-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 6th August 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 06 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 06, 2026 21:09 IST
ఢిల్లీ: GMR గ్రూప్ చైర్మన్ GM రావుతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భేటీ
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: ఎంపీ కలిశెట్టి
-
Aug 06, 2026 20:54 IST
రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
TGIIC పిటిషన్‌పై ముగిసిన వాదనలు
తెలంగాణ హైకోర్టు ఆదేశించిన డ్రోన్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే
యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం
తమ వాదనలు వినకుండానే సర్వే ఆదేశాలు ఇచ్చారన్న TGIIC
-
Aug 06, 2026 20:42 IST
ఆయుష్‌కు కేంద్రం ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్
ఆయుష్ బడ్జెట్ రూ.3,500 కోట్లకు పెంపు: సత్యకుమార్
వ్యాధి నివారణే ఆయుష్ లక్ష్యం: మంత్రి సత్యకుమార్
150 ఆయుష్ డిస్పెన్సరీల అప్‌గ్రెడేషన్: సత్యకుమార్
-
Aug 06, 2026 20:29 IST
జాతీయ కమిటీని ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ
CJP జాతీయ కన్వీనర్‌గా అభిజీత్ దీప్కే
కన్వీనర్‌గా సౌరవ్, సహ కన్వీనర్‌గా అశుతోష్
కీలక విభాగాలకు జాతీయ పదాధికారుల నియామకం
నాలుగు జోన్లకు CJP ఇన్‌ఛార్జ్‌ల నియామకం
ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా CJP విస్తరణ
-
Aug 06, 2026 20:16 IST
నంద్యాలలో ACB అధికారుల తనిఖీలు
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు నివాసంలో సోదాలు
భారీగా ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తింపు
రూ.2.89 కోట్ల విలువైన 3 ఇల్లు, 5 ఇళ్ల స్థలాలు, 2 కేజీల వెండి, కారు, 2 బైక్‌లు గుర్తించిన ఏసీబీ
రేపు గోపాలరావు బ్యాంక్ లాకర్లు తెరిచే అవకాశం
-
Aug 06, 2026 19:54 IST
కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో ఓ వృద్ధురాలికి టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు
ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్
వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43 కోట్లు మాయం
గత 2 నెలలుగా ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు
-
Aug 06, 2026 19:52 IST
హైదరాబాద్: గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలపై మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం
ఓటరు నమోదుపై ప్రత్యేక డ్రైవ్: మంత్రి శ్రీధర్‌బాబు
అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే: శ్రీధర్‌బాబు
-
Aug 06, 2026 19:45 IST
AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం కఠిన చర్యలు
ఐటీ నిబంధనల్లో కీలక సవరణలు చేసిన కేంద్రం
AI కంటెంట్‌కు లేబులింగ్ తప్పనిసరి చేసిన కేంద్రం
ట్రేసబుల్ మెటా డేటా తప్పనిసరిగా ఉండాలని నిబంధన
చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపు గడువును 36 గంటల నుంచి 3:00 గంటలకు కుదించిన కేంద్రం
ఫిర్యాదుల పరిష్కారానికి 2 గంటల గడువు కుదింపు
IT, BNS చట్టాల కింద డీప్‌ఫేక్ నేరస్థులపై కఠిన చర్యలు
-
Aug 06, 2026 19:34 IST
రేపు నితిన్ నబీన్‌తో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం
నితిన్ నబీన్‌తో భేటీ కానున్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, ప్రజాప్రతినిధులు
తెలంగాణలో పార్టీ బలోపేతంపై నితిన్ దిశానిర్దేశం
-
Aug 06, 2026 19:28 IST
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్
వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు నేతలు చర్చ
ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపు
పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ-నెతన్యాహు సమీక్ష
-
Aug 06, 2026 19:25 IST
విశాఖ వాసులకు నీటి కష్టాలు
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేత
నీటి సరఫరా తక్కువ ఉండటంతో వాటర్ ట్యాంకర్లకు GVMC టోల్‌ఫ్రీ నంబర్
బుక్ చేసుకున్నవారికి మాత్రమే నీటి సరఫరా
-
Aug 06, 2026 19:15 IST
చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం
ఒడిశా ITR నుంచి అగ్ని-4 క్షిపణి ప్రయోగం
3వేల కి.మీ. పైగా NOTAM ఆంక్షలు విధించిన భారత్
-
Aug 06, 2026 19:10 IST
ఢిల్లీ: Gen Zపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Gen Z దేశ వ్యతిరేకులు కారు.. వారి సమస్యలు, ఆందోళనలు సమర్థనీయమైనవే: మోహన్ భగవత్
ప్రజాస్వామ్యంలో నిరసన అనేది సంభాషణకు, సమస్యల పరిష్కారానికి ఒక మార్గం: మోహన్ భగవత్
-
Aug 06, 2026 18:49 IST
విజయవాడ: దొంగ నోట్లు తయారుచేసే ముఠా అరెస్ట్
రూ.500ల నకిలీ నోట్లు తయారుచేస్తున్న ఏడుగురి అరెస్ట్
నకిలీ నోట్ల తయారీకి వాడిన కలర్ ప్రింటర్, పేపర్, వస్తువులు స్వాధీనం
రూ 68,000 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Aug 06, 2026 18:37 IST
మణికొండ BRS నాయకురాలు రూపా రెడ్డి అరెస్ట్
ఓ టీవీ ఛానల్‌లో లైవ్ నుంచి బయటికి వస్తుండగా మాదాపూర్‌లో అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
పెట్టుబడుల పేరుతో రూపారెడ్డి మోసానికి పాల్పడిందని భాదితులు ఫిర్యాదు
ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద భాదితులు ఆందోళన
-
Aug 06, 2026 18:04 IST
GCCలకు బెస్ట్ డెస్టినేషన్ తెలంగాణ: మంత్రి శ్రీధర్‌బాబు
20 నెలల్లో తెలంగాణకు 150 కొత్త GCCలు: మంత్రి శ్రీధర్‌బాబు
GCCలతో 1.5 లక్షల ఉద్యోగాల కల్పన: మంత్రి శ్రీధర్‌బాబు
జాతీయ GCC లీజింగ్‌లో హైదరాబాద్ వాటా 16 శాతం: శ్రీధర్‌బాబు
-
Aug 06, 2026 17:45 IST
బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం
రేపు, ఎల్లుండి ఏపీలో పలుచోట్ల వర్షాలు
-
Aug 06, 2026 17:29 IST
విశాఖపట్నం: అక్కిరెడ్డిపాలెం వివేకానందకాలనీలో అగ్ని ప్రమాదం
విద్యుత్ వైర్లు తెగిపడటంతో మటన్ షాపు దగ్ధం
-
Aug 06, 2026 17:17 IST
దేశానికే ఆదర్శంగా తెలంగాణలో జొన్న కొనుగోళ్లు: మంత్రి తుమ్మల
1.01 లక్షల మంది జొన్న రైతుల ఖాతాల్లో రూ.994 కోట్ల జమ: తుమ్మల
MSPతో రికార్డు స్థాయిలో జొన్నల కొనుగోళ్లు: మంత్రి తుమ్మల
రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర: మంత్రి తుమ్మల
రైతులకు వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు అందించాలి: మంత్రి తుమ్మల
-
Aug 06, 2026 17:12 IST
ఈ నెల 20న బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు
-
Aug 06, 2026 17:12 IST
బాపట్ల: రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన
కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
-
Aug 06, 2026 17:02 IST
కాంగ్రెస్‌పై MLA కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు
మమ్మల్ని అవమానిస్తే BRSకు పట్టిన గతే పడుతుంది: కూనంనేని
మేము పెద్ద పెద్ద పదవులు అడగడం లేదు: MLA కూనంనేని
స్నేహధర్మాన్ని పాటిస్తున్నాం.. మీరూ పాటించాలి: కూనంనేని
-
Aug 06, 2026 16:48 IST
జగన్ అడుగుపెడితే విధ్వంసం, అరాచకం: హోం మంత్రి అనిత
సామాన్యులు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి: మంత్రి అనిత
పోలీసులు కూడా తమ డ్యూటీ చేసుకోలేకపోతున్నారు: అనిత
అభివృద్ధిని ఓర్వలేక విధ్వంస యాత్రలు చేస్తున్నారు: అనిత
-
Aug 06, 2026 16:31 IST
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై SEC భేటీ
మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో భేటీ
-
Aug 06, 2026 16:25 IST
UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకు ఇచ్చేందుకు ఆమోదం
పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్-2007 చట్టసవరణకు ఆమోదం
చర్చ లేకుండానే UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు ఆమోదం
-
Aug 06, 2026 16:21 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
బయోగ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయం
గోబర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
రూ.23,731 కోట్లతో బయో గ్యాస్ పంపిణీ కోసం పథకం
అస్సాంలో నాలుగు లేన్ల నేషనల్ హైవేకు ఆమోదం
రూ.8,970 కోట్లతో అస్సాంలో నేషనల్ హైవే నిర్మాణం
-
Aug 06, 2026 16:09 IST
అమరావతి: ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాలు APIICకి బదిలీకి గ్రీన్ సిగ్నల్
తిమ్మసముద్రంలో 13.45 ఎకరాలు CUDAకు బదిలీకి ఆమోదం
కొత్త జిల్లాలకు అనుగుణంగా UDAల పునర్వ్యవస్థీకరణ
రాష్ట్రంలో UDAల సంఖ్య 21 నుంచి 23కు పెంపు: మంత్రి పార్థసారథి
కండలేరు నుంచి పరిశ్రమల క్లస్టర్‌కు నీటి సరఫరాకు ఆమోదం
విజయవాడ ఆటోనగర్ కాలనీవాసులకు UDS హక్కుల క్రమబద్ధీకరణ
-
Aug 06, 2026 16:02 IST
ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ సమావేశానికి అనుమతి రద్దు
విద్యార్థులతో రాహుల్ ఛాత్రోంకి గూంజ్ సమావేశం
సమావేశానికి అనుమతివ్వని కాయస్త పాఠశాల ట్రస్ట్
రాహుల్ సమావేశానికి అనుమతి రద్దుపై ప్రియాంక ఆగ్రహం
రాహుల్‌ను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని విమర్శలు
-
Aug 06, 2026 15:54 IST
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన CJP
సెప్టెంబర్‌లో 'క్యా బోల్తీ పబ్లిక్' కార్యక్రమం
దేశవ్యాప్తంగా సమస్యలు తెలుసుకునేలా కార్యక్రమం
రాంచీ వెళ్లనున్న కాక్రోజ్ జనతా పార్టీ ప్రతినిధులు
-
Aug 06, 2026 15:54 IST
హైదరాబాద్: కాలేజీల నకిలీ ఫైర్ NOCలపై కొనసాగుతున్న విచారణ
మరో 48 కాలేజీల చిట్టాను పోలీసులకు ఇచ్చిన హైడ్రా
ఒకే తరహాలో నకిలీ ఫైర్ NOCలు తయారుచేసినట్టు గుర్తింపు
56 కాలేజీలు నకిలీ NOCలు సమర్పించినట్లు తెలిపిన హైడ్రా
మరో 176 కాలేజీలపై విచారణ జరుపుతున్న హైడ్రా
-
Aug 06, 2026 15:53 IST
క్షుద్ర పూజలు చేశానంటూ నాపై నిందలు వేశారు: హరీశ్రావు
క్షుద్ర పూజలు చేశానన్న అందరిపైనా క్రిమినల్, పరువునష్టం కేసులు వేస్తా: హరీశ్‌రావు
బట్ట కాల్చి మీదవేస్తే వదిలేదు లేదు: హరీశ్‌రావు
రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే ఇలాంటి ఆరోపణలు: హరీశ్‌రావు
-
Aug 06, 2026 15:48 IST
ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
-
Aug 06, 2026 15:47 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
374 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
11 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Aug 06, 2026 15:47 IST
కోర్టులు చీవాట్లు పెట్టినా వైసీపీ బుద్ధి మారలేదు: సీఎం చంద్రబాబు
డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని అసూయతోనే వైసీపీ కుట్రలు: చంద్రబాబు
హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: చంద్రబాబు
దుబాయ్ 'ఐ వీల్' కంటే అమరావతి 'ఐ వీల్' పెద్దదిగా ఉండాలి: చంద్రబాబు
ఈనెల 13న సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం: సీఎం చంద్రబాబు
-
Aug 06, 2026 15:46 IST
సంగారెడ్డి: కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
పట్టుబడిన బియ్యాన్ని దిగ్వాల్‌లోని పౌరసరఫరాల గోదాంకు తరలింపు
-
Aug 06, 2026 15:45 IST
జగిత్యాలలో బాలిక మిస్సింగ్ కలకలం
కండ్లపల్లి మోడల్ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని షేక్ అస్త అదృశ్యం
బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థిని
బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్
స్కూల్‌లోనే డ్రెస్ మార్చుకుని వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో గుర్తింపు
-
Aug 06, 2026 15:42 IST
చెన్నై: మసీదు కమిటీ ఫత్వాపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
కేవలం మసీదు కమిటీ 'ఫత్వా' ఆధారంగా విడాకులు పొందలేరు: హైకోర్టు
మతపరమైన సంస్థలు లేదా సెమినరీలకు విడాకులిచ్చే అధికారం లేదు: హైకోర్టు
రాజ్యాంగబద్ధ ఫ్యామిలీ కోర్టుల ద్వారానే విడాకులు సాధ్యం: హైకోర్టు
-
Aug 06, 2026 15:38 IST
ఖమ్మం జిల్లా గోపాలపురం పాఠశాలకు అండగా సీఎం రేవంత్‌రెడ్డి
పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షల మంజూరు
తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు
పాఠశాలను సందర్శించిన ఖమ్మం కలెక్టర్ దివాకర్
-
Aug 06, 2026 15:31 IST
ఏపీ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం-2026కు ఆమోదం
ఏపీ PPP పాలసీ-2026 ముసాయిదాకు ఆమోదం
దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024 ఉపసంహరించి కొత్త చట్టాలకు మంత్రివర్గం ఆమోదం
మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం
-
Aug 06, 2026 15:20 IST
లండన్: ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్ పూర్వ విద్యార్థినిల సంచలన ఆరోపణలు
తమపై అత్యాచారం జరిగిందని ఆరోపించిన యువతులు
లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపణ
-
Aug 06, 2026 15:12 IST
విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రసక్తే లేదు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఇథనాల్ వేరు.. 'సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్' (SAF) వేరు: రామ్మోహన్
విమాన ప్రయాణికుల భద్రతే మా ప్రాధాన్యం: కేంద్రమంత్రి రామ్మోహన్
-
Aug 06, 2026 15:12 IST
నంద్యాల: తాలూకా పీఎస్ పరిధిలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
కర్ణాటకకు చెందిన అంతరాష్ట్ర దొంగ జాఫర్ అలీని అరెస్ట్ చేసిన ప్రత్యేక పోలీస్ బృందం
నిందితుడి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
-
Aug 06, 2026 15:11 IST
ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి అంటూ ప్రచారం
ఆ వదంతులను నమ్మవద్దన్న మెగాస్టార్ టీమ్
ధ్రువీకరించని తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దని మెగాస్టార్ టీమ్ విజ్ఞప్తి
-
Aug 06, 2026 15:06 IST
‘రామాయణ’ ఇంగ్లీష్ ట్రైలర్ విడుదల
‘బ్రహ్మ ఏఐ’తో లిప్ సింక్ టెక్నాలజీ
ఇంగ్లీష్ డైలాగులకు నెటిజన్ల ప్రశంసలు
ఏఐ టెక్నాలజీతో కొత్త ప్రయోగం
ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
-
Aug 06, 2026 15:04 IST
జగన్, వైసీపీ నేతల అరాచకాలను నియంత్రించేందుకు 2 నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
వాళ్లంతా రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు: సీఎం చంద్రబాబు
DSCపై వారి దుష్ప్రచారాన్ని అందరూ గమనిస్తున్నారు: చంద్రబాబు
DSCపై అన్ని విషయాలు ప్రజలకు వివరించాం: చంద్రబాబు
కోర్టులకు వెళ్లిన వైసీపీకి చీవాట్లు తప్పలేదు: చంద్రబాబు
ఇంత జరిగినా వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు
-
Aug 06, 2026 14:52 IST
తెహల్కా వ్యవస్థాపకుడు తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలుశిక్ష
రెండు వారాల్లో లొంగిపోవాలంటూ బాంబే హైకోర్టు ఆదేశం
అత్యాచారం కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన కోర్టు
తరుణ్ తేజ్‌పాల్‌పై 2013లో అత్యాచారం కేసు
-
Aug 06, 2026 14:32 IST
ఢిల్లీలో ఉదయం నుంచి భారీ వర్షాలు
భారీ వర్షాలకు నేలకొరుగుతున్న వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం వద్ద నేలకొరిగిన భారీ వృక్షం
ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టిన ఎన్‌డీఎంసీ సిబ్బంది
-
Aug 06, 2026 14:28 IST
అమరావతి: చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం
‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిధులు విడుదల చేయనున్న సీఎం
రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి
-
Aug 06, 2026 14:27 IST
NEETలో ఆన్‌లైన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
NEET పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు కేంద్రం చర్యలు
పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి
ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షపై కసరత్తు
JEE తరహాలో NEET నిర్వహణకు కేంద్రం చర్యలు
కేంద్రం అఫిడవిట్‌పై పిటిషనర్ల సమాధానాలు కోరిన సుప్రీంకోర్టు
తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా
-
Aug 06, 2026 14:24 IST
లోక్‌సభ రేపటికి వాయిదా
విపక్షాల నినాదాలతో సభ రేపటికి వాయిదా
రాజ్యసభ మ.2:45 గంటలకు వాయిదా
-
Aug 06, 2026 13:57 IST
అమరావతి: ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
మోడల్ స్కూల్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ మోడల్ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికీ ఉత్తర్వులు వర్తింపు
అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు
-
Aug 06, 2026 12:53 IST
DSCపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోంది: ఎమ్మెల్యే బొండా ఉమా
18 వేల మంది జీవితాలను జగన్ నాశనం చేయాలని చూస్తున్నారు: బొండా ఉమా
DSCపై చర్చకు రావాలని లోకేష్ సవాల్ విసిరారు: బొండా ఉమా
DSCపై చర్చించే ధైర్యం జగన్, వైసీపీ నాయకులకు లేదు: బొండా ఉమా
లోకేష్‌ను నోటికొచ్చినట్లు తిడితే చూస్తూ ఊరుకోవాలా?: ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు
-
Aug 06, 2026 12:46 IST
గుంటూరు: అరండల్ పేట పీఎస్‍లో అంబటిపై కేసు నమోదు
కేంద్ర మంత్రి పెమ్మసానిపై అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు
రాజకీయ విద్వేషాలు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్ట్ చేశారని ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు
-
Aug 06, 2026 12:34 IST
విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయసభల వాయిదా
లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2:15 వరకూ వాయిదా
-
Aug 06, 2026 12:31 IST
రాజ్యసభలో గందరగోళం
విద్యార్థుల మీద లాఠీచార్జ్ ఘటనపై కేంద్రం వర్సెస్ విపక్షాలు
అమిత్‌షా సభకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్
సభను ఎలా నడపాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదన్న కిరణ్ రిజిజు
మోదీ, అమిత్‌షా సభకు ఎందుకు రావడం లేదని నిలదీసిన ఖర్గే
-
Aug 06, 2026 12:23 IST
హైదరాబాద్: పదవుల భర్తీపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదు: ABNతో కోదండరాం
మాకు MLC, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని చెప్పారు: కోదండరాం
పదవుల భర్తీ ఆలస్యంతో ప్రయోజనం శూన్యం: ABNతో కోదండరాం
ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి ప్రభుత్వంతో చర్చిస్తున్నాం: కోదండరాం
-
Aug 06, 2026 12:02 IST
అరుణాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు
అరుణాచల్‌లో 24 గంటల్లో నాలుగు భూకంపాలు
అప్పర్ సియాంగ్‌ను వణికించిన ప్రకంపనలు
అస్సాంలోనూ భూ ప్రకంపనలు
5.1 తీవ్రతతో తొలి భూకంపం నమోదు
ఈశాన్య భారతంలో వరుస భూకంపాలు
-
Aug 06, 2026 11:33 IST
విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉద్రిక్తత
DSCలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే నిరాహారదీక్షలు
వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం
పరిస్థితిని అదుపు చేస్తున్న పోలీసులు
-
Aug 06, 2026 11:32 IST
హైదరాబాద్: బోనాల వేడుకల్లో ఆకతాయిలకు షీటీమ్స్ కళ్లెం
మహిళలను వేధించిన 678 మందిని గుర్తించిన షీటీమ్స్
వీడియో ఆధారాలతో నిందితులను పట్టుకున్న షీటీమ్స్
25 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధించిన కోర్టు
11 మందికి 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,050 జరిమానా
26 మందికి రూ.1,050 చొప్పున జరిమానాతో పాటు సామాజిక సేవకు ఆదేశం
-
Aug 06, 2026 11:28 IST
అమరావతి: ఏపీ హస్తకళలకు సాంకేతిక వెలుగులు
డిప్యూటీ సీఎం పవన్ సూచనతో హస్తకళలకు క్యూఆర్ కోడ్ విధానం
దేశంలో తొలిసారిగా హస్తకళలకు క్యూఆర్ కోడ్ అమలు
లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థ ప్రారంభం
మొదటి దశలో 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్
-
Aug 06, 2026 11:20 IST
ఢిల్లీ: రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా
విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా
-
Aug 06, 2026 11:10 IST
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ తేజ్‌పాల్‌కు దక్కని ఊరట
అత్యాచారం కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు
సెషన్స్ కోర్టు తీర్పును కొట్టివేసిన బాంబే హైకోర్టు గోవా బెంచ్
గోవాలో తన జూనియర్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు
-
Aug 06, 2026 11:08 IST
కామారెడ్డి: దోమకొండ మండలం అంచనూరులో విషాద ఘటన
భార్య మృతి తట్టుకోలేక మనస్తాపంతో ఉరేసుకుని భర్త సందీప్(26) ఆత్మహత్య
కుటుంబ కలహాలతో గత నెలలో భార్య మౌనిక ఆత్మహత్య
-
Aug 06, 2026 11:07 IST
నిజామాబాద్: సిరికొండ మండలం కొండాపూర్ చెరువుకు గండి
తెగిన చెరువు కట్ట, నీటమునిగిన పంట పొలాలు
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Aug 06, 2026 11:07 IST
తెలంగాణలో ఆగస్ట్ 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ
సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
1.05కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ
అదేరోజు 119 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్యక్రమాలు
అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డు అందిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
Aug 06, 2026 11:06 IST
హైదరాబాద్: ఆయిల్ పామ్ సాగుపై మంత్రి తుమ్మల సమీక్ష
లక్ష్యాల సాధనపై అధికారులకు మంత్రి ఆదేశాలు
జిల్లాలవారీ ఆయిల్ పామ్ పురోగతిపై నివేదిక
భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చ
-
Aug 06, 2026 11:05 IST
తమిళనాడులో మళ్లీ మొదలైన రాష్ట్ర గీతం వివాదం
రాజ్‌భవన్ ప్రోటోకాల్‌పై గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖ
యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో 'తమిళ్ తాయ్ వాళ్తు' 3వ స్థానంలో ఆలపించడంపై అభ్యంతరం
-
Aug 06, 2026 11:05 IST
ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 వరకూ వాయిదా
విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా
-
Aug 06, 2026 11:05 IST
విదేశీ నిధుల చట్టంపై శశిథరూర్ విమర్శలు
కొత్త చట్టంతో భారతీయులకే నష్టం: శశిథరూర్
కేంద్ర ప్రతిపాదనపై శశి థరూర్ ఆందోళన
పౌర సమాజంపై ప్రభావమంటూ థరూర్ వ్యాఖ్యలు
విదేశీ నిధుల బిల్లును తప్పుబట్టిన థరూర్
కేంద్ర విధానంపై శశి థరూర్ విమర్శలు
-
Aug 06, 2026 11:04 IST
ఢిల్లీలో భారీ వర్షం
8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వర్షానికి జలమయమైన రోడ్లు
-
Aug 06, 2026 10:34 IST
తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ మంత్రి
వ్యవసాయ మంత్రి వినోద్‌పై స్పీకర్ ప్రభాకర్ అసహనం
బడ్జెట్ ప్రసంగంలో సీఎం విజయ్‌ని పొగిడిన మంత్రి
మంత్రి వినోద్ తీరుపై డీఎంకే సభ్యుల ఆందోళన
మంత్రి వినోద్‌పై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్
వ్యవసాయ బడ్జెట్‌ను మాత్రమే ప్రస్తావించాలని ఆదేశం
-
Aug 06, 2026 10:34 IST
మెటా సంస్థపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
భారత్‌లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారని ప్రశ్న
మెటా అధికారులను ప్రశ్నిస్తే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదు: అరవింద్ కేజ్రీవాల్
ఈ-మెయిల్ పంపినా స్పందన లేదు: అరవింద్ కేజ్రీవాల్
ప్రధాని మోదీ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు: అరవింద్ కేజ్రీవాల్
-
Aug 06, 2026 10:20 IST
హైదరాబాద్: తెలంగాణ కోసమే జయశంకర్ జీవితం సాగింది: కేటీఆర్
తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ దిక్సూచిలా నిలిచారు
జయశంకర్ సేవలను గుర్తిస్తూ వ్యవసాయ యూనివర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు పేరు పెట్టి గౌరవించాం: కేటీఆర్
-
Aug 06, 2026 10:17 IST
హైదరాబాద్: భవిష్యత్ తరాలకు జయశంకర్ స్ఫూర్తి: హరీశ్ రావు
జీవితాంతం తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమించారు: హరీశ్ రావు
పాఠ్యపుస్తకాల్లో జయశంకర్ విశేషాలను చేర్చిన ఘనత కేసీఆర్‌దే: హరీశ్ రావు
జయశంకర్ ఆశయాల సాధనే.. నిజమైన నివాళి: హరీశ్ రావు
-
Aug 06, 2026 10:14 IST
నైనీ బొగ్గు రాకపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం
ఇది చారిత్రాత్మక ఘట్టం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
విద్యుత్ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: భట్టి
సింగరేణికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది: భట్టి
దేశ అవసరాలకూ సింగరేణి బొగ్గు కీలకం: భట్టి
కొత్త కోల్ బ్లాకుల కోసం ప్రయత్నాలు కొనసాగుతాయి: భట్టి
సింగరేణిని కాపాడుకుంటాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
-
Aug 06, 2026 09:59 IST
ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం
జీలుగుమల్లి మండలం జిల్లెళ్ల గూడెం, అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల హెచ్చరికలు
ఈ రాత్రికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్న అధికారులు
-
Aug 06, 2026 09:57 IST
సంగారెడ్డి జిల్లా: అమీన్ పూర్ బీరంగూడలో కారు బీభత్సం
అదుపుతప్పి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
దెబ్బతిన్న మూడు స్కూటీలు, ఒక బైక్, ఇన్నోవా వాహనం
జనాలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణం
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న అమీన్ పూర్ పోలీసులు
-
Aug 06, 2026 09:54 IST
ఆయుధ కొరతపై రక్షణ మంత్రి హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం
క్యాంప్‌డేవిడ్‌లో రక్షణ మంత్రిపై ట్రంప్ అసహనం
కొరతకు తన కింది సిబ్బంది కారణమంటూ హెగ్సెత్ వివరణ
ట్రంప్ ఆగ్రహం కథనాలను ఖండించిన పెంటగాన్
అమెరికా మీడియాలో కథనాల కలకలం
ఆయుధ కొరతపై వైట్‌హౌస్‌లో చర్చలు
-
Aug 06, 2026 09:51 IST
కడప: స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు జాతీయ స్థాయి గుర్తింపు
కడప జిల్లాలో ప్రత్యేకంగా అమలవుతోన్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ
స్మార్ట్ కిచెన్ పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోన్న కడప కలెక్టర్
కలెక్టర్ శ్రీధర్‌కు అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు
-
Aug 06, 2026 09:50 IST
పంజాబ్: మోసం కేసులో నటుడు సల్మాన్‌ఖాన్, అతడి సోదరికి కోర్టు నోటీసులు
అక్టోబర్ 5న విచారణకు హాజరుకావాలంటూ చండీగఢ్ కోర్టు ఆదేశాలు
-
Aug 06, 2026 09:49 IST
జర్మనీ ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి డ్రోన్ కలకలం
ఉక్రెయిన్ విమానం సమీపంలో గుర్తించిన అధికారులు
జర్మనీలోని లీప్‌జిగ్ హల్లే ఎయిర్‌పోర్టులో ఘటన
-
Aug 06, 2026 09:48 IST
విశాఖ: భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండిగో సర్వీస్‌లు ప్రారంభం
విమానాల షెడ్యూల్ విడుదల చేసిన ఇండిగో
ప్రయాణికుల కోసం ఈ నెల 17 నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు
తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 10:30 వరకు బస్సు సర్వీసులు
-
Aug 06, 2026 09:45 IST
కృష్ణా జిల్లాలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
తెల్లవారుజామున పురుగులమందు తాగిన ముగ్గురు కుటుంబసభ్యులు
వీరవల్లి సహకార సంఘం కార్యదర్శి హేమ, భర్త, కుమారుడి ఆత్మహత్యాయత్నం
అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించిన బంధువులు
-
Aug 06, 2026 09:44 IST
మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో :2,42,646 క్యూసెక్కులు.. 29 గేట్లు ఓపెన్
ఔట్ ఫ్లో: 2,40,319 క్యూసెక్కులు
-
Aug 06, 2026 09:43 IST
యూపీలో ఘోర ప్రమాదం
ప్రతాప్‌గఢ్‌లో కుప్పకూలిన పురాతన భవనం
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
-
Aug 06, 2026 09:36 IST
తెలంగాణలో మోస్తరు వర్షాలు
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్ష సూచన
భద్రాద్రి, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి వర్షం
ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
-
Aug 06, 2026 09:23 IST
మంచిర్యాల: అందుబాటులోకి ఒడిశాలోని నైని బ్లాక్ బొగ్గు
జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్‌కు బొగ్గుతో వచ్చిన తొలి గూడ్స్ రైలు
ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికిన సింగరేణి అధికారులు
-
Aug 06, 2026 09:09 IST
నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక భేటీ
సాయంత్రం 4 గంటలకు మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సమావేశం
రాజేంద్రనగర్లోని ఓ పంక్షన్ హాల్లో జరగనున్న సమావేశం
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల MLC ఎన్నికలపై చర్చ
-
Aug 06, 2026 09:03 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం 12:30 గంటలకు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై సీఎం సమీక్ష
-
Aug 06, 2026 08:55 IST
కర్నూలు బస్సు ప్రమాదంపై NHRC నోటీసులు
కర్నూలు జిల్లా ఎస్పీకి నోటీసు జారీ చేసిన NHRC
24-10-2025న బస్సు ప్రమాదంలో 24 మందికిపైగా సజీవదహనం
సమగ్ర విచారణ జరిపి 4వారాల్లో రిపోర్టును సమర్పించాలని NHRC ఆదేశం
NHRCకి ఫిర్యాదు చేసిన తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి
-
Aug 06, 2026 08:21 IST
నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ మండలం సోమశిలలో నైట్ వాచ్‌మన్‌లపై టూరిస్టుల దాడి
ఇద్దరికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
పరారీలో టూరిస్టులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 06, 2026 07:39 IST
ఏలూరు: YCP మాజీ MLA షేక్ మహమ్మద్ ముస్తఫాకు రిమాండ్
14 రోజుల రిమాండ్ విధించిన నూజివీడు కోర్టు
పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో A2 షేక్ మహమ్మద్ ముస్తఫా
గుజరాత్‌లో అరెస్ట్ చేసి అర్ధరాత్రి నూజివీడు పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు
వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ముస్తఫాకు ఈ నెల 19 వరకు రిమాండ్ విధించిన కోర్టు
-
Aug 06, 2026 07:31 IST
కర్నూలు: మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా 350 క్యూసెక్కుల విడుదల
నేడు పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
తాగునీటికే ప్రాధాన్యం అంటున్న ఇంజినీర్లు
-
Aug 06, 2026 07:29 IST
ప్రకాశం : కురిచేడు మండలం కల్లూరు పొలాల్లో మహిళ మృతదేహం లభ్యం
మృతురాలు చందవరానికి చెందిన కోటినేని రమణగా గుర్తింపు
మహిళ మృతిపై విచారణ జరుపుతున్న పోలీసులు
-
Aug 06, 2026 07:27 IST
హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ దగ్గర జనసేన విద్యార్థి విభాగం నిరసన
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని జనసేన డిమాండ్
-
Aug 06, 2026 07:26 IST
అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం
కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రాస్పెక్ట్ హిల్ కమ్మూనిటీలో ఘటన
-
Aug 06, 2026 07:25 IST
ఏపీలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై నేడు SEC సమీక్ష
అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచన
-
Aug 06, 2026 07:25 IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ
అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
CRDAకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
-
Aug 06, 2026 07:20 IST
హైదరాబాద్: నేటి నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ
ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించనున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు
నేడు, రేపు కస్టడీకి తీసుకుని విచారించనున్న అధికారులు
రెండు రోజుల కస్టడీకి అనుమతించిన ఉప్పరపల్లి కోర్టు
లైంగిక వేధింపుల కేసులో పూర్తి వివరాలు రాబట్టే అవకాశం
-
Aug 06, 2026 07:18 IST
నంద్యాల: రేపటి నుంచి శ్రీశైలంలో వరుణ యాగం
ఐదు రోజులపాటు సహస్ర ఘటాభిషేకం, పంచాహ్నిక దీక్షలు
వరుణ యాగం సందర్భంగా ఆర్జిత సేవల తాత్కాలిక నిలుపుదల: శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు
-
Aug 06, 2026 07:01 IST
నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
ఉపరితల ఆవర్తనంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
శ్రీకాకుళం, కోనసీమ, తూ.గో., ప.గో.జిల్లాలతో పాటు నెల్లూరు, తిరుపతికి వర్ష సూచన
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశంలో చిరుజల్లులు
-
Aug 06, 2026 06:43 IST
నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
ఉద్యమ స్ఫూర్తికి ప్రొ.జయశంకర్ చిరునామా: సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం శ్రమించారు: రేవంత్
తెలంగాణ సమాజం ఎప్పటికీ ప్రొ.జయశంకర్‌ను గౌరవంగా స్మరించుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
-
Aug 06, 2026 06:43 IST
రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో దారుణం
మెడికల్ విద్యార్థిని కారుతో ఢీకొట్టిన యువకులు
విద్యార్థిని పరిస్థితి విషమం.. రాజమండ్రి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స
ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 06, 2026 06:43 IST
నేడు సింగరేణి నైనీ బ్లాక్ నుంచి STPPకి తొలి బొగ్గు లోడ్
నైనీ బొగ్గుతో STPPకి ఇంధన సరఫరా బలోపేతం
తొలి బొగ్గు రైలుకు ఘన స్వాగతం పలకనున్న సింగరేణి
ఉదయం 7 గంటలకు జైపూర్ ప్లాంట్‌కు బొగ్గు రైలు
తప్పనున్న జైపూర్ పవర్ ప్లాంట్ తిప్పలు
-
Aug 06, 2026 06:00 IST
అమరావతి: ఈ నెల 17నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఎన్నిరోజులు నిర్వహించాలనేది BACలో చర్చించి నిర్ణయం
సమావేశాల ప్రారంభంపై నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం