తెలంగాణలో SIR ముసాయిదా విడుదల..
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:10 PM
తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదాను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. SIR ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు తెలిపారు. 2.73 శాతం మంది చనిపోయినవారిగా గుర్తించినట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న వారు వీలైనంత త్వరగా స్పందించాలని కోరారు. ఏ కారణంతో నోటీసు జారీ చేశామో స్పష్టంగా తెలియజేస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు.
సర్ జాబితా ముసాయిదా కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించనున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. SIR ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
Also Read:
తెలంగాణలో SIR ముసాయిదా విడుదల..
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్