Share News

నిద్రలో ఉండగా షర్టులోకి దూరిన కోబ్రా.. చివరికి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:13 AM

ఓ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హఠాత్తుగా అతని షర్టులోకి కోబ్రా దూరింది. దీంతో అతడు భయంతో వణికిపోయాడు. కొంతమంది అక్కడికి చేరుకుని అతడికి ధైర్యం చెప్పి నెమ్మిదిగా కోబ్రాను బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది..

నిద్రలో ఉండగా షర్టులోకి దూరిన కోబ్రా.. చివరికి..
Cobra Rescue Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హఠాత్తుగా అతని షర్టులోకి కోబ్రా దూరింది. దీంతో అతడు భయంతో వణికిపోయాడు. గమనించిన కొంతమంది అక్కడికి చేరుకుని, అతడికి ధైర్యం చెప్పి నెమ్మిదిగా కోబ్రాను బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని నేలపై పడుకున్నాడు. అంతలోనే ఓ పాము మెల్లిగా అతడి షర్ట్‌లోకి దూరింది. మొదట్లో ఆ వ్యక్తికి ఈ విషయం తెలియకపోయినా.. కొద్దిసేపటి తర్వాత తన షర్టులో ఏదో కదులుతున్నట్లు గుర్తించాడు. తీరా పాము అని తెలుసుకుని ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు.


గమనించిన స్థానికులు అతడికి ధైర్యం చెప్పి.. షర్టును నెమ్మదిగా విప్పారు. కొద్దిసేపటి తర్వాత షర్టులో నుంచి కోబ్రా బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో @hemlatajk అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘అలాంటి ప్రదేశాల్లో నిద్రించడం డేంజర్.. ఇలాగే జరుతుంది’ అని, ‘మనోడికి భూమి మీద నూకలున్నాయి’ అని ఒకరు, ‘అతడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..

Updated Date - Jul 26 , 2026 | 07:30 AM