Share News

జరిమానాలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Jul 26 , 2026 | 06:20 AM

అనుమతి లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం అలవాటుగా మారిపోయిందని, అలాంటి వాటిని క్షమించరాదని హైకోర్టు పేర్కొంది. జరిమానాలు విధించడం ద్వారా వాటిని అడ్డుకోవాలని సూచించింది.

జరిమానాలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట

  • హైకోర్టు వ్యాఖ్య ...పిటిషనర్‌కు 3 లక్షల ఫైన్‌ విధింపు

అనుమతి లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం అలవాటుగా మారిపోయిందని, అలాంటి వాటిని క్షమించరాదని హైకోర్టు పేర్కొంది. జరిమానాలు విధించడం ద్వారా వాటిని అడ్డుకోవాలని సూచించింది. తాను నిర్మించిన అదనపు అంతస్తులను జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్‌ 455-ఏ, 455-ఏఏ కింద రెగ్యులరైజ్‌ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గండిపేట మండలం, నెక్నాంపూర్‌ అల్కాపూర్‌ టౌన్‌షి్‌పకు చెందిన అరుణ అగర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ వ్యాఖ్య చేసింది. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత కేనులో 598 చదరపు గజాల్లో అనుమతి లేకుండా అదనంగా రెండు అంతస్తులు, పెంట్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారు. అంటే దాదాపు 8 నుంచి పది వేల చదరపు అడుగుల మేర అక్రమ నిర్మాణం చేపట్టారు. దీని విలువ రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. అందువల్ల క్రమబద్ధీకరణ దరఖాస్తును జీహెచ్‌ఎంసీ పరిశీలించాలంటే తొలుత ఖర్చుల కింద రూ.3 లక్షలు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అంతవరకు ఆ భవనంపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అధికారులకు సూచించింది.

Updated Date - Jul 26 , 2026 | 06:21 AM