Share News

భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:20 PM

భోగాపురం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైందన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, ఆగస్టు 17: భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైందన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుందన్నారు. తొలి విమానం రాకతో ఏపీ.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.


భోగాపురం విమానాశ్రయం.. రాష్ట్రంలో కొత్త అవకాశాలకు బాటలు వేస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. యువత ఆశలు, ఆకాంక్షలకు ఈ విమానాశ్రయం రెక్కలు తొడుగుతుందని.. విద్య, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలకు మరింత ఊతమిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చరిత్రాత్మక కొత్త ఆరంభమని.. ఉత్తరాంధ్రకు కొత్త గేట్‌వేగా అవతరించనుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఏపీ కొత్త శకానికి నాంది పలికిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

2029లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు

నాలుగు రోజుల పాటు ఏసీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 01:36 PM