Share News

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:37 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి..
Hyderabad Road Accident

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో మహేశ్ (17), లక్ష్మీ తేజ (17)తో పాటు మరో యువకుడు స్కూటీపై క్రికెట్ ఆడేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో మహేశ్, లక్ష్మీ తేజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమా? లేక డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి రిజైన్‌ చేస్తే సరిపోదు.. మళ్లీ జరగకుండా సంస్కరణలు తేవాలి: కవిత

జరిమానాలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట

Updated Date - Jul 26 , 2026 | 08:38 AM