ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు శాశ్వత మైలురాయి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:28 PM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంతో రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతమైందని తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యాల విస్తరణ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు నిలువెత్తు రూపమని చెప్పుకొచ్చారు.
ఈ విమానాశ్రయం మూలంగా కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించాలని పవన్ కోరుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది శాశ్వత మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదిగి, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు
విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News