Share News

నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 10కి పైగా దుకాణాల దగ్ధం

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:51 AM

నల్లగొండ జిల్లా చెరువుగట్టు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుట్ట కింద ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చి.. 10కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 10కి పైగా దుకాణాల దగ్ధం

నల్లగొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధి చెరువుగట్టు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుట్ట కింద ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చి.. 10కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు.

fire5.jpgfire-3.jpg


ప్రారంభంలో చిన్న స్థాయిలో కనిపించిన మంటలు కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని దుకాణాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు మరింత ఉద్ధృతంగా మారాయి. సిలిండర్ల పేలుడు శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దుకాణాల్లో ఉన్న సరుకులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో వ్యాపారులకు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో దుకాణాల్లో ఉన్నవారు వెంటనే బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు, అధికారులు విచారణ ప్రారంభించారు.

accident.jpgfire4.jpgfire2.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

ధరణి టెండర్‌ పారదర్శకంగా జరిగిందా?

విద్యార్థుల భవిత కోసమే ఎన్టీయేలో సంస్కరణలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 26 , 2026 | 08:12 AM