బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం.. పురందేశ్వరికి కీలక పదవి..
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:32 PM
బీజేపీ అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా..
న్యూఢిల్లీ: బీజేపీ అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని ప్రకటించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, OBC మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య పేర్లను ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. అలాగే, సంస్థాగత జనరల్ సెక్రటరీగా B.L.సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించారు.
13 మంది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు వీరే..
1. వసుంధర రాజే సింధియా - రాజస్థాన్
2. తీరథ్ సింగ్ రావత్ - ఉత్తరాఖండ్
3. రామ్ మాధవ్ - ఢిల్లీ
4. బైజయంత్ జయ్ పాండా - ఒడిశా
5. డి. పురందేశ్వరి - ఆంధ్రప్రదేశ్
6. రేఖా వర్మ - ఉత్తరప్రదేశ్
7. వర్షాబెన్ నరేంద్రభాయ్ - గుజరాత్
8. డా. భారతి ప్రవీణ్ పవార్ - మహారాష్ట్ర
9. సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్ - పంజాబ్
10. లాల్ సింగ్ ఆర్య - మధ్యప్రదేశ్
11. ప్రొఫెసర్ ఎం. నాగరాజా - కర్ణాటక
12. ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ - ఉత్తరప్రదేశ్
13. డా. మధుచంద్ర కర్ - పశ్చిమ బెంగాల్
జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం)
1. బీఎల్ సంతోష్ - ఢిల్లీ
జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగతం)
1. శివప్రకాశ్ - ముంబై
2. సౌదాన్ సింగ్ - చండీగఢ్
జాతీయ ప్రధాన కార్యదర్శులు
1. వినోద్ తావ్డే - మహారాష్ట్ర
2. సునీల్ బన్సల్ - ఢిల్లీ
3. బిప్లబ్ కుమార్ దేబ్ - త్రిపుర
4. స్మృతి ఇరానీ - ఉత్తరప్రదేశ్
5. డా. సతీష్ పూనియా - రాజస్థాన్
6. గజేంద్ర పటేల్ - మధ్యప్రదేశ్
7. హరీష్ ద్వివేది - ఉత్తరప్రదేశ్
8. సంజయ్ భాటియా - హరియాణా
జాతీయ కార్యదర్శులు
1. కవితా పాటిదార్ - మధ్యప్రదేశ్
2. కే. సురేంద్రన్ - కేరళ
3. డా. భోలా సింగ్ - ఉత్తరప్రదేశ్
4. డా. ప్రదీప్ వర్మ - జార్ఖండ్
5. జగదీశ్ ఈశ్వరభాయ్ పటేల్ - గుజరాత్
6. డా. సందీప్ పాఠక్ - ఢిల్లీ
7. ఫాంగ్నోన్ కోన్యాక్ - నాగాలాండ్
8. సంగీతా యాదవ్ - ఉత్తరప్రదేశ్
9. అనిల్ ఆంటోనీ - కేరళ
10. డా. ఎం. వెంకటేశన్ - తమిళనాడు
11. మనోజ్ టిగ్గా - పశ్చిమ బెంగాల్
12. సిద్ధార్థ్ శంభు - బీహార్
13. డా. స్వదేశ్ సింగ్ - ఢిల్లీ
14. మృగాంక్ దేవ్ బర్మన్ - అసోం
15. రోహన్ గుప్తా - గుజరాత్
16. జై ప్రకాశ్ - ఢిల్లీ
జాతీయ కోశాధికారి
1. పీయూష్ గోయల్ - మహారాష్ట్ర
జాతీయ సంయుక్త కోశాధికారి
1. రాజేష్ మంగళ్ - రాజస్థాన్
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. అనుభవజ్ఞులైన నాయకులు, యువ నాయకుల సమ్మేళనంతో జాతీయ కార్యవర్గంలో ప్రాంతయ ప్రాతినిథ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక సంస్థాగత పాత్రలోకి తిరిగి రావడం ఒక పెద్ద పరిణామం. తెరపైకి వచ్చిన మరో కీలక పేరు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులలో ఆరుగురు మహిళలు ఉండటం, పార్టీ కీలక పదవులలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఈ నియామకాలు దక్షిణ, తూర్పు రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్న ధోరణిని సూచిస్తున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నాయకులకు కీలక పదవులు లభించాయి.
Also Read:
హనీమూన్‌లో నెలసరి.. మూడ్ చెడగొట్టావంటూ భార్యపై దాడి! 3 ఏళ్ల తరువాత..
కిడ్నాప్ డ్రామా ఆడిన యువకుడు.. ఆ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయాడు..