చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారులు.. కోనసీమ జిల్లా యంత్రాంగం అలర్ట్
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:45 PM
చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారుల బోటు కోసం కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన IND-AP-E8-MO-135 బోటు ఈ నెల 3న చేపల వేటకు వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
కోనసీమ, ఆగస్టు 17: చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారుల బోటు కోసం కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన IND-AP-E8-MO-135 బోటు ఈ నెల 3న చేపల వేటకు వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ నెల 13న తిరిగి ఓడలరేవుకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు బోటు తిరిగి రాలేదని వెల్లడించారు.
బోటులో మొత్తం 8 మంది మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోటులో 15 రోజులకు సరిపడా రేషన్, 1,000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. బోటు విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మత్స్యకారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
వెంటనే ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్‌గార్డ్ దృష్టికి తీసుకెళ్లి, గాలింపు, రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుని మత్స్యకారుల ఆచూకీ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బోటు యజమాని, మత్స్యకారుల కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన పూర్తి సమాచారాన్ని సేకరించి కోస్ట్‌గార్డ్‌కు అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు
విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News