Share News

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక..

ABN , Publish Date - Jul 26 , 2026 | 02:41 PM

వాయువ్య బంగాళాఖాతం.. దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మత్స్యకారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక..
Andhra Pradesh Cyclone

అమరావతి, జులై 26: వాయువ్య బంగాళాఖాతం.. దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మత్స్యకారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని తేల్చి చెప్పింది. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలు ఉపయోగించడం సురక్షితం కాదని తెలిపింది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ.. రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు(సోమవారం) ఉదయం లేదా మధ్యాహ్నం లోపు పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే సూచనలు ఉన్నాయని తెలిపింది.


ఇవి కూడా చదవండి

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దు: సీఎం చంద్రబాబు

Updated Date - Jul 26 , 2026 | 02:53 PM