-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 26th July 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 26 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 26, 2026 21:31 IST
కర్నూలు: చాణక్యపురి కాలనీలో కాల్పుల కలకలం
గాలిలోకి కాల్పులు జరిపిన యువకుడు
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
-
Jul 26, 2026 20:39 IST
కామన్వెల్త్ గేమ్స్: మీరాబాయి చానుకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం
48 కిలోల మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చానుకు పసిడి
-
Jul 26, 2026 20:12 IST
IND vs ZIM: క్లీన్‌స్వీప్ చేసిన భారత్
మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం
35 పరుగుల తేడాతో గెలిచిన భారత్
3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
-
Jul 26, 2026 20:10 IST
నిర్మల్: ముథోల్ మండలం గన్మోరాలో పిడుగుపడి మహిళ మృతి
-
Jul 26, 2026 20:08 IST
అమరావతి: అమలాపురం ఆర్డీవోగా ధర్మరాజు పోస్టింగ్‌పై ప్రభుత్వం స్టే
తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు బదిలీ అమల్లో ఉండదని ఉత్తర్వులు
ఈ నెల 21న జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ
-
Jul 26, 2026 19:18 IST
ఢిల్లీ: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ
పరీక్షల సంస్కరణలకు శ్రీకారం: ప్రధాని మోదీ
హైపవర్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం: ప్రధాని
నందన్ నిలేకని నాయకత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: ప్రధాని
పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నియంత్రణే లక్ష్యంగా కేంద్రం సంస్కరణలు: ప్రధాని
సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షల విధానంలో మార్పులు: ప్రధాని
-
Jul 26, 2026 18:34 IST
నంద్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో మహిళను ఢీకొన్న కారు
ప్రమాదంలో సువర్ణ(38) స్పాట్ డెడ్
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 26, 2026 18:32 IST
నల్లగొండ: తుంగతుర్తి నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత
తిరుమలగిరిలో కాంగ్రెస్ నేతల ఘర్షణ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్ వర్గాల మధ్య ఘర్షణ
ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా మంత్రి కోమటిరెడ్డి వర్గం ప్రెస్‌మీట్
ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే సామేల్ వర్గం
రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
-
Jul 26, 2026 18:32 IST
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గర విషాదం
ప్రాజెక్ట్‌లో నలుగురు గల్లంతు, ముగ్గురి మృతదేహాలు లభ్యం
మరొకరికోసం కొనసాగుతున్న గాలింపు
మృతులు నిజామాబాద్ వాసులుగా గుర్తింపు
లక్ష్మీ కాల్వ దగ్గర స్నానానికి దిగి యువకుల గల్లంతు
-
Jul 26, 2026 18:23 IST
భారత్‌తో మూడో టీ20: జింబాబ్వే టార్గెట్ 193
నిర్ణీత 20 ఓవర్లకు భారత్ స్కోర్ 192/5
హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ(81)
-
Jul 26, 2026 17:49 IST
ఏలూరు: సోమవరపాడు నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం
లారీని వెనుక నుండి ఢీకొన్న కారు
ప్రమాదంలో ఒకరి మృతి
-
Jul 26, 2026 17:24 IST
ప్రధాని మోదీతో 'వికసిత్ వైబ్రంట్ విలేజ్' యువత ముఖాముఖి
VVVP-2026లో భాగంగా యువతతో ప్రధాని మాటామంతీ
400 మంది యువ ప్రతినిధులతో ప్రధాని మోదీ ముఖాముఖి
సరిహద్దు గ్రామాల అభివృద్ధి, యువత పాత్రపై మోదీతో చర్చ
-
Jul 26, 2026 16:51 IST
హైదరాబాద్: సినీనటుడు నందమూరి బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణ
ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే

-
Jul 26, 2026 16:44 IST
కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం
భారత్ ఖాతాలో రెండో పతకం
పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో రిషికంఠ సింగ్‌కు రజతం
-
Jul 26, 2026 16:11 IST
జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
తొలుత ఫీల్డింగ్ చేయనున్న జింబాబ్వే
-
Jul 26, 2026 15:59 IST
APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్
షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఇటీవల ఉదర సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న షర్మిల
-
Jul 26, 2026 15:48 IST
నియంతృత్వ పోకడలతో ఏదీ సాధించలేం: అన్నా హజారే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన అన్నా హజారే
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచన
అహింసాయుత పోరాటాలతోనే మార్పు సాధ్యమని అన్నా హజారే స్పష్టం
-
Jul 26, 2026 15:32 IST
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ పరాజయాల తర్వాత రెండో స్థానానికి టీమిండియా
జింబాబ్వేపై ఘన విజయం తర్వాత మళ్లీ అగ్రస్థానంలో భారత్
-
Jul 26, 2026 15:10 IST
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
ఏపీ తీర ప్రాంతాలకు APSDMA హెచ్చరికలు
ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచన
-
Jul 26, 2026 14:44 IST
పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దని పోలీసుల హెచ్చరిక
గత రెండేళ్లలో హైదరాబాద్‌లో 565 సర్వెంట్ థెఫ్ట్ కేసులు నమోదు
యజమానుల అజాగ్రత్తే దొంగతనాలకు ప్రధాన కారణం
పనిమనుషులను నియమించే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి
-
Jul 26, 2026 14:23 IST
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు
కర్తవ్య భవన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
-
Jul 26, 2026 13:56 IST
అమరావతి: గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను అర్థమయ్యేలా చెప్పాలి: సీఎం చంద్రబాబు
యువతను గొడ్డలి పార్టీ ఏ విధంగా మోసం చేసిందో వివరించాలి: సీఎం చంద్రబాబు
డబ్బులతో ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో గొడ్డలి పార్టీ ఉంది: చంద్రబాబు
కేవలం డబ్బులతోనే ప్రజాభిమానాన్ని పొందలేం: సీఎం చంద్రబాబు
ఘోర ఓటమి చెందినా.. ఇప్పటికీ సమాజంలో వైసీపీ చిచ్చు రాజేస్తోంది: సీఎం చంద్రబాబు
గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలి: సీఎం చంద్రబాబు
-
Jul 26, 2026 13:35 IST
టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
గొడ్డలి పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలను పంచుకోవద్దని ఆదేశం
-
Jul 26, 2026 13:34 IST
అమరావతి: మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: MLC కంచర్ల శ్రీకాంత్
సమాజానికి నిజాలు చెప్పే బాధ్యత టీచర్లు తీసుకోవాలి
అవాస్తవ ప్రచారాలను ఉద్యోగులు ఖండించాలి: MLC కంచర్ల శ్రీకాంత్
-
Jul 26, 2026 12:36 IST
హనుమకొండ : పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ చానెల్ ద్వారా ప్రత్యేక ఆంబులెన్స్‌లో హైదరాబాద్ తరలింపు
రోహిణి ఆస్పత్రి నుంచి బయలు దేరిన ఆంబులెన్స్
కాన్వాయ్‌లో వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు
-
Jul 26, 2026 12:15 IST
విద్యార్థుల విజయాన్ని సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు: కవిత
యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలిచ్చి మోసం చేసిన చరిత్ర మీది: కవిత
మాట నిలబెట్టుకోకపోతే యువత మిమ్మల్ని గద్దె దించడం ఖాయం: కవిత
-
Jul 26, 2026 12:09 IST
హైదరాబాద్: AIG ఆస్పత్రికి సీఎం చంద్రబాబు
AIGలో చికిత్స పొందుతున్న బాలకృష్ణను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడ్డ బాలకృష్ణ
-
Jul 26, 2026 12:08 IST
ఢిల్లీ: కార్గిల్ అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు
సైనికుల ధైర్యసాహసాలు, అంకితభావానికి యావత్ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది: ప్రధాని మోదీ
మాతృభూమిని రక్షించేందుకు సైనికులు సర్వస్వం త్యాగం చేశారు: ప్రధాని మోదీ
-
Jul 26, 2026 12:06 IST
వరంగల్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన
మీడియాతో మాట్లాడిన రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ Dr సుధాకర్ రెడ్డి
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది
హార్ట్ స్ట్రోక్‌తో ఆస్పత్రికి తీసుకువచ్చారు
పరిస్థితి విషమంగానే ఉంది: రోహిణి వైద్యులు
-
Jul 26, 2026 11:36 IST
యాదాద్రి: రామన్నపేటలో కల్తీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తరలిస్తున్న అల్లం పేస్ట్ స్వాధీనం
వ్యాన్ డ్రైవర్ విచారణతో వెలుగులోకి కీసరలోని అక్రమ తయారీ యూనిట్
ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు
కల్తీ అల్లం పేస్ట్, ముడి పదార్థాలు, యంత్రాల స్వాధీనం.. కేసు నమోదు
-
Jul 26, 2026 11:34 IST
నంద్యాల: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు
టేకు కలప అక్రమ తరలింపు కేసులో నలుగురు అధికారుల సస్పెన్షన్
ప్రభుత్వ డిపోకు తరలించాల్సిన రూ.లక్షల విలువైన కలప పక్కదారి
వెలుగోడు మండలం మోత్కూరులోని ఓ ప్రైవేట్ డిపోకు తరలించిన వైనం
అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు
-
Jul 26, 2026 11:33 IST
సాయంత్రం ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాహుల్, ఖర్గేను కలవనున్న మహేశ్ గౌడ్
21 ఏళ్లకే చట్టసభల్లో పోటీ చేసే అంశంపై చర్చ
జెన్‌జీ ఉద్యమం, నీట్ పరీక్ష తదితర అంశాలపై చర్చ
-
Jul 26, 2026 11:18 IST
నీట్ పరీక్ష పేరుతో కొందరు రాద్దాంతం చేస్తున్నారు: ఎంపీ డీకే అరుణ
రాజకీయ లబ్ధితో పాటూ దేశాన్ని అస్థిరపరచడం కోసం ఆప్ ఈ చర్యకు పూనుకుంది: ఎంపీ డీకే అరుణ
BRS హయాంలో గ్రూప్-1 పేపర్ లీకైతే ఎందుకు రాజీనామా చేయలేదు?
గత లీకేజ్‌ల గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు?: డీకే అరుణ
అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడపటం రాహుల్‌కు అలవాటు: ఎంపీ డీకే అరుణ
-
Jul 26, 2026 11:17 IST
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు: సీపీ సజ్జనార్
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్
రూ.10వేల EMD పేరిట నకిలీ కాల్స్, లింకులతో మోసాలు
ప్రభుత్వ పోర్టళ్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్న మోసగాళ్లు
-
Jul 26, 2026 11:15 IST
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు శివారు లక్ష్మీపురం జాతీయ రహదారిపై ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
భర్త కారుమంచి హరికృష్ణ ప్రసాద్ (60) మృతి, భార్య భవానికి తీవ్రగాయాలు
మంగళగిరి నుంచి కారులో స్వగ్రామం చింతలపాడుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదం
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 26, 2026 10:53 IST
పార్వతీపురం మన్యం జిల్లా: జోగింపేట జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీకొన్న బొలెరో
విజయనగరం జిల్లా అలజంగి గ్రామానికి చెందిన గురునాయుడు మృతి, 8 మందికి గాయాలు
రాయగడ మజ్జి గౌరమ్మ ఆలయ దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం
క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స
క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా అలజంగి గ్రామానికి చెందినవారిగా గుర్తింపు
-
Jul 26, 2026 10:39 IST
భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం ముష్టిబండ దగ్గర ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీ
బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు, నలుగురికి తీవ్ర గాయాలు
మెరుగైన వైద్య కోసం దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
-
Jul 26, 2026 10:36 IST
మహారాష్ట్ర: గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
భామ్రాగడ్‌లో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు
జులై 30 వరకూ గడ్చిరోలి జిల్లా బంద్‌కు పిలుపు
నీరు, అటవీ, భూ సమస్యలపై నిరసనలు
రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
-
Jul 26, 2026 10:35 IST
నెల్లూరు: మర్రిపాడు దగ్గర బెజవాడ పాపిరెడ్డి కాలువకు గండి
కాలువ పరిమితికి మించి నీటిని విడుదల చేసిన అధికారులు
అధికారులకు సమస్య వివరించినా పట్టించుకోలేదంటూ రైతుల ఆగ్రహం
-
Jul 26, 2026 10:23 IST
కామారెడ్డి: బీబీపేట్ మండలం తుజల్పూర్‌లో బాలుడిపై వీధి కుక్క దాడి
అడ్డుకోబోయిన తల్లిపైనా దాడి
తల్లి, కుమారుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jul 26, 2026 10:23 IST
అమరావతి: రేపు పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటన
పునాదిపాడులో జిల్లా పరిషత్ పాఠశాల, బాలికల జూనియర్ కాలేజీని ప్రారంభించనున్న లోకేశ్
కంకిపాడులో పెనమలూరు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేశ్
-
Jul 26, 2026 10:11 IST
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీరజవాన్లకు సీఎం చంద్రబాబు నివాళి
దేశం కోసం పోరాడిన సైనికుల ధైర్యసాహసాలకు వందనం: సీఎం చంద్రబాబు
కార్గిల్ వీరుల త్యాగం దేశానికి శాశ్వత స్ఫూర్తి: ఎక్స్‌లో చంద్రబాబు
వీర సైనికుల అసమాన పరాక్రమం తరతరాలకు స్ఫూర్తి: చంద్రబాబు
కార్గిల్ అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని దేశం మరవదు: సీఎం చంద్రబాబు
-
Jul 26, 2026 10:10 IST
సూర్యాపేట: కోదాడ వద్ద రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి CNG కారు బోల్తా
గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో కారు దగ్ధం
ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
విజయవాడ నుంచి యాదగిరిగుట్ట వెళ్తుండగా ఘటన
-
Jul 26, 2026 10:09 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ క్లీనింగ్ డ్రైవ్
CJP నిరసన ముగియడంతో పరిసరాలను శుభ్రం చేసిన కాంగ్రెస్ సేవా దళ్ కార్యకర్తలు
-
Jul 26, 2026 10:08 IST
హైదరాబాద్: మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నరసింహ సస్పెన్షన్
విధి నిర్వహణలో అలసత్వం వహించారని సీపీ చర్యలు
పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యంపై కఠిన వైఖరి ఉంటుంది: సీపీ
-
Jul 26, 2026 08:41 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై VIP దర్శనాల నిలిపివేత
ఆషాఢ మాసం ఉత్సవాల సందర్భంగా తెలంగాణ నుంచి అమ్మవారికి నేడు బోనాల సమర్పణ
వివిధ ప్రాంతాల నుంచి సారె సమర్పణకు వస్తున్న భక్తులు
మధ్యాహ్నం 3గంటల వరకు ప్రోటోకాల్, VIP దర్శనాల రద్దు
-
Jul 26, 2026 08:40 IST
హైదరాబాద్: ఉదయం 11 గంటలకు AIG ఆస్పత్రికి సీఎం చంద్రబాబు
చికిత్స పొందుతున్న బాలకృష్ణను పరామర్శించనున్న చంద్రబాబు
ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడ్డ బాలకృష్ణ
-
Jul 26, 2026 08:39 IST
హైదరాబాద్: కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం
స్కూటీని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు యువకుల మృతి
మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు మహేష్(17), లక్ష్మి తేజ(17)గా గుర్తింపు
పోలీసుల అదుపులో టిప్పర్ డ్రైవర్
-
Jul 26, 2026 08:20 IST
సంగారెడ్డి: ఇస్నాపూర్‌లో నలుగురు బిహార్ బాలికల మిస్సింగ్
ఇస్నాపూర్ ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్న బాలికలు
ఈనెల 23న స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి తిరిగిరాని బాలికలు
పటాన్‌చెరు పీఎస్‌లో బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు
-
Jul 26, 2026 07:24 IST
బిహార్: జన శక్తి జనతా దళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్
శనివారం సాయంత్రం దక్ బంగ్లా చౌరహా సమీపంలో అరెస్ట్
అర్ధరాత్రి తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన మేజిస్ట్రేట్
తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బేయూర్ సెంట్రల్ జైలుకు తరలింపు
-
Jul 26, 2026 06:56 IST
నేడు నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన
పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారాయణ
-
Jul 26, 2026 06:55 IST
నేడు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం
మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
Jul 26, 2026 06:50 IST
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు
ఆరామ్‌కోకు చెందిన కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు
యెమెన్‌పై సౌదీ అరేబియా వైమానిక దాడులకు ప్రతిదాడులు
మిస్సైల్స్, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసినట్టు హూతీలు ప్రకటన
యెమెన్‌పై దిగ్బంధనం ఎత్తివేసేవరకు నౌకలను అడ్డుకుంటామని వెల్లడి
-
Jul 26, 2026 06:49 IST
చెన్నై: మాజీ కేంద్ర మంత్రి ఎంకే అలగిరి కుమార్తెపై కేసు నమోదు
ఎస్‌బీఐ మేనేజర్‌పై దాడి చేయడంతో కయల్విజిపై కేసు నమోదు
లిఫ్ట్ మరమ్మతు విషయంలో ఇద్దరి వాగ్వాదం
కోపంతో ఒక్కసారిగా ఎస్‌బీఐ మేనేజర్‌ని చెంపదెబ్బ కొట్టిన కయల్విజి
-
Jul 26, 2026 06:45 IST
అసోంలోని ఆరు జిల్లాల్లో తగ్గని వరద బీభత్సం
చరాయిదేవ్, దిబ్రూగఢ్, గోలాఘాట్ జిల్లాల్లో వరద బీభత్సం
జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో వరద బీభత్సం
6 జిల్లాల్లో 274 సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాల ఏర్పాటు
వరద ముంపులోనే 6.55లక్షల మంది బాధితులు
వరదలతో 66 మంది మృతిచెందినట్టు అధికారుల ప్రకటన
-
Jul 26, 2026 06:45 IST
నేడు భారత్-జింబాబ్వే మధ్య చివరి టీ20
హరారెలో సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్
3 టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత్
-
Jul 26, 2026 06:31 IST
స్థిరంగా బంగారం ధరలు
రూ.1,44,930కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.1,32,850కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
కిలో వెండి ధర రూ.2,40,000
-
Jul 26, 2026 06:01 IST
నల్లగొండ: చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం
గుట్ట కింద గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర చెలరేగిన మంటలు
రెండు సిలిండర్లు పేలి భారీగా వ్యాపించిన మంటలు
మంటలధాటికి 10కి పైగా షాపుల దగ్ధం
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది