ఎస్‌బీఐ మేనేజర్‌పై దాడి.. కేంద్ర మాజీ మంత్రి కుమార్తెపై కేసు నమోదు..
ABN , Publish Date - Jul 26 , 2026 | 07:05 AM
కేంద్ర మాజీ మంత్రి ఎంకే అలగిరి కుమార్తె కయల్విజి వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్‌పై దాడి చేశారనే ఆరోపణలతో ఆమెపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి ఎంకే అలగిరి కుమార్తె కయల్విజి వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్‌పై దాడి చేశారనే ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కయల్విజి దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఓ కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్‌తో కయల్విజి, మరో వ్యక్తి మాట్లాడుతుండగా లిఫ్ట్ మరమ్మతుల అంశంపై వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో కయల్విజి ఒక్కసారిగా లేచి బ్యాంక్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఘటన అనంతరం బాధిత మేనేజర్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. చెన్నై పోలీసులకు ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు సీసీటీవీ ఫుటేజీని కూడా ఆధారంగా సమర్పించారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు అనంతరం చెన్నై పోలీసులు స్పందిస్తూ పలు వివరాలను వెల్లడించారు. అడయార్ ప్రాంతంలో కయల్విజికి ఓ వాణిజ్య భవనం ఉందని తెలిపారు. ఆ భవనంలో ఎస్‌బీఐ శాఖ అద్దెకు కొనసాగుతోందని పేర్కొన్నారు. భవనంలోని లిఫ్ట్ కొంతకాలంగా పనిచేయకపోవడంతో దానిని మరమ్మతు చేయాలని బ్యాంక్ మేనేజర్ యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. ఈ విషయంపై కయల్విజి, బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతుండగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని వివరించారు. అయితే, ఆగ్రహానికి గురైన కయల్విజి ఒక్కసారిగా మేనేజర్‌పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా