మండలిలో బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్.. మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 10:54 AM
ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి అచ్చెన్నాయుడిని పలువురు అభినందించారు. శాసనమండలిలో మెగా DSCపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి, ఆగస్టు 17: ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి అచ్చెన్నాయుడిని పలువురు అభినందించారు. శాసనమండలిలో మెగా DSCపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో మంత్రిని జనసేన ఎమ్మెల్సీ నాగబాబుతో పాటు, మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందించారు. మండలిలో డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుపడుతూ చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు. ఈ సమయంలో ఆ పార్టీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత ప్రభుత్వంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్లు DSC ఎందుకు వేయలేదని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌కు DSC వేయాలని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు. అచ్చెన్న కౌంటర్‌తో చైర్మన్ పోడియం వద్ద నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గారు. దీనిపై అసెంబ్లీ లాబీలో అచ్చెన్నాయుడిని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు అభినందించారు. అలాగే ఆగస్టు 15న బీపీ లో కారణంగా మంత్రి ఆనం రామనారాయణ స్పృహతప్పి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు అసెంబ్లీకి వచ్చిన ఆనంను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం
ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం
Read Latest AP News And Telugu News