Share News

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:12 AM

హిమాచల్‌ప్రదేశ్‌ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా - బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి

సిమ్లా, ఆగస్టు 08: హిమాచల్‌ప్రదేశ్‌ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా - బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులతోపాటు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిస్సాలోని ఆసుపత్రికి తరలించారు.


మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిస్సా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అనుభవ్ శర్మ వెల్లడించారు. బైరాగఢ్ నుంచి చంబా జిల్లా వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 నుంచి 20 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.


మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు కండక్టర్ కూడా మరణించారని పేర్కొన్నారు. ఈ బస్సు ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియలేదని అన్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ చేపట్టామని అనుభవ్ శర్మ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..

డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..

For More National News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 11:41 AM