Share News

విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:26 PM

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీక్స్‌పై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi Takes Charge as Education Minister

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీక్స్‌పై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్వహించిన విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్‌కు కేంద్రం అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.


విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై నిన్ననే మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎన్నో విజయాలు అందుకున్నారని అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో నిబద్ధతతో తన బాధ్యతలు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ఇప్పటికే వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రహ్లాద్‌కు కేంద్రం విద్యాశాఖను కూడా అదనంగా కేటాయించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం.. 2.5 లక్షల మందికి పైగా తరలింపు..

నేపాల్ ప్రభుత్వం యూటర్న్.. వివాదాస్పద మ్యాప్‌తోనే రూ.1 నాణెం విడుదల..

Updated Date - Jul 26 , 2026 | 01:38 PM