Share News

సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:51 AM

దేశ రాజధాని ఢిల్లీలో చేసిన పోరాటంలో కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తమ ప్రధాన డిమాండ్ నెరవేరిన నేపథ్యంలో నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది.

సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..
Cockroach Janta Party

దేశ రాజధాని ఢిల్లీలో చేసిన పోరాటంలో కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తమ ప్రధాన డిమాండ్ నెరవేరిన నేపథ్యంలో నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఇక, తర్వాత ఏంటి? సీజేపీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారుతుందా? ఈ ప్రశ్నకు సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ సమాధానం చెప్పారు (Cockroach Janta Party).


ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మాట్లాడారు. 'పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారా' అని అడిగినప్పుడు , 'భారతదేశంలో దేనికీ కాదనకూడదని నా అభిప్రాయం' అని అశుతోష్ రాంకా అన్నారు. అయితే తమ ఉద్యమం అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించలేదని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల సంస్కరణలు, విద్యార్థులకు న్యాయం కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు (CJP politics).


'ముందు ఇంటికి వెళ్లి పడుకుని, కాస్త విశ్రాంతి తీసుకోవాలి. నా కుటుంబాన్ని కలవాలి. గత రెండు నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. గడిచిన రెండు నెలల్లో జరిగిన వాటన్నిటి గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. ఇది మా అందరికీ చాలా భారంగా అనిపించింది. ఇది గర్వించదగిన క్షణం. ఇది నిజంగా సంతోషించాల్సిన, ఉపశమనం పొందాల్సిన సమయం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం' అని ఆశుతోష్ రాంకా పేర్కొన్నారు (NEET protest).


'ప్రస్తుతం మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. భారత్‌లో ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ఏదీ యువత కోరికలను నెరవేర్చలేకపోతోంది. మేము ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాము. అప్పుడే అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా యువత కోసం పనిచేసి వారి డిమాండ్లను నెరవేర్చుతుంది. ప్రస్తుతం అదే మా అజెండా' అని సౌరవ్ దాస్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..

Updated Date - Jul 26 , 2026 | 07:53 AM