నేపాల్ ప్రభుత్వం యూటర్న్.. వివాదాస్పద మ్యాప్‌తోనే రూ.1 నాణెం విడుదల..
ABN , Publish Date - Jul 26 , 2026 | 08:08 AM
నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను చూపించే రాజకీయ మ్యాప్‌ను కలిగిన రూ.1 నాణేన్ని ముద్రిస్తామని నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ స్పష్టం చేసింది.
నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను చూపించే రాజకీయ మ్యాప్‌ను కలిగిన రూ.1 నాణేన్ని ముద్రిస్తామని నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ (Nepal Rastra Bank) స్పష్టం చేసింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం (Nepal Re 1 Coin).
కొద్ది రోజుల క్రితం ఈ వివాదాస్పద మ్యాప్‌ను కొత్త రూ.1 నాణెం నుంచి తొలగించి, దాని స్థానంలో ప్రాచీన బౌద్ధ మఠం చిత్రాన్ని ఉంచే ప్రతిపాదనకు నేపాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో భారత్-నేపాల్ సంబంధాల్లో ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని భావించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంతో, నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ వివాదాస్పద మ్యాప్‌తోనే కొత్త రూ.1 నాణేన్ని ముద్రించనున్నట్లు ప్రకటించింది (Nepal Rastra Bank).
కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల గురించి నేపాల్, భారత్ మధ్య 2020 నుంచి వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతాలు తమ భూభాగంలోనివని నేపాల్ వాదిస్తోంది. ఈ మూడు ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ చెబుతోంది. ఈ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని భారత్ సూచిస్తోంది (India Nepal border dispute).
కాగా, నేపాల్ కేంద్ర బ్యాంకు నిర్ణయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ పరిణామం భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..