Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 16 , 2026 | 06:32 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 16, 2026 21:39 IST

    కాకినాడ: తుని రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

    • విశాఖపట్నం నుంచి నిడమానూరు వెళ్తున్న గూడ్స్‌ రైలు

    • ఐరన్‌ లోడుతో వెళ్తుండగా ప్రమాదం

    • లూప్‌లైన్‌లో ఘటన జరగడంతో తప్పిన పెను ప్రమాదం

    • ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు

  • Jul 16, 2026 21:38 IST

    యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద బైక్‌ను ఢీకొన్న లారీ

    • వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టిన లారీ

    • ప్రమాదంలో సాయిలు (69) అక్కడికక్కడే మృతి

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 16, 2026 21:29 IST

    ఏపీలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

    • ఇప్పటి వరకు 12 కొవిడ్‌ కేసులు నమోదు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ ఆరోగ్యశాఖ

  • Jul 16, 2026 21:28 IST

    హైదరాబాద్‌: క్రీడా రంగంపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది: సీఎం రేవంత్‌

    • క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది: సీఎం రేవంత్‌

    • తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చాం: సీఎం రేవంత్‌

    • క్రీడల్లో రాణించినవారిని ప్రోత్సహిస్తున్నాం: సీఎం రేవంత్‌

    • స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం: సీఎం రేవంత్‌

  • Jul 16, 2026 21:26 IST

    హైదరాబాద్‌: సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

    • సేఫ్ సిటీతో హైదరాబాద్‌కు మరింత భద్రత: సీవీ ఆనంద్‌

    • మహిళలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి: సీవీ ఆనంద్‌

    • సీసీటీవీ నిఘా వ్యవస్థను మరింత విస్తరించాలని ఆదేశం

    • మరింత సురక్షిత నగరంగా హైదరాబాద్‌: డీజీపీ సీవీ ఆనంద్‌

  • Jul 16, 2026 20:45 IST

    నిజామాబాద్: గంగాస్థాన్-2 కాలనీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

    • భారీ మొత్తంలో నగదు స్వాధీనం

    • 10 మంది అరెస్ట్‌, పరారీలో ఇద్దరు

    • పోలీసుల అదుపులో పలువురు ప్రముఖులు

    • మొబైల్‌ ఫోన్లు, కార్లు, బైక్‌లు సీజ్‌

    • నిజామాబాద్‌ రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు నిందితుల తరలింపు

  • Jul 16, 2026 20:13 IST

    అమరావతి: అసైన్డ్ భూముల కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

    • చంద్రబాబు, నారాయణపై కేసులు రాజకీయ కక్షసాధింపేనన్న హైకోర్టు

    • పరిపాలనా నిర్ణయాలకు నేరపూరిత చర్యలు ఆపాదించడం సరికాదన్న హైకోర్టు.

    • జీఓ 141 చట్టబద్ధంగానే తీసుకొచ్చారని స్పష్టం చేసిన హైకోర్టు

    • జీఓ వల్ల నష్టపోయినట్లు రైతులెవరూ కోర్టును ఆశ్రయించలేదు: హైకోర్టు

    • APCRDA నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ ఉందన్న హైకోర్టు

    • సెక్షన్ 146 ప్రకారం ప్రాసిక్యూషన్‌కు అవకాశం లేదని స్పష్టం చేసిన హైకోర్టు

    • చంద్రబాబు, నారాయణను యాంత్రికంగా నిందితులుగా చేర్చారని వ్యాఖ్య

    • ఫిర్యాదులో ప్రజాప్రయోజనం కంటే దురుద్దేశమే ఉందని హైకోర్టు అభిప్రాయం

    • ఆరోపణలు నిరాధారమని తేల్చి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

  • Jul 16, 2026 20:00 IST

    తెలంగాణ గ్రామ పంచాయతీలకు శుభవార్త

    • సొంత ఆదాయంపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం

  • Jul 16, 2026 19:59 IST

    హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

    • స్టేటస్‌ కో ఆర్డర్‌ను ధిక్కరించడపై అసహనం

    • హయత్‌నగర్‌లో ఓ స్థలంపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు

    • ఇవాళ ఉదయం ఆ స్థలంలో నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా

    • అది పార్క్‌ స్థలమంటూ బోర్డు పెట్టిన హైడ్రా

    • కూల్చివేతపై లంచ్‌మోషన్ దాఖలు చేసిన పిటిషనర్

  • Jul 16, 2026 19:20 IST

    ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయిన ఏపీ మంత్రి టీజీ భరత్

    • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చ

    • ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన రైల్వే అంశాలపై చర్చించినట్లు సమాచారం

    • సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య రంగ అంశాలపై కూడా చర్చ

  • Jul 16, 2026 18:45 IST

    నల్లగొండ: నకిరేకల్‌లో ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు

    • రహదారిపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

    • పూర్తిగా దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటీ

    • వాహనదారుడికి తృటిలో తప్పిన ప్రమాదం

    • ఘటనపై వివరాలు సేకరిస్తున్న అధికారులు

  • Jul 16, 2026 18:41 IST

    ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల బిజినెస్‌ లిస్ట్‌ విడుదల

    • 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

    • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కి పెంపు ప్రతిపాదన

    • ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధం

    • FCRA సవరణ బిల్లుపై ఈ సమావేశాల్లోనే చర్చ

    • ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’పై తుది నిర్ణయం

    • జనన, మరణాల ఆలస్యపు రిజిస్ట్రేషన్ నిబంధనలు కఠినతరం

    • జాతీయ గౌరవ పరిరక్షణ చట్టంలో మరిన్ని సవరణలు

    • MSME రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ కోసం కొత్త బిల్లు

    • రాష్ట్రాలకు MSME ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల ఏర్పాటుకు అవకాశం

    • 2022-23 అదనపు నిధుల వ్యయంపై లోక్‌సభలో ఓటింగ్

  • Jul 16, 2026 18:39 IST

    అమరావతి: వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

    • తొలిసారి అమరావతిలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉంది: సీఎం

    • పూరీ జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక విశిష్టత ఉంది: సీఎం

    • జగన్నాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు

  • Jul 16, 2026 18:35 IST

    ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

    • పెదవేగి మండలం నాగన్నగూడెం వద్ద బైక్‌ను ఢీకొన్న ఆటో

    • ప్రమాదంలో కానిస్టేబుల్‌ ప్రసాద్‌ మృతి

    • పెదవేగి డీటీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 16, 2026 18:26 IST

    లండన్‌‌లో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

    • ముంబై సందడి నుంచి దూరంగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న విరుష్క జంట

    • లండన్ వీధుల్లో అనుష్కను గుర్తించి వీడియో తీసిన ఓ అభిమాని

    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

  • Jul 16, 2026 17:35 IST

    అమరావతి: వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్ర

    • రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

    • ఇస్కాన్‌ ఆధ్వర్యంలో రథయాత్ర, భారీగా తరలివచ్చిన భక్తులు

  • Jul 16, 2026 17:22 IST

    హర్యానాలో ప్రారంభానికి సిద్ధంగా తొలి హైడ్రోజన్‌ రైలు

    • జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య నడవనున్న హైడ్రోజన్‌ రైలు

    • రేపు పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

    • పూర్తి స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ రైలు తయారీ

    • హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ టెక్నాలజీతో నడనున్న రైలు

  • Jul 16, 2026 17:11 IST

    కార్డిఫ్‌: భారత్‌ Vs ఇంగ్లండ్‌ రెండో వన్డే

    • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

  • Jul 16, 2026 17:10 IST

    భూపాలపల్లి జిల్లాలో పాము కాటుతో విద్యార్థి మృతి

    • ఆరో తరగతి చదువుతున్న అరుణ్‌ అనే బాలుడు మృతి

    • నాగారం గ్రామంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఘటన

    • నేలపై పడుకున్న తండ్రి, కొడుకులను కాటేసిన పాము

    • చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అరుణ్‌

  • Jul 16, 2026 17:02 IST

    పూరీ జగన్నాథ రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు

    • బడా దండా వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితి

    • లక్షలాది భక్తుల రాకతో చారియట్‌ ప్రదేశంలో గందరగోళం

    • సుమారు 120 మంది భక్తులు అస్వస్థతకు గురి

    • బాధితులను ఆస్పత్రికి తరలించిన రెస్క్యూ టీమ్

  • Jul 16, 2026 16:55 IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢ వేడుకలు

    • అమ్మవారికి సారె సమర్పించిన మహిళా భక్తులు

    • మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పణ

    • పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పూలతో ప్రత్యేక పూజలు

    • అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించిన మహిళలు

  • Jul 16, 2026 16:54 IST

    విజయవాడ సితార సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర

    • రథయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

    • ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు

    • జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, ప్రముఖులు

    • పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పాతూరి నాగభూషణం, శ్రీధర్, ఎమ్మెల్యే సృజనా చౌదరి

  • Jul 16, 2026 16:35 IST

    న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం

    • దక్షిణ దీవిలోని టే అనౌ సమీపంలో భూమి కంపించింది

    • భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

    • భూకంప ప్రభావంపై పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు

  • Jul 16, 2026 16:28 IST

    రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

    • సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ

    • పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం

  • Jul 16, 2026 16:25 IST

    స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

    • సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం

    • తొలుత మున్సిపల్, ఆపై ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక

    • అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచన

    • జూలై 27 నుంచి 45 రోజుల డోర్ టూ డోర్ ప్రచారానికి టీడీపీ ఆదేశాలు

    • ఖాళీ నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయం

  • Jul 16, 2026 16:23 IST

    ఏపీ పెన్షన్ నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణ

    • పెన్షన్, గ్రాట్యుటీ నిలుపుదలకు ముందు ఏపీపీఎస్సీ సంప్రదింపు తప్పనిసరి

    • పెన్షన్ నియమాలు- 1980లోని రూల్ 9(1)కు సవరణ

    • కోర్టు శిక్ష విధించిన కేసుల్లో మాత్రం ఏపీపీఎస్సీ సంప్రదింపు అవసరం లేదని స్పష్టం

  • Jul 16, 2026 16:21 IST

    అమరావతి: గల్లప్రోలు, మూలపేట ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌

    • సమగ్ర దర్యాప్తు చేయాలని కాకినాడ జిల్లా పోలీసులకు ఆదేశం

    • బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్‌ ఆదేశం

    • ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు: పవన్‌ కల్యాణ్‌

  • Jul 16, 2026 16:20 IST

    కూటమి హయాంలోనే రాయలసీమ అభివృద్ధి: పట్టాభిరామ్‌

    • ఇప్పుడు అందరూ రైజింగ్‌ రాయలసీమ అంటున్నారు: పట్టాభిరామ్‌

    • రెండేళ్లలోనే రాయలసీమకు రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు: పట్టాభిరామ్‌

    • ఇప్పుడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదు: పట్టాభిరామ్‌

    • వైఎస్ హయాంలో స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో భూములు దోచుకున్నారు: పట్టాభిరామ్‌

  • Jul 16, 2026 16:19 IST

    ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే లేఖ

    • పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: ఖర్గే

    • డీలిమిటేషన్‌ బిల్లుపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి: ఖర్గే

  • Jul 16, 2026 16:18 IST

    ఆదిలాబాద్‌: ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఇరిగేషన్‌ అధికారులు

    • రూ.60 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన EE విఠల్‌, AE రమేష్‌

    • పౌల్ట్రీఫామ్‌ ఏర్పాటు కోసం NOC ఇచ్చేందుకు లంచం డిమాండ్

  • Jul 16, 2026 16:17 IST

    ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

  • Jul 16, 2026 16:17 IST

    కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపులపై వివాదం

    • కమిషనర్, అకౌంటెంట్‌పై కమీషన్ల ఆరోపణలు

    • విచారణ పూర్తయ్యే వరకు బిల్లులు నిలిపివేయాలని కౌన్సిలర్ల డిమాండ్

    • శానిటేషన్, వాటర్ వర్క్స్, ఫైనాన్స్ బిల్లులపై సమగ్ర విచారణ కోరారు

    • అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ల విజ్ఞప్తి

  • Jul 16, 2026 16:10 IST

    రాజ్యసభ సభ్యత్వానికి టీఎంసీ ఎంపీ రుక్మిణీ మల్లిక్ రాజీనామా

    • పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

    • రుక్మిణీ మల్లిక్ రాజీనామాతో రాజ్యసభలో తగ్గిన టీఎంసీ సంఖ్యాబలం

  • Jul 16, 2026 15:18 IST

    పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

    • హోర్ముజ్‌ జలసంధిలో నౌకలపై వరుస దాడులు

    • నౌకలపై దాడుల నేపథ్యంలో కేంద్రం అడ్వయిజరీ

    • హోర్ముజ్‌ దాటే నౌకల్లో భారతీయులను నియమించొద్దని షిప్‌ యజమానులకు కేంద్రం ఆదేశం

  • Jul 16, 2026 15:17 IST

    హైదరాబాద్: కమీషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం నిర్మించారు: మంత్రి ఉత్తమ్‌

    • కేసీఆర్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఉత్తమ్‌

    • ఇరిగేషన్‌ వ్యవస్థను కేసీఆర్‌ నాశనం చేశారు: మంత్రి ఉత్తమ్‌

    • సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

  • Jul 16, 2026 15:16 IST

    హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక ప్రకటన

    • ఆదివారం డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌తో సమావేశం

    • ఆదివారం తుది నిర్ణయం ప్రకటిస్తాం: ఫిల్మ్‌ ఫెడరేషన్

    • ఫిల్మ్‌ ఫెడరేషన్‌లో డ్యాన్సర్ల అసోసియేషన్‌ ఒక భాగమే

    • ఫెడరేషన్‌కు అనుబంధంగా పనిచేయాల్సిందేనని ప్రకటన

  • Jul 16, 2026 15:16 IST

    అమెరికా-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

    • ట్రంప్‌నకు ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

    • ట్రంప్‌ను చంపుతామంటూ టెహ్రాన్‌లో హోర్డింగ్స్‌

  • Jul 16, 2026 15:15 IST

    ఏలూరు జిల్లాలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అమానుషం

    • బూట్లు లేకపోవడంతో 25 గుంజీలు తీయించిన పీఈటీ

    • గుంజీలు తీస్తూ స్పృహ కోల్పోయిన 8వ తరగతి విద్యార్థిని

    • బాలికను ఆస్పత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది

    • ఘటన తర్వాత పరారైన వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు

  • Jul 16, 2026 15:10 IST

    ఢిల్లీ: ఇస్రోలో రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కేంద్రం కఠిన నిర్ణయం

    • గగన్‌యాన్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల రాజీనామాలకు బ్రేక్

    • కీలక మిషన్లలో ఉన్న శాస్త్రవేత్తల వీఆర్‌ఎస్, రాజీనామాలు సాధారణంగా ఆమోదించవద్దని ఆదేశాలు

    • భారీగా శాస్త్రవేత్తలు వైదొలగడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ చర్యలు

    • జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టులకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన కేంద్రం

  • Jul 16, 2026 15:08 IST

    బెంగళూరులో లా విద్యార్థిని దారుణ హత్య

    • బ్రేకప్ చెప్పడంతో యువతిపై కత్తితో దాడికి పాల్పడిన ప్రియుడి సోదరుడు

    • చికిత్స పొందుతూ మూడు రోజుల తరువాత బాధితురాలు అమృత మృతి

    • మాజీ ప్రియుడి సోదరుడు సూర్య కోసం గాలిస్తున్న పోలీసులు

  • Jul 16, 2026 15:02 IST

    శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

    • 11 మంది లబ్ధిదారులకు రూ.6 లక్షల చెక్కుల అందజేత

    • ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

    • ఇప్పటివరకు 605 మందికి రూ.5.13 కోట్ల సాయం

    • సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు లబ్ధిదారుల కృతజ్ఞతలు

  • Jul 16, 2026 14:57 IST

    టీఎంసీకి మరో భారీ ఎదురుదెబ్బ

    • రాజ్యసభ సభ్యత్వానికి కోయెల్‌ మల్లిక్‌ రాజీనామా

    • మమత పార్టీకి వరుస షాకులు

    • టీఎంసీ వీడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

  • Jul 16, 2026 14:56 IST

    హైదరాబాద్ శివారులో 100 కిలోల గంజాయి పట్టివేత

    • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్

    • మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తింపు

    • ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న ఈగల్ టీమ్

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jul 16, 2026 14:53 IST

    హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఇకపై పాలాభిషేకాలు బంద్‌: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌

    • ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఆదేశాలతో నిర్ణయం: మహేష్‌గౌడ్‌

    • పార్టీ నాయకులందరూ ఆదేశాలను పాటించాలి: మహేష్‌గౌడ్‌

    • కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు పాలాభిషేకాలు విరుద్ధం: మహేష్‌గౌడ్‌

  • Jul 16, 2026 14:52 IST

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలకాంశాలపై చర్చించాం: జైరాం రమేష్‌

    • అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం అంశంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది: జైరాం రమేష్

    • నీట్‌ పేపర్‌ లీక్‌, ఇథనాల్‌ కుంభకోణం సహా అయోధ్య అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం: జైరాం రమేష్

  • Jul 16, 2026 14:51 IST

    ఢిల్లీ: ముగిసిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ సమావేశం

    • దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ

    • పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

  • Jul 16, 2026 14:51 IST

    వృద్ధులు, తీవ్ర అనారోగ్య ఖైదీల విడుదలపై సుప్రీం కీలక ఆదేశాలు

    • తీవ్ర అనారోగ్యంతో ఉన్న వృద్ధ ఖైదీల ముందస్తు విడుదల కోసం 3 నెలల్లోగా సమగ్ర విధానం రూపొందించాలి: సుప్రీంకోర్టు

    • పాలసీని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫై చేయాలని ఆదేశం

    • ఖైదీల ఆరోగ్య స్థితిని నిష్పక్షపాతంగా అంచనా వేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మెడికల్‌ బోర్డుల ఏర్పాటు తప్పనిసరి: సుప్రీం

    • దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను e-Prisons పోర్టల్‌తో అనుసంధానం చేయాలి: సుప్రీంకోర్టు

    • నిబంధనల అమలు తీరు పరిశీలన కోసం విచారణ 2027 జనవరి 19కి వాయిదా

  • Jul 16, 2026 14:49 IST

    ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యవర్గ సమావేశం

    • డ్యాన్సర్ల అసోసియేషన్‌ వివాదంపై కీలక చర్చ

    • తాడోపేడో తేల్చుకుంటాం: సుమలత

    • తప్పు చేసిన వారితో పనిచేయం: సుమలత

    • అవసరమైతే రాజీనామాకు సిద్ధం: సుమలత

    • అసోసియేషన్‌ ఎన్నికల్లో జోక్యం ఎందుకు?: సుమలత

    • గతంలో ఫెడరేషన్‌ అసోసియేషన్‌కే వదిలేశారు: సుమలత

  • Jul 16, 2026 14:48 IST

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

    • హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్

    • పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్

    • వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని పవన్‌కు సూచించిన గవర్నర్

  • Jul 16, 2026 14:45 IST

    అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లో రఘురామ్ రాజన్‌కు కీలక బాధ్యతలు

    • ఫెడ్ బ్యాలెన్స్ షీట్ సమీక్ష కమిటీలో రాజన్ నియామకం

    • భారత సంతతికి చెందిన రాజ్ చెట్టి, ఆశా శర్మకూ చోటు

    • ద్రవ్య విధాన సంస్కరణల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

  • Jul 16, 2026 13:54 IST

    తమిళనాడు: వివాదంలో విజయ్ TVK పార్టీ

    • మంబాక్కం పంచాయతీ అధ్యక్షుడు వీరస్వామిపై అవినీతి ఆరోపణలు

    • కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్

    • వీరస్వామిని పార్టీ నుంచి బహిష్కరించిన TVK

  • Jul 16, 2026 13:53 IST

    భద్రాద్రి: సీతారామ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

    • BRS దుర్మార్గపు ఆలోచనతో బడ్జెట్ పెంచి రీడిజైన్ చేశారు: మల్లు భట్టి విక్రమార్క

    • ఈ దాష్టీకం చూసిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు: భట్టి

  • Jul 16, 2026 13:38 IST

    హైదరాబాద్: ఈడీ కస్టడీకి ఏపీ లిక్కర్ రవాణా కేసు నిందితులు

    • బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణ

    • రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

  • Jul 16, 2026 13:37 IST

    కొమురంభీం: సిర్పూర్.టి మండలం హీరాపూర్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

    • కాగజ్‌నగర్‌కు చెందిన వేణుగోపాల్ వేధింపులే కారణమని ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యుల ఆందోళన

  • Jul 16, 2026 13:30 IST

    హైదరాబాద్: కుమారుడు భరత్‌రాజ్‌రెడ్డి అరెస్ట్ వార్తలపై స్పందించిన MLC వెంకట్రామిరెడ్డి

    • మా అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం: వెంకట్రామిరెడ్డి

    • మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలేదు.. అరెస్ట్ కాలేదు: వెంకట్రామిరెడ్డి

    • డ్రగ్స్ కేసుతో భరత్‌రాజ్‌కు ఏ సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు: వెంకట్రామిరెడ్డి

    • భరత్‌రాజ్‌కు చేసిన డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది: MLC వెంకట్రామిరెడ్డి

  • Jul 16, 2026 13:25 IST

    ఢిల్లీ: ఉడాన్ 2.0 పథకం అమలుపై వర్క్‌షాప్

    • పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి: రామ్మోహన్

    • నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం: కేంద్ర మంత్రి రామ్మోహన్

    • ఎయిర్‌పోర్టును ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని కోరాం: రామ్మోహన్

  • Jul 16, 2026 13:18 IST

    వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసే అవకాశం

    • శ్రీకాకుళం వెళ్తున్న అప్పలరాజును ఫాలో అవుతున్న పోలీసులు

  • Jul 16, 2026 13:17 IST

    సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఆగ్రహం

    • విద్యార్థులకు ఇలాంటి అంశాలు రుద్దడం బాధాకరం: రాంచందర్‌‌రావు

    • ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి: రాంచందర్‌రావు

    • ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఊరుకోం: రాంచందర్‌రావు

  • Jul 16, 2026 13:06 IST

    హైదరాబాద్: చాదర్‌ఘాట్‌లో బాలికపై మదర్సా మతగురువు అత్యాచారం

    • పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు

    • బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదు

    • నిందితుడి కోసం గాలింపు

  • Jul 16, 2026 13:02 IST

    సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

    • 9వ తరగతిలో త్రిభాషతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన

    • కొత్త భాషను ఇప్పుడెందుకు ప్రవేశపెడుతున్నారని ప్రశ్న

    • టెన్త్ పరీక్షార్ధులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారన్న న్యాయస్థానం

    • తమిళనాడు సర్కార్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్య

  • Jul 16, 2026 12:54 IST

    చెన్నై: సీఎం విజయ్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

    • మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి విజయ్ సీరియస్

    • అవినీతికి పాల్పడితే సహించేది లేదు: విజయ్

    • ఎవరినీ ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తప్పవు: విజయ్

  • Jul 16, 2026 12:45 IST

    హైదరాబాద్: ఈడీ కస్టడీకి ఏపీ లిక్కర్ రవాణా కేసు నిందితులు

    • నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలింపు

    • రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌ను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు

  • Jul 16, 2026 12:39 IST

    ప్రభుత్వంపై BRS విష ప్రచారం చేస్తోంది: మంత్రి వాకిటి శ్రీహరి

    • తెలంగాణను అప్పులపాలు చేసిందే BRS: వాకిటి శ్రీహరి

    • కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు: వాకిటి

  • Jul 16, 2026 12:39 IST

    భద్రాద్రి: మణుగూరులో ముగ్గురు మంత్రుల పర్యటన

    • సీతారామ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల

  • Jul 16, 2026 12:21 IST

    ప్రభాస్ 'ఫౌజీ' విడుదల తేదీ ప్రకటన

    • డిసెంబర్ 3న విడుదల కానున్న 'ఫౌజీ'

    • డిసెంబర్ 3న ప్యాన్ ఇండియా సినిమాగా రానున్న 'ఫౌజీ'

  • Jul 16, 2026 12:09 IST

    కుడంకుళం డేటా లీక్‌పై NPCIL స్పష్టత

    • అణు భద్రతకు ఎలాంటి ముప్పు లేదు: NPCIL

    • బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‌ విభాగానికి చెందిన ఫైల్స్ లీక్

    • కుడంకుళం రియాక్టర్ డేటా సురక్షితం: NPCIL

    • సెక్యూరిటీ వ్యవస్థలు సురక్షితం: NPCIL

  • Jul 16, 2026 11:55 IST

    సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టులో ముగిసిన విచారణ

    • వాంగ్‌చుక్‌కు వైద్యం అందించాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశం

    • ప్రతీ ప్రాణం విలువైనదేనని ధర్మాసనం వ్యాఖ్య

    • న్యాయవాది రాకేష్‌కుమార్ సైని పిల్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

    • నీట్ పేపర్ లీక్‌పై పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్

  • Jul 16, 2026 11:40 IST

    US ఫెడ్‌ రిజర్వ్‌లో RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌

    • రఘురామ్‌ రాజన్‌కు బ్యాలెన్స్ సమీక్ష బాధ్యతలు

    • ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడరల్ బ్యాంక్ చర్యలు

    • ద్రవ్యవిధాన సంస్కరణల కోసం రఘురామ్‌కు బాధ్యతలు

  • Jul 16, 2026 11:27 IST

    హైదరాబాద్: ఎల్‌నినోపై రాష్ట్ర తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్లాన్ విడుదల

    • నేడు సచివాలయంలో ప్రణాళికను విడుదల చేయనున్న మంత్రి తుమ్మల

    • వర్షాభావాన్ని ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణ సిద్ధం

    • జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు

    • మండలాలు, జిల్లాల వారీగా వర్షపాతం లోటు వివరాలు

    • రెండు నెలల వాతావరణ అంచనాల ఆధారంగా కార్యాచరణ

  • Jul 16, 2026 11:16 IST

    కామారెడ్డి: తాడ్వాయి మం. చిట్యాలలో విషాదం.. ఒకే రోజు తల్లీకూతుళ్ల మృతి

    • అనారోగ్యంతో ఉన్న తల్లి నరసవ్వ (70) మృతి

    • తల్లి మరణం తట్టుకోలేక కూతురు బాలమణి (40)కి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

  • Jul 16, 2026 11:15 IST

    ఢిల్లీలో 'హీట్ స్మార్ట్ స్కూల్' ప్రాజెక్ట్

    • పిల్లల రక్షణే ధ్యేయంగా వినూత్న ప్రాజెక్ట్ ప్రారంభం

    • శాలిమార్ బాగ్‌లోని సర్వోదయ బాల విద్యాలయలో 'హీట్ స్మార్ట్ స్కూల్' పైలట్ ప్రాజెక్ట్

    • పిల్లల భద్రత, శ్రేయస్సే ఢిల్లీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం: సీఎం రేఖా గుప్తా

  • Jul 16, 2026 11:11 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌కు ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్

    • DCC అధ్యక్షులతో విడివిడిగా సమావేశం

    • జిల్లాల్లో పార్టీ పరిస్థితి, అంతర్గత కలహాలపై చర్చ

  • Jul 16, 2026 11:02 IST

    హైదరాబాద్: సక్సెస్ స్కూల్‌ యాజమాన్యం తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

    • హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

    • కల్మా, సూరా ఫాతిహా చదవాలనడం దుర్మార్గం: బండి సంజయ్

    • సోకాల్డ్ సెక్యూలర్ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదు?: బండి సంజయ్

    • స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్

  • Jul 16, 2026 10:52 IST

    ఢిల్లీ: సుప్రీంకోర్టులో రభస కేసు

    • ఇద్దరు లా విద్యార్థులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

    • రిమాండ్ విధించిన పాటియాలా హౌస్ కోర్టు

    • సుప్రీంకోర్టులో 'పిటిషనర్-ఇన్-పర్సన్‌'గా హాజరై CJIపై అసభ్య పదజాలంతో దూషణలు చేసిన విద్యార్థులు

  • Jul 16, 2026 10:41 IST

    నీట్ పేపర్ లీక్ కేసులో CBI కీలక విషయాలు వెల్లడి

    • పేపర్ సెట్టర్‌కు కోచింగ్ సెంటర్ యజమాని డబ్బులు ఇచ్చారు: CBI

    • ప్యానల్ సభ్యుడు కులకర్ణికి రూ.5 లక్షలు ఇచ్చారు: CBI

    • కెమిస్ట్రీ ప్రశ్నలు ఇచ్చేందుకు డబ్బులు ఇచ్చారు: CBI

    • లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్‌ను అరెస్ట్ చేశాం: CBI

  • Jul 16, 2026 10:36 IST

    పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

    • బన్ను జిల్లా మిర్‌యాన్‌ పీఎస్‌పై ఆత్మాహుతి దాడి

    • నలుగురు పోలీసుల మృతి, పలువురు సిబ్బందికి గాయాలు

  • Jul 16, 2026 10:24 IST

    జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్: క్వార్టర్స్‌లోకి సింధు

    • ప్రపంచ నంబర్‌ 5 ర్యాంకర్‌పై పీవీ సింధు విజయం

    • 35 నిమిషాల్లో హన్‌ యూకు షాకిచ్చిన భారత స్టార్ షట్లర్

    • వరుస గేమ్‌ల్లో సింధు ఘన విజయం

    • నొజోమీ ఒకుహారాతో క్వార్టర్స్‌లో సింధు పోరు

  • Jul 16, 2026 10:21 IST

    స్వల్పంగా పెరిగిన ముడి చమురు ధరలు

    • 33 సెంట్లు పెరిగి 85.28 డాలర్లకు చేరిన బ్రెంట్ ఫ్యూచర్లు

    • 42 సెంట్లు పెరిగి 80.02 డాలర్లకు చేరిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్

  • Jul 16, 2026 10:11 IST

    విశాఖ: హార్బర్ సమీపంలో బోటు బోల్తా

    • అలల ఉధృతికి రాళ్ల మధ్య చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు

    • బోటును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారులు

    • ఇద్దరు మత్స్యకారులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    పూర్తి కథనం

  • Jul 16, 2026 10:11 IST

    హైదరాబాద్: మంగళ్‌హాట్‌ పోలీసుల అదుపులో ఓ రాజకీయ నేత కుమారుడు

    • డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కిన రాజకీయ నేత కుమారుడు భరత్‌

    • భరత్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jul 16, 2026 09:59 IST

    ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు 3 రోజుల కస్టడీ

    • వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌కు కస్టడీ

    • నేటి నుంచి 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి

    • కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ ఆఫీస్‌కు తరలింపు

  • Jul 16, 2026 09:55 IST

    ఢిల్లీ: ఎర్రకోట తాత్కాలికంగా మూసివేత

    • స్వాతంత్ర్య వేడుకలు దగ్గర పడడంతో మూసివేత

    • ఎర్రకోటలో భద్రత కట్టుదిట్టం

    • పాస్ ఉన్నవారికే ఎర్రకోటలో ప్రవేశం

  • Jul 16, 2026 09:49 IST

    తిరుపతి: టీటీడీ ఉద్యోగిపై చీటింగ్ కేసు

    • టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

    • తిరుపతి వాసి ముని శంకరయ్య వద్ద రూ.3.60 లక్షలు తీసుకున్న టీటీడీ ఉద్యోగి గిరిధర్

    • ఉద్యోగం ఇప్పించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

  • Jul 16, 2026 09:07 IST

    కృష్ణా జిల్లా: గన్నవరం హైవేపై కొత్తపేట సమీపంలో రెండు కార్లు ఢీ

    • రెండు వాహనాలనూ ఘటనా ప్రదేశంలోనే వదిలి వెళ్లిన డ్రైవర్లు

    • గన్నవరం రహదారిపై ట్రాఫిక్ జామ్, చర్యలు చేపట్టిన పోలీసులు

  • Jul 16, 2026 08:59 IST

    అమరావతి: వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నేడు జగన్నాథ రథయాత్ర

    • సాయంత్రం జరిగే జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • ఉదయం ఫైనాన్స్, పీపీపీ ప్రాజెక్ట్ లపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

  • Jul 16, 2026 08:51 IST

    హైదరాబాద్ పాతబస్తీలో సైదాబాద్ సక్సెస్ స్కూల్‌పై వివాదం

    • రెండో తరగతి హిందూ విద్యార్థితో కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్ వర్క్ ఇచ్చిన టీచర్

    • స్కూల్ డైరీలోనూ అదే విషయాన్ని రాసిన టీచర్

    • పాఠశాలకు వెళ్లి సదరు టీచర్‌ను నిలదీసిన తల్లిదండ్రులు

  • Jul 16, 2026 08:43 IST

    ఢిల్లీ: ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక మార్గదర్శకాల జారీ

    • ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    • సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలకు అనుమతి నిరాకరణ

    • ఎంపీల వ్యక్తిగత గోప్యత, భద్రత దృష్ట్యా ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం

    • రహస్యంగా చిత్రాలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం

  • Jul 16, 2026 08:00 IST

    ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న బీజేపీ బృందం

    • పాల్గొననున్న బీజేపీ రాష్ట్రధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్

  • Jul 16, 2026 07:48 IST

    హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    • అమ్మవారికి సమర్పించే ప్రతి బోనం ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని కాంక్షించిన సీఎం

  • Jul 16, 2026 07:38 IST

    ప్రకాశం: సంతమాగులూరు పరిధిలో వ్యక్తి దారుణ హత్య

    • పాతమాగులూరు గ్రామంలో దారుణ హత్యకు గురైన సజ్జల పిచ్చిరెడ్డి(50)

    • ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు

  • Jul 16, 2026 07:28 IST

    భద్రాద్రి: నేడు సీతారామ ప్రాజెక్ట్ సందర్శనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్

    • సీతారామ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష సమావేశం

  • Jul 16, 2026 07:16 IST

    గుంటూరు జిల్లా: తెనాలిలో కొడుకును చంపిన తల్లిదండ్రులు

    • నాజర్‌పేటలో నిత్యం మద్యం తాగొచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకు

    • వేధింపులు భరించలేక పీక కోసి హతమార్చిన తల్లిదండ్రులు

    • కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు

  • Jul 16, 2026 07:10 IST

    నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన

    • ఖమ్మం పర్యటనలో భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల

    • సీతారామ ప్రాజెక్ట్ పనులు పరిశీలించనున్న మంత్రులు

  • Jul 16, 2026 07:10 IST

    నిజామాబాద్: నకిలీ 500 రూపాయల నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్

    • నాగారం చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తున్న షేక్ కైజర్, రమేశ్ గౌడ్ అరెస్ట్

    • రూ.500 నకిలీ నోట్లు-200, రూ.1.65 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లు, బైక్‌, ఇతర సామగ్రి స్వాధీనం

    • వీరితో సంబంధాలున్న మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన 5వ టౌన్ పోలీసులు

  • Jul 16, 2026 07:01 IST

    కాకినాడ: మాజీ మంత్రి అంబటిపై కిర్లంపూడి పీఎస్‌లో కేసు

    • ముద్రగడ అంత్యక్రియల సమయంలో సంఘటనపై కేసు

    • గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి, ఆయన అనుచరులు ఆటంకం

    • పెద్దాపురం డీఎస్పీ, పెద్దాపురం, జగ్గంపేట సీఐల ముందే ఘటన

    • ఉన్నతాధికారుల ముందే అంబటి, ఆయన అనుచరులు తమను ఉద్దేశపూర్వకంగా తోసేశారని పోలీసులకు అధికారుల ఫిర్యాదు

  • Jul 16, 2026 06:50 IST

    నేడు రెండో రోజు మీనాక్షి వన్ టూ వన్ సమావేశాలు

    • డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి నటరాజన్ సమీక్ష

    • ఈనెల 17న మంత్రులతో మీనాక్షి సమావేశం

    • మంత్రులతో విడివిడిగా భేటీకానున్న మీనాక్షి, మహేశ్ గౌడ్

  • Jul 16, 2026 06:49 IST

    నేటి నుంచి హైదరాబాద్‌లో ఆషాఢం బోనాలు

    • GHMC పరిధిలో 3 వేలకు పైగా ఆలయాల్లో బోనాలు

    • దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ

    • బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

  • Jul 16, 2026 06:47 IST

    త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

    • నిబంధనల ఉల్లంఘన వల్లే ఇరాన్‌పై కఠిన చర్యలు: ట్రంప్‌

    • చర్చలతో వివాదం పరిష్కరించుకోవాలని ఇరాన్‌ కోరుకుంటోంది: ట్రంప్

    • యుద్ధం ముగిసిన తర్వాత క్రూడాయిల్‌ ధరలు తగ్గుతాయి: ట్రంప్‌

  • Jul 16, 2026 06:46 IST

    ఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ వ్యూహకమిటీ భేటీ

    • సోనియా గాంధీ అధ్యక్షతన భేటీకానున్న కమిటీ

    • పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

  • Jul 16, 2026 06:43 IST

    నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో వన్డే

    • కార్డిఫ్‌ వేదికగా సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

  • Jul 16, 2026 06:39 IST

    ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు అర్జెంటీనా

    • సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా గెలుపు

    • ఈ నెల 20న ఫైనల్స్‌లో స్పెయిన్‌తో తలపడనున్న అర్జెంటీనా

  • Jul 16, 2026 06:36 IST

    హిమాచల్‌ప్రదేశ్‌లో అదుపుతప్పి లోయలో పడిన బస్సు

    • ఇద్దరి మృతి, మరో 22 మందికి తీవ్రగాయాలు

    • ఆసుపత్రికి తరలింపు

  • Jul 16, 2026 06:35 IST

    ఒడిశా: నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర

    • గుండిచా ఆలయానికి నందిఘోష్‌ రథంపై వెళ్లనున్న జగన్నాథుడు

    • తాళధ్వజ, దర్పదళన్‌ రథాలపై వెళ్లనున్న బలభద్రుడు, సుభద్ర

    • రథయాత్రల వేడుకలకు 15 లక్షల మంది భక్తులొస్తారని అంచనా

  • Jul 16, 2026 06:34 IST

    ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు

    • ఇరాన్‌పై రెండో విడత దాడులు ప్రారంభించిన అమెరికా

    • హోర్ముజ్‌ నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడులు

    • ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడుల్లో 35 మంది మృతి

  • Jul 16, 2026 06:32 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • రూ.1,43,580కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం రేటు

    • రూ.1,31,610కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. పసిడి ధర

    • కిలో వెండి ధర రూ.2,40,100