుకకు హాజరు

  • Aug 17, 2026 09:04 IST

    అమరావతి: వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి లోకేశ్ నివాళి

    • పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని రైతులు

    • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయల్దేరిన నాయకులు

  • Aug 17, 2026 09:04 IST

    హైదరాబాద్: బాలాపూర్‌లో దారుణం

    • ప్రియురాలిని దారుణంగా కొట్టి చంపిన ప్రియుడు

    • పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య

    • మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు యత్నం

    • స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం

    • నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

    • పోలీసుల అదుపులో అహ్మద్‌తో పాటు అతడి తల్లిదండ్రులు

    • మృతురాలు బిహార్‌ వాసిగా గుర్తింపు

  • Aug 17, 2026 09:02 IST

    రాజమండ్రి: గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం

    • వంతెనపై నుంచి గోదావరిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు

    • పంచాయతీరాజ్ ఏఈ నూకరాజుతో పాటు ముగ్గురు గల్లంతు

    • సురక్షితంగా ఒడ్డుకు చేరిన నూకరాజు మనవడు

    • గల్లంతైన నూకరాజు, ఆయన భార్య, కుమార్తె కోసం గాలింపు

  • Aug 17, 2026 08:54 IST

    సా.4గంటలకు తెలంగాణలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

    • సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలకు అవకాశం

    • అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్న ఈసీ

  • Aug 17, 2026 08:54 IST

    ఆదిలాబాద్‌: నేడు ఉట్నూర్‌లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ PCA సమావేశం

    • హాజరుకానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి, AICC కార్యదర్శి సచిన్ సావంత్

  • Aug 17, 2026 08:54 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌లో జిల్లాల పొలిటికల్ ఎఫైర్స్ సమావేశాలు

    • ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశాలు

    • హాజరుకానున్న జిల్లాల అధ్యక్షులు, పీఏసీ సభ్యులు

  • Aug 17, 2026 08:52 IST

    బిహార్: అశోక్ ధామ్ దేవాలయంలో తొక్కిసలాట

    • విద్యుత్ స్తంభం కారణంగా భక్తులకు కరెంట్ షాక్

    • భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట

    • ఆరుగురు భక్తులు మృతి, పలువురికి తీవ్రగాయాలు

    • లఖినరాయ్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో ఘటన

  • Aug 17, 2026 08:51 IST

    ఉ.10గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ శాసనమండలి

    • పలు కీలక వార్షిక నివేదికలు, ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రులు

  • Aug 17, 2026 08:51 IST

    ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ సభ్యులు డుమ్మా

    • ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే సభకు రాబోమన్న వైసీపీ

  • Aug 17, 2026 08:49 IST

    భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

    • భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి షెడ్యూల్డ్ విమానం

    • హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం (6E6408)

    • తొలిరోజు ASR ఎయిర్‌పోర్టు నుంచి 25 విమానాల రాకపోకలు

  • Aug 17, 2026 08:47 IST

    నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

    • ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ

    • ప్రశ్నోత్తరాల తర్వాత భేటీకానున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ

    • మెగా DSCపై ప్రకటన చేయనున్న మంత్రి లోకేశ్

    • అమరావతిలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు,..

    • విద్యుత్ సంస్థలకు భూకేటాయింపులు, శాంతిభద్రతలపై చర్చ

    • ఎన్‌నినో ప్రభావం, పెట్టుబడులు, జాబ్ క్యాలెండర్‌పై చర్చ

    • బీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం