నాలుగు రోజుల పాటు ఏసీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:52 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈరోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.
అమరావతి, ఆగస్టు 17: నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈరోజు(సోమవారం) స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. ఇందులో భాగంగా సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. రేపు(మంగళవారం) బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు.
ఎల్లుండి(ఆగస్టు 19) గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఏసీలో నిశ్చయించారు. సమయంతో సంబంధం లేకుండా అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
మండలిలో బొత్సకు స్ట్రాంగ్ కౌంట్.. మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు
2029లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
Read Latest AP News And Telugu News