-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 8th August 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 08 , 2026 | 06:56 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 08, 2026 21:42 IST
జలధార-జలహారతిపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
జలధార-జలహారతి నిరంతర కార్యక్రమం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో దృష్ట్యా ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి
తాగునీటి నిల్వలు, సరఫరాపై ప్రణాళిక రూపొందించాలి: సీఎం
అందుబాటులో ఉన్న నీటిని ఒడిసి పట్టుకోవాలి: చంద్రబాబు
-
Aug 08, 2026 21:19 IST
స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఇంట విషాదం
మెస్సి తండ్రి జార్జ్ మెస్సి(68) కన్నుమూత
సంతాపం తెలుపుతున్న పలువురు క్రీడా ప్రముఖులు
-
Aug 08, 2026 20:42 IST
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఈ నెల 17న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ
అదే రోజు ఉదయం 10 ప్రారంభం కానున్న శాసనమండలి
-
Aug 08, 2026 20:38 IST
చందానగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు..
GSM మాల్ ఎదురుగా సర్వీస్ రోడ్డుపై ఘటన
బెలూన్లు నింపే గ్యాస్ సిలిండర్ పేలుడు
పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర గాయాలు
మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
-
Aug 08, 2026 20:25 IST
ప్రకాశం: లింగసముద్రం మండలం మొగిలిచర్ల వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా
దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తున్న ఏడుగురు భక్తులకు గాయాలు
హాస్పటల్‌కి తరలింపు
-
Aug 08, 2026 20:19 IST
ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ అరెస్టు
చిలకపాలెం దగ్గర చింతాడ రవికుమార్‌ను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
మహిళా ఎస్ఐ పట్ల అనుచిత ప్రవర్తన కేసులో A1 చింతాడ రవికుమార్
10 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరిగిన చింతాడ రవికుమార్
-
Aug 08, 2026 20:03 IST
అమరావతి: కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
ఇటీవల అస్వస్థతకు గురైన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి
బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శ
బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం
-
Aug 08, 2026 20:02 IST
హైదరాబాద్: మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బులెటిన్
ప్రియాంకకు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీ: వైద్యులు
ఇంకా విషమంగా ప్రియాంక ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
ప్రియాంకకు వెంటిలేటర్‌పై చికిత్స: కిమ్స్ వైద్యులు
-
Aug 08, 2026 20:00 IST
జోగులాంబ గద్వాల్: అలంపూర్‌లో గంజాయి కలకలం
అలంపూర్ మండలం సుల్తానాపురం గ్రామంలో పోలీసుల దాడులు
సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు
దాడుల్లో సుమారు కిలో గంజాయి స్వాధీనం
గంజాయి వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులు పోలీసుల అదుపులో నార్కోటిక్స్ శాఖ అధికారులతో కలిసి దర్యాప్తు
-
Aug 08, 2026 19:06 IST
హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీకాంగ్రెస్ సమీక్ష
ఈ నెల 10 నుంచి 4 రోజులపాటు మీనాక్షి వరుస సమీక్షలు
SIR ప్రక్రియ పురోగతిపై చర్చించనున్న మీనాక్షి
-
Aug 08, 2026 19:04 IST
అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ప్రతికూల వాతావరణంతో నిలిపివేసిన అధికారులు
-
Aug 08, 2026 18:46 IST
విజయనగరం: ఏనుగుల కట్టడికి ‘ఆపరేషన్ గజ’లో తొలి అడుగు
బొబ్బిలి మం. రాముడువలసలో తిష్టవేసిన ఏనుగుల గుంపులో కుంకీ ఏనుగులు అభిమన్యు, జయంతిని చేర్చిన అటవీ అధికారులు
ఏనుగుల గుంపుతో కుంకీ ఏనుగులు మమేకమయ్యేలా చేస్తాం: డీఎఫ్‌వో
-
Aug 08, 2026 18:25 IST
రేపు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన
నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేసీఆర్
ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి
-
Aug 08, 2026 18:19 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
ఏడేళ్లు దాటినా వైఎస్ వివేకా హత్య మిస్టరీ తేలలేదు: సునీత
వివేకా హత్య కేసులో CBI దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ సునీత లేఖ
రూ.కోట్ల మనీ ట్రయల్‌తోపాటు హత్య వెనుక ఉన్న 'పెద్ద కుట్ర' కోణాన్ని వెలికితీయాలని కోరుతూ రాష్ట్రపతికి సునీత లేఖ
-
Aug 08, 2026 18:16 IST
హైదరాబాద్: ఎల్లంపేట్ పరిధి రావల్‌కోల్‌లోని ఓ ఇంట్లో చోరీ
9 తులాల బంగారం, రూ.2 లక్షల అపహరణ
-
Aug 08, 2026 18:15 IST
హైదరాబాద్: రేపు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు
5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
భక్తుల కోసం 6, బోనం తీసుకొచ్చేవారికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్
-
Aug 08, 2026 18:06 IST
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన
7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు
దరఖాస్తులకు ఎల్లుండి వరకు గడువు
ఈనెల 20 తర్వాత లాటరీ ద్వారా కేటాయింపు
ఇల్లు రాకపోతే రూ.10 వేల డిపాజిట్ రిటర్న్
-
Aug 08, 2026 16:41 IST
అమరావతి: వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌కు బోండా ఉమ లీగల్ నోటీసులు
బోండా ఉమపై వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు
తన పరువుకు భంగం కలిగించారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్‌పై రూ.5 కోట్లకు బోండా ఉమ పరువు నష్టం దావా
-
Aug 08, 2026 16:31 IST
హైదరాబాద్: రాజస్థాన్-హైదరాబాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు
తెలంగాణ EAGLE ఫోర్స్ భారీ ఆపరేషన్
రెండు వేర్వేరు కేసుల్లో 7 మంది నిందితుల అరెస్ట్
1.031 కిలోల నల్లమందు (ఓపియం) స్వాధీనం
మరో 25 గ్రాముల మెఫెడ్రోన్ (MD) సీజ్
-
Aug 08, 2026 16:24 IST
ఢిల్లీ: శిరోమణి అకాలీదళ్(SAD) పార్టీ కీలక నిర్ణయం
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు
50% సీట్ల పెంపు ప్రతిపాదనను సమర్థించిన శిరోమణి అకాలీదళ్
-
Aug 08, 2026 16:22 IST
IRE VS AFG: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్లు తీసిన రషీద్
వన్డేలో మూడు సార్లు ఆరు వికెట్లు తీసిన రషీద్
ప్రపంచంలోనే తొలి స్పిన్నర్‌గా రషీద్ రికార్డ్
-
Aug 08, 2026 15:44 IST
హైదరాబాద్: గాంధీ భవన్ ముందు నిరుద్యోగుల ఆందోళన
యూనిఫామ్ సర్వీసులకు వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్
యూనిఫామ్ సర్వీస్ నియామకాల వయోపరిమితి మరో 4 ఏళ్లు పెంచాలని విజ్ఞప్తి
-
Aug 08, 2026 15:43 IST
కొరియా మాస్టర్స్ 300లో ఫైనల్ చేరిన అస్మిత చాలిహా
సెమీస్‌లో మరో భారత షట్లర్ రక్షిత రామరాజ్‌పై 21-13, 16-21, 21-13 సెట్ల తేడాతో అస్మిత చాలిహా గెలుపు
తన తొలి BWF వరల్డ్ టూర్ టోర్నీలోనే ఫైనల్ చేరిన అస్మిత
-
Aug 08, 2026 15:41 IST
శ్రీకాకుళం: మహిళా ఎస్ఐపై దాడి కేసులో అరెస్టుల పర్వం
ఆమదాలవలస వైసీపీ నాయకులపై కేసు నమోదు
వైసీపీ నేత బొడ్డెపల్లి రమేష్, చింతాడ గోదాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వీరిద్దరితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు, అరెస్ట్
మరికాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం
వైసీపీ ఇంచార్జి చింతాడ రవికుమార్ కోసం గాలిస్తున్న పోలీసులు
-
Aug 08, 2026 15:31 IST
నటుడు మోహన్‌లాల్‌కు ఆస్ట్రేలియా వీసా తిరస్కరణ
వీసా తిరస్కరణతో సిడ్నీలో మోహన్‌లాల్ లైవ్ షో వాయిదా
-
Aug 08, 2026 15:17 IST
హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు
సూసైడ్ నోట్, ఐఫోన్‌ను ఉదయ్ మాయం చేసినట్లు గుర్తింపు
అన్ని ఆధారాలు ఐఫోన్‌లో ఉన్నట్లు ఉదయ్ సూసైడ్ నోట్
తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాసినట్లు కస్టడీలో ఉదయ్ వెల్లడి
సూసైడ్ నోట్ ఎక్కడ ఉందో తెలియదన్న ఉదయ్ కృష్ణారెడ్డి
సూసైడ్ నోట్ వివరాలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ఉదయ్
-
Aug 08, 2026 15:05 IST
గాంధీభవన్: కాసేపట్లో TPCC క్రమశిక్షణ కమిటీ భేటీ
కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం
-
Aug 08, 2026 15:00 IST
హైదరాబాద్: రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో యువతులు పడొద్దు: సీపీ సజ్జనార్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం: సీపీ సజ్జనార్
AIతో రూపొందించిన యువకుల ఫేక్ ప్రొఫైల్స్‌తో మోసాలు: సజ్జనార్
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్ చేయొద్దు: సజ్జనార్
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
-
Aug 08, 2026 14:45 IST
నల్లగొండ మండలం చందనపల్లిలో పులి పిల్లల కలకలం
చందనపల్లి శివారు డంపింగ్ యార్డులో పులి పిల్లల సంచారం
-
Aug 08, 2026 14:43 IST
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం
స్టాల్స్‌ను చూసేందుకు వెళ్లిన సమయంలో మంత్రి దుర్గేశ్, జనసేన నేత శ్రీనివాస్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే రఘురామ గన్‌మెన్
మంత్రి దుర్గేష్, బోనబోయిన శ్రీనివాస్‌ను నెట్టివేయడంతో RRR గన్‌మెన్‌తో జనసేన కార్యకర్తల వాగ్వాదం
-
Aug 08, 2026 14:36 IST
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ ఆర్థిక సాయం
పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్లు అందజేత
ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి
సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు కోటి రూపాయల చొప్పున సాయం
-
Aug 08, 2026 14:33 IST
జార్ఖండ్‌లో 15వ రోజు విద్యార్థుల నిరాహార దీక్ష
ప్రభుత్వ ప్రతినిధులతో ముగిసిన రెండో విడత చర్చలు
విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా జరిగాయన్న విద్యార్థుల బృందం
-
Aug 08, 2026 14:18 IST
ప.గో.: నిరుద్యోగుల పేరుతో ఆందోళనలు రాజకీయ డ్రామా: నిమ్మల
నిరుద్యోగుల పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు
వైసీపీ హయాంలో DSC ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలి: మంత్రి నిమ్మల
ఉద్యోగాలపై రాజకీయాలు చేసే గొడ్డలి పార్టీని నిరుద్యోగులు నిలదీయాలి: మంత్రి నిమ్మల
2 లక్షలకు పైగా టీచర్ల పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుది: మంత్రి నిమ్మల
-
Aug 08, 2026 14:16 IST
వరంగల్: పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ ఆర్థిక సాయం
పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల అందజేత
ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి
సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు రూ.కోటి చొప్పున సాయం
-
Aug 08, 2026 13:58 IST
జార్ఖండ్‌లో 15వ రోజు విద్యార్థుల నిరాహార దీక్ష
ప్రభుత్వ ప్రతినిధులతో ముగిసిన రెండో విడత చర్చలు
విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా జరిగాయన్న విద్యార్థుల బృందం
-
Aug 08, 2026 13:58 IST
నల్లగొండ: ఏఎస్‌ఐని బైక్‌తో ఢీకొట్టిన మైనర్
టూటౌన్ పీఎస్ పరిధిలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్
ఆపేందుకు యత్నించిన ఏఎస్ఐని బైక్‌తో ఢీకొట్టిన మైనర్
బాలుడు అశ్విత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మైనర్‌కు బైక్ ఇచ్చిన తండ్రిపై కేసు నమోదు
-
Aug 08, 2026 13:31 IST
అమరావతి: చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించం: సీఎం చంద్రబాబు
ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా నిరసనలు చేస్తే ఊరుకోం: సీఎం చంద్రబాబు
గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్‌లు తప్ప..ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా?
కర్నూలులో కదం తొక్కినవారంతా మెగా DSC ద్వారా ఎంపికైన టీచర్లే: సీఎం చంద్రబాబు
గొడ్డలి పార్టీ చేసే నష్టంతో టీచర్లు ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారు: సీఎం చంద్రబాబు
-
Aug 08, 2026 13:05 IST
మహారాష్ట్ర బీడ్‌లో FDA దాడులు
రూ.1.93కోట్ల విలువైన వంటనూనె సీజ్
అక్రమ నిల్వలు, రీ-ప్యాకింగ్ బట్టబయలు
ఒకే నాణ్యత గల నూనెకు వేర్వేరు బాండ్లు
'రిఫైన్డ్', 'అల్ట్రా రిఫైన్డ్' పేర్లతో మోసాలు
తప్పుడు లేబుళ్లతో మార్కెట్‌లో విక్రయాలు
నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల లైసెన్సుల రద్దు
-
Aug 08, 2026 13:05 IST
ఢిల్లీ ఐఐటీలో 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ
విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పత్రాలను పంపిణీ చేసిన ప్రధాని మోదీ
IIT విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది: మోదీ
ఇవాళ్టి నుంచి మీకు కొత్త ప్రయాణం మొదలైంది: మోదీ
మీరు కేవలం డిగ్రీలు మాత్రమే తీసుకోవడం లేదు..
దేశ స్వప్నాన్ని సాకారం చేస్తున్నారు: ప్రధాని మోదీ
మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి: ప్రధాని మోదీ
-
Aug 08, 2026 12:37 IST
కర్నూలు: మెగా డీఎస్సీ 2025 టీచర్ల సంఘీభావ ర్యాలీ
కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకూ ర్యాలీ
థ్యాంక్యూ సీఎం సార్, థ్యాంక్యూ మినిస్టర్ లోకేశ్ అంటూ నినాదాలు
DSCపై YCP తప్పుడు ప్రచారం చేస్తోందంటూ నినాదాలు
ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు చేయొద్దని ప్లకార్డులు
పాల్గొన్న కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు
-
Aug 08, 2026 12:21 IST
నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: ఎక్స్‌లో హరీశ్ రావు
హైడ్రా పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానించారు: హరీశ్ రావు
విద్యార్థులు, నిరుద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?: హరీశ్ రావు
రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్ అయింది: హరీశ్ రావు
-
Aug 08, 2026 12:20 IST
TBA సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు
పృథ్వీశ్వర్‌రెడ్డిపై లైంగిక ఆరోపణల కేసుతో చర్యలు
BFIకి లెటర్ పంపిన అసోసియేషన్
జనరల్ సెక్రటరిగా జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్‌గౌడ్ నియామకం
-
Aug 08, 2026 12:20 IST
పాతబస్తీ అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
GHMC నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పాతబస్తీని పాలకులు విస్మరిస్తున్నారు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అసలైన హైదరాబాద్ పాతబస్తీలోనే ఉంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
Aug 08, 2026 11:32 IST
నల్లగొండ : అనుముల మండల హాలియాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
రైతులకు 24 గంటల నాణ్యతమైన విద్యుత్ అందించాలని డిమాండ్
కాలిపోయిన మోటార్లతో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
యాగాలు, పూజలు వద్దు ... రైతులకు కరెంట్ కావాలంటూ నినాదాలు
-
Aug 08, 2026 11:31 IST
ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కీలక ఆపరేషన్
IAF వింగ్ కమాండర్ అరెస్ట్
హనీట్రాప్‌లో రక్షణశాఖ పత్రాలను లీక్ చేసినట్టు ఆరోపణ
-
Aug 08, 2026 11:30 IST
IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టాల ప్రదానం
సోనిపట్ క్యాంపస్‌లో సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ
-
Aug 08, 2026 11:30 IST
వరంగల్: హసన్‌పర్తి రైల్వేస్టేషన్ దగ్గర పట్టాలపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు
కాజీపేట, వరంగల్-ఢిల్లీ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
మరమ్మతులు చేస్తున్న రైల్వే సిబ్బంది
-
Aug 08, 2026 11:18 IST
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
చంబా దగ్గర లోయలో పడిన బస్సు, ఏడుగురి మృతి
మరో 11 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు
-
Aug 08, 2026 11:17 IST
విశాఖ: DSC నియామకాల్లో అక్రమాలు జరగలేదు: చింతామోహన్
వైసీపీది అనవసరమైన రాద్ధాంతం: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
తప్పులు జరిగితే చూపించండి.. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా: చింతామోహన్
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: చింతామోహన్
ఏపీలో ఉన్న కాపులందరూ కాంగ్రెస్‌లోకి రండి: చింతామోహన్
కాపు నేతను సీఎంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా: చింతామోహన్
-
Aug 08, 2026 11:08 IST
హైదరాబాద్: సరూర్‌నగర్ స్టేడియానికి భారీగా నిరుద్యోగ యువత
హైడ్రా విడుదల చేసిన 150 పోస్టులకు రిక్రూట్‌మెంట్
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి హాజరైన అభ్యర్థులు
ఏర్పాట్లు సరిగా లేవని యువత ఆగ్రహం
ఉదయం నుంచి లైన్‌లో వేచి ఉన్నామని యువత ఆవేదన
-
Aug 08, 2026 11:06 IST
కామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
రాజానగర్, టీచర్స్ కాలనీలను ముంచెత్తిన వరద
సిరిసిల్ల రోడ్డుపై భారీగా వరద ప్రవాహం, రాకపోకలకు ఇబ్బందులు
నీళ్లలో కూర్చొని నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ
అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్
ప్రతి ఏడాదీ వర్షాకాలం ఈ పరిస్థితి తప్పడం లేదని ఆందోళన
-
Aug 08, 2026 10:51 IST
కడప: జమ్మలమడుగులో వైసీపీ నిరసన దీక్షల వద్ద ఉద్రిక్తత
దీక్షా శిబిరం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
దీక్షలకు అనుమతి లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు
నేడు మూడో రోజు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
ఎమ్మెల్సీతో పాటు వైసీపీ నాయకుల అరెస్ట్
-
Aug 08, 2026 10:20 IST
కడప: వివేకా హత్యకేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీత
విచారణ సరిగా చేయకపోవడం వల్లే కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది: వైఎస్ సునీత
6 నెలలుగా జడ్జిమెంట్లు సరిగా లేవని నా అభిప్రాయం: వైఎస్ సునీత
న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే పోరాడుతున్నా: వైఎస్ సునీత
వివేకా హత్య జరిగిందని అందరికంటే ముందు జగన్‌కే తెలుసు: వైఎస్ సునీత
-
Aug 08, 2026 10:15 IST
నెల్లూరు: లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి?: ABNతో మంత్రి నారాయణ
16 వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినందుకా?: మంత్రి నారాయణ
త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం
ఉద్యోగాలు ఇవ్వడాన్ని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి నారాయణ
-
Aug 08, 2026 10:00 IST
శ్రీకాకుళం: వైసీపీ నేత చింతాడ రవికుమార్ కోసం గాలింపు
చింతాడ రవి కోసం గాలిస్తున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
మహిళా SIపై అనుచిత ప్రవర్తన కేసులో ఏ1గా చింతాడ రవి
ఇప్పటికే 21 మందిపై కేసులు.. రాత్రి ముగ్గురి అరెస్ట్
ఘటన జరిగిన నాటి నుంచి అజ్ఞాతంలో వైసీపీ నేత చింతాడ రవి
-
Aug 08, 2026 09:40 IST
గుంటూరు: మెగా DSCపై వైసీపీ నేతలకు MLC ఆలపాటి రాజా సవాల్
DSCపై దుష్ప్రచారం చేసే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్
ఇప్పటికే లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్న ఆలపాటి
ఆలపాటి రాజా సవాల్‌తో అప్రమత్తమైన పోలీసులు
లాడ్జి సెంటర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
-
Aug 08, 2026 09:30 IST
హర్యానాలోని కురుక్షేత్రలో భారీ చోరీ
సీనియర్ న్యాయవాది ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దుండగులు
తుపాకీతో బెదిరించి రూ.3.15కోట్ల విలువైన డబ్బు, నగలు దోపిడీ
గతంలో ఇదే దొంగలు న్యాయవాది ఇంట్లో రూ.50లక్షల చోరీ
-
Aug 08, 2026 09:25 IST
చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం మంగాపురం వద్ద వ్యక్తి హత్య
వాచ్‌మెన్ ఆనంద రావు(50) దారుణ హత్య
కత్తితో గొంతు కోసి హత్య చేసిన దుండగులు.
NRI ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆనందరావు
గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానం
నిందితుల కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
Aug 08, 2026 09:15 IST
కడప: డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డిపై కేసు
మహేశ్వర్‌తో పాటు మరో 8 మందిపై కేసు
నిందితుల్లో వీఆర్వో, సబ్ రిజిస్ట్రార్‌లు
జగన్ ప్రభుత్వ హయాంలో సీకే దిన్నె తహసీల్దార్‌గా పనిచేసిన మహేశ్వర్‌రెడ్డి
ఫేక్ సర్టిఫికెట్లతో రూ.కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టినట్టు ఆరోపణలు
-
Aug 08, 2026 09:00 IST
ప.గో.: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి ఉప్పుటేరుపై ఆక్రమణల తొలగింపు
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారుల చర్యలు
భారీగా మోహరించిన పోలీసులు
జేసీబీల సాయంతో కట్టడాల కూల్చివేత
-
Aug 08, 2026 08:45 IST
మార్కాపురం: కంభంలో తీవ్ర విషాదం
బాబాయ్ మృతి తట్టుకోలేక రైలు కిందపడి యువకుడు బాబు ఆత్మహత్య
కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ బాబాయ్ మణికుమార్ మృతి
మనస్తాపంతో యువకుడు బాబు ఆత్మహత్య
-
Aug 08, 2026 08:30 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
ఉదయం 10:30కు 'పార్టనర్స్ ఇన్ సక్సెస్' అంశంపై సమీక్ష
ఉదయం 11:40కి టీడీపీ ఆఫీసుకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం 3:20కి తాడేపల్లిలో నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పరామర్శించనున్న సీఎం
సాయంత్రం 4 గంటలకు జలధార కార్యక్రమంపై అధికారులతో వర్చువల్‌గా సమీక్ష
-
Aug 08, 2026 08:25 IST
హైదరాబాద్: గచ్చిబౌలి ORR సర్వీస్ రోడ్డుపై ప్రమాదం
పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు కార్మికుల మృతి
మృతులు రాజస్థాన్ వాసులు కనేయలాల్(25), దేరమ్(24)గా గుర్తింపు
ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వెళ్తుండగా ప్రమాదం
-
Aug 08, 2026 08:20 IST
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం
దేవప్రయాగ్ దగ్గర లోయలో పడిన వాహనం
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు హరిద్వార్ వాసులుగా గుర్తింపు
ప్రమాదపై ఉత్తరాఖండ్ సీఎం ధామీ తీవ్ర దిగ్భ్రాంతి
-
Aug 08, 2026 08:18 IST
అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా కుతంత్రాలకు భారత్ చెక్
సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో 27 ప్రాంతాల గుర్తింపు
తమ సొంత పేర్లు పెడుతూ చైనా కవ్వింపు చర్యలు
కల్పిత పేర్లకు బదులుగా అసలైన పేర్లతో మ్యాప్‌లో మార్కింగ్
కచ్చిత గుర్తింపు కోసమే మ్యాప్‌లో పొందుపరిచినట్టు కేంద్రం ప్రకటన
అరుణాచల్ ఎప్పటికీ భారత్‌దేనని తేల్చిచెప్పిన కేంద్రం
-
Aug 08, 2026 08:15 IST
కెన్యాలోని అంబోసెలి జాతీయ పార్క్‌లో విషాదం
అనుమానాస్పద స్థితిలో 15 ఏనుగుల మృతి
సైనైడ్ ప్రయోగామే కారణమని కెన్యా అధికారుల నిర్ధారణ
-
Aug 08, 2026 08:13 IST
రష్యాపై కఠిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
15శాతం కంటే తక్కువ కొంటే టారిఫ్‌ల నుంచి మినాహయింపు
భారత్, చైనా, అజర్‌బైజాన్, హంగేరి, స్లోవేకియాపై తీవ్ర ప్రభావం
-
Aug 08, 2026 08:10 IST
శ్రీశైలం మల్లన్న ఆలయంలో రెండోరోజు వరుణయాగం
వరుణయాగంతో పాటూ సహస్రఘటాభిషేకం పూజలు
ఈనెల 11 వరకూ పలు హోమాలు, ఆర్జిత సేవల నిలిపివేత
మూడు రోజుల పాటు స్పర్శ దర్శనాల నిలిపివేత
11న రాత్రి మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి
-
Aug 08, 2026 08:05 IST
నేడు, రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన
సాయంత్రం మామునూరు బెటాలియన్‌ను సందర్శించనున్న డీజీపీ
రేపు వరంగల్ కమిషనరేట్‌లో అధికారులతో డీజీపీ సమీక్ష
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్న డీజీపీ
-
Aug 08, 2026 08:00 IST
హైదరాబాద్: కొండపల్లి గణేష్‌పై లుకౌట్ నోటీసులు
రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో లాభాల ఆశ చూపి మోసం
గతంలో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
గణేష్ దేశం విడిచి పారిపోకుండా నోటీసుల జారీ
గణేష్ బ్యాంక్ అకౌంట్స్, బాధితుల డబ్బు మళ్లింపుపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
-
Aug 08, 2026 07:59 IST
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షం
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 10.5, కడ్పల్‌లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
మెదక్ జిల్లా మిన్‌పూర్‌లో 8.8, దామరంచలో 7.1 సెంటీమీటర్ల వర్షం
-
Aug 08, 2026 07:42 IST
రష్యా చమురు కొంటే సుంకాలు.. బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం
86-11 మెజారిటీతో బిల్లును ఆమోదించిన సెనేట్
బిల్లు రూపకల్పనలో దివంగత సెనేట్ గ్రాహమ్ కృషి
-
Aug 08, 2026 06:45 IST
విశాఖ: ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాల పిలుపు
జీవో 3 పునరుద్ధరణ, 1/70 చట్టం అమలుకు డిమాండ్
-
Aug 08, 2026 06:40 IST
అమరావతి: ఉదయం11 గంటలకు టీడీపీ ఆఫీసుకు సీఎం చంద్రబాబు
సాయంత్రం 5గంటల వరకూ పార్టీ నేతలతో భేటీకానున్న చంద్రబాబు
-
Aug 08, 2026 06:35 IST
ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు: IMD
ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం
అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం: IMD
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
Aug 08, 2026 06:30 IST
ఉత్తరప్రదేశ్: నేడు ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ పర్యటన
ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్
-
Aug 08, 2026 06:27 IST
నేడు IIT ఢిల్లీకి ప్రధాని మోదీ
57వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్న మోదీ
సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ
-
Aug 08, 2026 06:25 IST
నేడు నిజామాబాద్, జహీరాబాద్ జనసేన నేతల సమావేశం
జనసేన పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
జీవో 3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల అమలుకు డిమాండ్
-
Aug 08, 2026 06:20 IST
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై నేడు విచారణ
రెండు రోజుల కస్టడీలో నోరుమెదపని ఉదయ్ కృష్ణారెడ్డి
ట్రైనీ IPS ఉదయ్‌ని మరోసారి కస్టడీకి కోరిన పోలీసులు
పోలీసుల పిటిషన్‌పై విచారించనున్న ఉప్పరపల్లి కోర్టు
-
Aug 08, 2026 06:15 IST
చెన్నై: నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ
సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలనూ ఆహ్వానించిన సీఎం విజయ్
డీలిమిటేషన్, రాష్ట్ర సమస్యలపై చర్చించనున్న విజయ్
-
Aug 08, 2026 06:00 IST
సంగారెడ్డి: కోహిర్ మండలం మానాయర్‌పల్లిలో రోడ్డు ప్రమాదం
ఆటో ఢీకొని బైక్‌పై వెళ్తున్న పద్మమ్మ(50), జగన్నాథ్(22) మృతి
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు