Share News

ఆ వైరల్ వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:55 PM

ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ వర్ష గైక్వాడ్ షేర్ చేసిన వీడియోపై ముంబై పోలీస్ శాఖ స్పందించింది. నీట్ పేపర్ లీక్ అంశంపై ముంబైలోని దాదర్‌లో చేపట్టిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్ అధికారి యువతితో తప్పుగా ప్రవర్తించాడంటూ ఆమె పెట్టిన ఆ పోస్టును పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది.

ఆ వైరల్ వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ
The Mumbai Police

ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ వర్ష గైక్వాడ్ షేర్ చేసిన వీడియోపై ముంబై పోలీస్ శాఖ స్పందించింది. నీట్ పేపర్ లీక్ అంశంపై ముంబైలోని దాదర్‌లో చేపట్టిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్ అధికారి యువతితో తప్పుగా ప్రవర్తించాడంటూ ఆమె పెట్టిన ఆ పోస్టును పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది. పోస్టు పెట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలంటూ హితవు పలికింది. ఈ మేరకు ముంబై పోలీస్ శాఖ శుక్రవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో..


‘మేడమ్, దయచేసి గమనించండి. తప్పుడు అర్థం వచ్చేలా ఈ వీడియోపై ప్రచారం జరుగుతోంది. శాంతిభద్రతలను అదుపు చేస్తున్న సమయంలో.. సదరు అధికారి ఓ నిరసనకారుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన మరోవైపు చూస్తుండగా.. ఓ మహిళ అనుకోకుండా వారి మధ్యలోకి వచ్చింది. వీడియోకు తప్పుడు అర్థాలు ఆపాదించే ముందు మీరు వాస్తవాలను నిర్ధారించుకుంటారని ఆశిస్తున్నాము. ఉన్నతాధికారులు వాస్తవాలన్నింటినీ పరిశీలించారు. నిజాలను తెలుసుకోవడానికి ఆ వీడియోను చాలా నిశితంగా పరిశీలించారు’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

కిడ్నీ సమస్యలు.. గుండెకు ప్రమాదకరమా?

మోదీని దించి రాహుల్‌ను ప్రధానిని చేయడమే వాళ్ల ఏకైక లక్ష్యం: కేంద్ర మంత్రి బండి సంజయ్

Updated Date - Jul 24 , 2026 | 06:59 PM