Share News

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:02 PM

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

పాట్నా: జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 3వ తేదీన బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 1995 నుండి బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని దక్కించుకున్న పీకే.. బీజేపీకి గట్టి దెబ్బ కొట్టి చరిత్రాత్మక ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 64,151 ఓట్లు సాధించిన పీకే.. బీజేపీకి చెందిన నీరజ్ కుమార్‌ను 19,324 ఓట్ల తేడాతో ఓడించారు.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు వెళ్లడంతో.. బంకీపూర్‌ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో పోటీ చేసిన పీకే.. ఎవరూ ఊహించని రీతిలో విజయం ఢంకా మోగించి.. బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.


Also Read:

చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారులు.. కోనసీమ జిల్లా యంత్రాంగం అలర్ట్

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

Updated Date - Aug 17 , 2026 | 05:02 PM