Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 14 , 2026 | 06:09 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 14, 2026 21:52 IST

    హోర్ముజ్ టోల్‌ ఫీజుపై ట్రంప్ యూటర్న్

    • 20% టోల్ ఫీజు ప్రతిపాదన వెనక్కి

    • గల్ఫ్‌ దేశాల డీల్స్‌తో టోల్‌ను భర్తీ చేస్తున్నట్టు వెల్లడి

    • ఇరాన్ నౌకలపైనే ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టీకరణ

    పూర్తి కథనం

  • Jul 14, 2026 21:31 IST

    హైదరాబాద్: ఓటర్లకు CEO సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి

    • ఎన్యూమరేషన్ ఫారాలు వెంటనే BLOలకు అందజేయాలి: సీఈఓ

    • ఫారం సమర్పిస్తేనే ఓటర్ జాబితాలో పేరు

    • ఫారంలో ఫొటో, ఓటర్ సంతకం, తేదీ తప్పనిసరి

  • Jul 14, 2026 21:14 IST

    ముద్రగడ పద్మనాభం మృతికి మంత్రి లోకేశ్ నివాళి

    • ఆయన ఆత్మకు శాంతి కలగాలి: లోకేశ్

    • ముద్రగడ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: లోకేశ్

  • Jul 14, 2026 21:00 IST

    హైదరాబాద్: ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌కు కేబినెట్‌ హోదా

    • కేబినెట్‌ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

  • Jul 14, 2026 20:36 IST

    ముద్రగడ పద్మనాభం మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన

    • ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

  • Jul 14, 2026 20:12 IST

    ముద్రగడ పద్మనాభం మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్

    • ముద్రగడ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: పవన్

  • Jul 14, 2026 19:47 IST

    పోలవరం ప్రాజెక్టు పర్యాటకంపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద పర్యాటక శోభకు సీఎం ఆలోచన

    • పోలవరం ప్రాజెక్టు సహా పర్యాటక ప్రాజెక్టుల అభివృద్దిపై చర్చ

  • Jul 14, 2026 19:25 IST

    భారత్‌తో తొలి వన్డే: ఇంగ్లండ్ ఆలౌట్

    • 258 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్

    • టీమిండియా టార్గెట్ 259

  • Jul 14, 2026 19:14 IST

    కాకినాడ: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం(73) కన్నుమూత

    • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ

    • హైదరాబాద్‌ సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

    • ముద్రగడ మృతిపై ప్రముఖుల సంతాపం

    పూర్తి కథనం

  • Jul 14, 2026 19:03 IST

    ప.గో: వీరవాసరంలో ఆక్వా రైతుల మీడియా సమావేశం

    • జగన్‌ రెడ్డి భీమవరం ఎందుకు వస్తున్నారు?: ఆక్వా రైతులు

    • అసెంబ్లీకి వెళ్లని జగన్‌..ఆక్వా రైతుల సమస్యలపై ఎలా చర్చిస్తారు?

  • Jul 14, 2026 18:37 IST

    మంచిర్యాల: BRS పదేళ్ల పాలనలో సింగరేణిని దోచుకున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా సింగరేణి పరిస్థితి మారలేదు

    • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి సింగరేణిని దెబ్బతీశాయి

    • సింగరేణిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది

  • Jul 14, 2026 18:15 IST

    హైదరాబాద్: డ్యాన్సర్ల అసోసియేషన్‌ వివాదంలో ట్విస్ట్

    • చిరంజీవి రంగప్రవేశంతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు చేరిన గొడవ

    • ఇరువర్గాలతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రతినిధుల చర్చ

  • Jul 14, 2026 18:11 IST

    హైదరాబాద్: HMDA చీఫ్‌ ఇంజినీర్‌ రవీందర్‌ నివాసంలో ACB సోదాలు

    • రూ.70 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించిన ACB

    • రవీందర్‌కు చెందిన 10 ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలు

    • అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం

  • Jul 14, 2026 17:38 IST

    జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం

    • మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు విజయం

    • మలేషియా ప్లేయర్ వాంగ్ లింగ్‌పై 21-14, 21-11 తేడాతో సునాయస గెలుపు

    • రెండో రౌండ్‌కు అర్హత సాధించిన సింధు

    పూర్తి కథనం

  • Jul 14, 2026 17:32 IST

    హైదరాబాద్: మీనాక్షి నటరాజన్‌తో ముగిసిన మంత్రి కొండా సురేఖ భేటీ

    • కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కొండా సురేఖ

    • సంయమనం పాటించాలని సూచించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మీనాక్షి

    • చిన్నచిన్న విషయాలను పట్టించుకోవద్దని సురేఖకు మీనాక్షి సూచన

    పూర్తి కథనం

  • Jul 14, 2026 17:18 IST

    పీవోకేలో పాక్‌ బలగాల కాల్పులు

    • కాల్పుల్లో ఆరుగురు పౌరుల మృతి

    • బలూచ్‌ సధునాతి జిల్లాలో ఘటన

    • ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న పీవోకే

  • Jul 14, 2026 17:13 IST

    మంచిర్యాల: రామకృష్ణాపూర్‌లో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర

    • భరోసా యాత్ర ముగింపు సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    • హాజరైన TBJP చీఫ్‌ రామచందర్‌ రావు, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • Jul 14, 2026 16:46 IST

    హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారుల వరుస దాడులు

    • కింగ్‌ కోఠిలో 2.4 కిలోల గంజాయి స్వాధీనం

    • నిందితుడు గుల్జార్ ఖాన్ అరెస్ట్

    • కేసు నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు బదిలీ

  • Jul 14, 2026 16:28 IST

    హైదరాబాద్‌: SIR ప్రక్రియ నత్తనడకన సాగుతోంది: మంత్రి పొన్నం

    • హైదరాబాద్‌లో కేవలం 21 శాతం ఓటరు సవరణే పూర్తయింది: పొన్నం

    • ఇంకా 10 రోజులే ఉంది.. SIR గడువు పెంచాలి: మంత్రి పొన్నం

    • BLOలు ఇళ్లకు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి: పొన్నం

    • అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోకూడదు: మంత్రి పొన్నం

    • ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ కేడర్ చురుకుగా పనిచేయాలి: పొన్నం

  • Jul 14, 2026 16:15 IST

    వెట్టిచాకిరి చేసే కార్మికులు తయారుచేసిన వస్తువుల దిగుమతిపై భారత్ నిషేధం

    • విదేశీ వాణిజ్య విధానంలో కేంద్రం సవరణలు

    • బలవంతపు శ్రమ ఉత్పత్తులకు బ్రేక్‌

    • 30 రోజుల్లో అమల్లోకి కొత్త నిబంధనలు

    • దిగుమతి నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం

    • డీజీఎఫ్‌టీ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

  • Jul 14, 2026 16:14 IST

    రైలు ఏసీ కోచ్‌లో మంగళసూత్రం చోరీ.. రూ.70 వేల పరిహారం

    • రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 2021లో చోరీ ఘటన

    • రైల్వే సేవాలోపం ఉందంటూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు

    • ప్రయాణికులకు రూ.70 వేలు చెల్లించాలని రైల్వే శాఖకు వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు

  • Jul 14, 2026 16:09 IST

    ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత టీమ్‌ఇండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్ టెన్‌ రాజీనామా?

    • వ్యక్తిగత కారణాలతో తప్పుకునే యోచనలో ర్యాన్‌ టెన్‌

    • బీసీసీఐకి తన నిర్ణయాన్ని తెలిపిన ర్యాన్‌ టెన్‌

    • గంభీర్‌తో చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం

    • ఫీల్డింగ్‌ కోచ్‌పైనా మార్పుల ప్రచారం

    • ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఓటమి నేపథ్యంలో మార్పులపై ఊహాగానాలు

  • Jul 14, 2026 16:01 IST

    గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?

    • తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో మాట్లాడుకోని గంభీర్-కోహ్లీ

    • ఇరువురి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ చర్చ

    • నెట్టింట ప్రాక్టీస్ సెషన్ వీడియోలు వైరల్

  • Jul 14, 2026 15:57 IST

    ప్రకాశం: వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ట్విస్ట్‌

    • ఆస్తి కోసం సొంత బావ AO శ్రీహరిని హతమార్చిన హరికృష్ణ

    • శ్రీహరి హత్య కేసు నిందితుడు హరికృష్ణ కుటుంబం సింగరాయకొండలో రైలుకింద పడి ఆత్మహత్య

    • మృతుల్లో దంపతులు సహా ఇద్దరు పిల్లలు

  • Jul 14, 2026 15:55 IST

    జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్‌ కీలక ప్రకటన

    • RAW NTR సంస్థతో గానీ, కార్యకలాపాలతో గానీ తమకు సంబంధం లేదని వెల్లడి

    • ఈ నెల 18న కార్యక్రమంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం

    • ఏ ప్రకటన అయినా ఎన్టీఆర్‌ ఆఫీస్ నుంచే వస్తుందని స్పష్టీకరణ

  • Jul 14, 2026 15:43 IST

    ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన రియల్టర్ కేతన్ అగర్వాల్ తల్లి

    • కేతన్‏ను హత్య చేసిన వారిని శిక్షించాలని రాఖీ అగర్వాల్ లేఖ

    • విచారణ వేగవంతంగా పూర్తిచేసి నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి

  • Jul 14, 2026 15:39 IST

    తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

    • తెలంగాణలో SIR గడువు పొడిగించాలని విజ్ఞప్తి

  • Jul 14, 2026 15:39 IST

    మహారాష్ట్ర: శివసేన(UBT) తిరుగుబాటు ఎంపీలపై ఉద్ధవ్‌ వర్గం ఆగ్రహం

    • తిరుగుబాటు ఎంపీలకు శివసేన(UBT) లీగల్‌ నోటీసులు

    • ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో విలీనం చట్ట విరుద్ధం: శివసేన(UBT)

    • మా అనుమతి లేకుండా విలీనం సాధ్యం కాదు: శివసేన(UBT)

    • విలీనాన్ని ఆమోదించొద్దని లోక్‌సభ స్పీకర్‌కు శివసేన(UBT) విజ్ఞప్తి

  • Jul 14, 2026 15:37 IST

    ముంబై: డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్

    • ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్‌

  • Jul 14, 2026 15:35 IST

    నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

    • 561.46 పాయింట్లు పతనమై 77,054.94 వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్

    • 158.95 పాయింట్లు నష్టపోయి 24,052.05 వద్ద ముగిసిన నిఫ్టీ

  • Jul 14, 2026 15:24 IST

    అమరావతి: మంత్రులు, పలు శాఖల కార్యదర్శులు, HoDలతో సీఎం చంద్రబాబు సమావేశం

    • జూన్‌ నెల ఆర్థిక నివేదికపై చర్చ

    • వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలపై సమీక్ష

    • బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సహా పెట్టుబడుల అంశాలపై రివ్యూ

  • Jul 14, 2026 15:19 IST

    2019-24 మధ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి: చంద్రబాబు

    • గడిచిన రెండేళ్లుగా సమష్టిగా పనిచేశాం: సీఎం చంద్రబాబు

    • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పాం: చంద్రబాబు

    • ప్రభుత్వ ఆలోచనల్ని యంత్రాంగం సమర్ధంగా అమలు చేసింది: చంద్రబాబు

    • ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగాం: చంద్రబాబు

    • మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉంది: సీఎం చంద్రబాబు

  • Jul 14, 2026 15:11 IST

    భారత్‌తో తొలి వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్

    • బర్మింగ్‌హామ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే

    • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

    • తొలుత ఫీల్డింగ్ చేయనున్న భారత్

    పూర్తి కథనం

  • Jul 14, 2026 14:55 IST

    అబద్ధాల పునాదులపై గొడ్డలి పార్టీ పుట్టింది: మంత్రి అచ్చెన్న

    • మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు: అచ్చెన్న

    • జగన్‌రెడ్డి చౌకబారు వ్యాఖ్యలను ప్రజలు నమ్మరు: అచ్చెన్న

    • డబ్బుపై ఆశతో తల్లి, చెల్లిని మోసగించిన వ్యక్తి జగన్‌: అచ్చెన్న

    • వైసీపీ హయాంలో 270 మంది మత్స్యకారులు చనిపోతే జగన్‌ కనీసం పైసా కూడా పరిహారం ఇవ్వలేదు: అచ్చెన్న

  • Jul 14, 2026 14:53 IST

    అమరావతి: జోసెఫ్ రావణ్‌ కస్టడీ కోరుతూ మరో పిటిషన్‌

    • 15 రోజుల పాటు కస్టడీ కోరుతూ గన్నవరం పోలీసుల పిటిషన్‌

    • గతంలో వేసిన కస్టడీ పిటిషన్‌ను ఇవాళ ఉపసంహరించుకున్న పోలీసులు

    • ప్రస్తుతం UAPA కేసులో నెల్లూరు జైలులో జోసెఫ్ రావణ్

  • Jul 14, 2026 14:46 IST

    ప్రకాశం: సింగరాయకొండలో విషాదం

    • రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య

    • మృతుల్లో దంపతులు సహా ఇద్దరు పిల్లలు

  • Jul 14, 2026 14:15 IST

    విశాఖలో ముగిసిన మాజీ సీఎం జగన్ పర్యటన

    • మత్స్యకార బాధితులకు పరామర్శలతో సరిపెట్టిన జగన్

    • వైసీపీ తరఫున పరిహారం అందిస్తారని జోరుగా ప్రచారం జరిగినా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించకపోవడంపై విమర్శలు

  • Jul 14, 2026 14:08 IST

    ఏపీలో SIR గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు

    • ఏపీలో SIR షెడ్యూల్‌ను సవరించిన ECI

    • జూన్ 15 నుంచి జులై 24 వరకు BLOల ఇంటింటి సర్వే

    • జులై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్వ్యవస్థీకరణ పూర్తి

    • జులై 31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ

    • జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ

    • సెప్టెంబర్ 28లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం

    • అక్టోబర్ 3, 2026న ఓటర్ల తుది జాబితా

  • Jul 14, 2026 13:29 IST

    హైదరాబాద్: మీనాక్షి నటరాజన్‌తో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి సమావేశం

    • శివచరణ్‌రెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్‌

  • Jul 14, 2026 13:05 IST

    ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్

    • ఈ నెల 16న సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ కీలక భేటీ

    • సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రజా సమస్యలపై చర్చ

  • Jul 14, 2026 12:43 IST

    కృష్ణా జిల్లా: రావణ్‌ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

    • జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్‌ను ఉపసహరించుకున్న పోలీసులు

    • కొత్త పిటిషన్ దాఖలు చేయనున్న గన్నవరం పోలీసులు

    • రావణ్ కేసులో మరికొందరిని విచారిస్తున్న పోలీసులు

  • Jul 14, 2026 12:32 IST

    థర్డ్ ల్యాంగ్వేజ్‌పై CBSE విధివిధానాలు జారీ

    • 9, 10 తరగతుల విద్యార్థులకు 'మూడో భాష(R3)' ఇంటర్నల్ అసెస్‌మెంట్ తప్పనిసరి: CBSE

    • టెన్త్‌ పాస్ అవ్వాలంటే R3 అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే: CBSE

    • టెన్త్ విద్యార్థులకు మూడో భాష(R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు: CBSE

    • 2026-27 విద్యా ఏడాదిలో తొమ్మిదో తరగతి విద్యార్థులు కచ్చితంగా 3 భాషలు చదవాలి: CBSE

  • Jul 14, 2026 12:19 IST

    రాజమండ్రి: అనపర్తి మం. రామవరంలో ఉద్రిక్తత

    • కూటమి, వైసీపీ నేతల మధ్య తోపులాట

    • ఇరువర్గాలను అడ్డుకున్న పోలీసులు

  • Jul 14, 2026 12:15 IST

    విశాఖ: జగన్‌ విశాఖకు ఎందుకు వస్తున్నారు?: పల్లా శ్రీనివాస్‌

    • వైసీపీ హయాంలో ఒక్క మత్స్యకారుడికి న్యాయం చేయలేదు: పల్లా శ్రీనివాస్

    • మత్స్యకార నిధులను కూడా జగన్ డైవర్ట్ చేశారు: పల్లా శ్రీనివాస్‌

    • మత్స్యకారులకు జగన్‌ ఏం చేశారో సమాధానం చెప్పాలి: పల్లా శ్రీనివాస్

    • జగన్‌ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలి: పల్లా శ్రీనివాస్‌

    పూర్తి కథనం

  • Jul 14, 2026 12:14 IST

    హైదరాబాద్‌: HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్‌ నివాసం, ఆఫీసుల్లో సోదాలు

    • మొత్తం 21 ప్రాంతాల్లో ACB అధికారుల తనిఖీలు

  • Jul 14, 2026 12:13 IST

    ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ మాజీ IPS వాంగ్మూలం రికార్డ్ చేసిన సిట్

    • తొలిసారి ఇతర రాష్ట్రానికి చెందిన బ్యూరోక్రాట్‌ను ప్రశ్నించిన సిట్‌

    • రిటైర్డ్ IPS ఏబీ వెంకటేశ్వరరావు వాంగ్మూలం రికార్డు చేసిన సిట్

    • ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు

    • ఏబీ వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డింగ్స్‌ను 2023లో నిందితులు సేకరించినట్టు సిట్ గుర్తింపు

    • సాక్షిగా ఏబీ వెంకటేశ్వరరావు వాంగ్మూలం రికార్డు

  • Jul 14, 2026 12:02 IST

    కేదార్‌నాథ్ ఆలయ నిధుల అంశంలోనూ అక్రమాలు

    • వీఐపీల వసతి, భోజనాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల

    • కేదార్‌నాథ్ అంశంలో మాజీ మేనేజర్, ఇన్‌ఛార్జి అధికారి, మాజీ సీఈఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశం

    • సస్పెన్షన్, FIRను సవాల్‌ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించిన ప్రమోద్

  • Jul 14, 2026 11:59 IST

    బద్రీనాథ్ ఆలయ విరాళాల స్వాహా కేసులో తొలి అరెస్ట్

    • పోలీసుల అదుపులో అధికారి ప్రమోద్ నౌటియాల్‌

    • BKTC(బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ) చైర్మన్ డెహ్రాడూన్ నివాసంలో మాజీ పీఏ ప్రమోద్‌ అరెస్ట్

    • నిందితుడు ప్రమోద్‌‌ను విచారణ నిమిత్తం బద్రీనాథ్‌కు తరలింపు

    • ఈ నెల 2న విరాళాల లెక్కింపులో భారీ అక్రమాల గుర్తింపు

  • Jul 14, 2026 11:58 IST

    మహారాష్ట్ర: నాసిక్‌లో కుటుంబాన్ని వేధించిన ఆకతాయిలు

    • ఇగత్‌పురికి పిక్నిక్‌కు వచ్చిన 8 మంది సభ్యుల బృందం

    • కారులో వెళ్తున్న కుటుంబాన్ని 20 కి.మీ. వెంటాడి వేధింపులు

    • కారుపై దాడి, మహిళను లైంగికంగా వేధించిన ఆకతాయిలు

    • కేసు నమోదు, పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

  • Jul 14, 2026 11:54 IST

    భారత్‌ సైన్యం అదుపులో మరో అమెరికా మాజీ సైనికుడు

    • భారత్‌-నేపాల్ సరిహద్దు దగ్గర బ్రౌన్ అనే వ్యక్తిని పట్టుకున్న సైనికులు

    • ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్‌లోకి ప్రవేశించేందుకు యత్నం

    • 2025లోనే భారత్‌లోకి సముద్రమార్గం ద్వారా వచ్చిన బ్రౌన్‌

    • గోవా, బెంగళూరు, యూపీకి వెళ్లిన బ్రౌన్‌

  • Jul 14, 2026 11:27 IST

    హోర్ముజ్‌ దాడిపై ఇరాన్‌ రాయబారికి సమన్లు

    • ఇరాన్‌ రాయబార ప్రతినిధిని పిలిపించిన కేంద్రం

    • దాడిలో భారత నావికుడి మృతి.. కేంద్రం ఆందోళన

    • నౌకపై దాడి ఘటనపై వివరణ కోరిన కేంద్రం

    • హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు

    • ఆరుగురు భారతీయులు సహా ఎనిమిది మందికి గాయాలు

  • Jul 14, 2026 11:15 IST

    తూ.గో.: కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన అధికారులు

    • నల్లజర్ల మం. అనంతపల్లిలో పొలానికి దారి లేకుండా అక్రమ లేఅవుట్‌ వేశారని కలెక్టర్‌కు మహిళ లక్ష్మీదుర్గ ఫిర్యాదు

    • విచారణ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

    • లక్ష్మీదుర్గ పొలానికి వెళ్లే దారిలో అక్రమ లేఅవుట్ వేసి రోడ్డు వేసిన రియల్టర్

    • అక్రమ లేఅవుట్‌ లేదని కలెక్టర్‌కు అధికారుల తప్పుడు నివేదిక

    • అక్రమ లేఔట్‌లో స్థలాలు కొనొద్దని పంచాయతీ అధికారుల ఫ్లెక్సీ

  • Jul 14, 2026 11:13 IST

    బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల.. చెన్నైలో తొలి మ్యాచ్

    • షెడ్యూల్ విడుదల చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా

    • డిసెంబర్ 12న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్

  • Jul 14, 2026 11:01 IST

    కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    • ఆదిలాబాద్‌, వరంగల్‌ ఎయిర్‌పోర్టులపై చర్చ

  • Jul 14, 2026 11:01 IST

    చైనాను అతలాకుతలం చేస్తున్న టైఫూన్ 'బావి'

    • వరదలతో లియావోనింగ్‌ ప్రావిన్స్‌లో భారీ నష్టం

    • 2.6 లక్షల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

  • Jul 14, 2026 11:00 IST

    హైదరాబాద్‌: బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్ అరెస్ట్

    • 2018లో సైఫాబాద్‌లో హత్య కేసులో నిందితుడు మహ్మద్‌ జావేద్

    • పరారీలో ఉన్న జావేద్‌పై 2020లో NBW జారీ

    • సంగారెడ్డి జిల్లా చేర్యాలలో బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్

    • ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ అదుపులో జావేద్‌

  • Jul 14, 2026 10:57 IST

    నంద్యాల: ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్

    • మహానంది మం. బుక్కాపురం సమీపంలో అడవి జంతువులను చంపిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jul 14, 2026 10:49 IST

    విశాఖ: బీచ్‌ రోడ్డులో యువతి ఆత్మహత్యాయత్నం

    • పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి లావణ్య

    • తీవ్ర గాయాలపాలైన యువతి.. ఆస్పత్రికి తరలింపు

    • మధురవాడ మ్యాక్స్ దగ్గర యువతి నివాసం

  • Jul 14, 2026 10:45 IST

    హైదరాబాద్‌: కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

    • MLA కడియం శ్రీహరి వ్యవహారంపై చర్చ

  • Jul 14, 2026 10:42 IST

    విజయవాడ: ఇస్కాన్ ఆలయంలో శ్రీ జగన్నాథ రథయాత్ర

    • ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు రథయాత్ర నిర్వహణ

  • Jul 14, 2026 10:30 IST

    ఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

    • ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ ప‌నుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ ఆమోదించాలని మంత్రికి సీఎం వినతి

    • ఆర్ఆర్ఆర్ స‌ద‌ర‌న్ పార్ట్‌కు వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని విన‌తి

  • Jul 14, 2026 10:29 IST

    అనంతపురం: కల్యాణదుర్గం MLAకు జోసెఫ్ రావణ్‌ వేధింపులు

    • MLA అమిలినేని సురేంద్ర బాబుపై కుట్రకు యత్నించిన వైసీపీ నేత ఉమామహేశ్వర్ సోదరుడు ఇంద్రసేన నాయుడు

    • అమిలినేని సురేంద్ర బాబుపై ఆరోపణల వీడియో వెనుక ఇంద్రసేన, ప్రశ్న CEO గమన ఉన్నట్లు ప్రచారం

  • Jul 14, 2026 10:21 IST

    కామారెడ్డి: బీబీపేటకు చెందిన యువతి భార్గవి(20) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య

    • కన్నతల్లి కుటుంబాన్ని విడిచిపెట్టి పోయిందన్న బాధతో బలవన్మరణానికి పాల్పడిన భార్గవి

  • Jul 14, 2026 10:18 IST

    హైదరాబాద్‌: KPHB లులు మాల్‌ దగ్గర గన్ కలకలం

    • లులు మాల్‌ పార్కింగ్‌ ఏరియాలో ఘర్షణ

    • సంఘటనా స్థలానికి పోలీసులు

    • పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి జేబులో గన్ చూసి అవాక్కైన పోలీసులు

    • గన్ స్వాధీనం చేసుకుని విచారించగా గన్ లైసెన్స్ ఉన్నట్లు తేల్చిన పోలీసులు

    • సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో లోపంతో మాల్‌పై కేసు నమోదు

  • Jul 14, 2026 09:45 IST

    పల్నాడు జిల్లా‌లో తీవ్ర విషాదం

    • ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య

    • తల్లితో పాటు కుమారులు హేమంత్ రెడ్డి, తేజ మృతి

    • సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు

  • Jul 14, 2026 09:30 IST

    నష్టాల్లో దేశీయ సూచీలు

    • 285 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్

    • 79 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.14

  • Jul 14, 2026 09:15 IST

    సింగరేణిని దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబమే: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    • సింగరేణిపై రాజకీయాలు చేయడానికి రాలేదు: కిషన్‌రెడ్డి

    • బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సొమ్మును దోచుకున్నాయి: కిషన్‌రెడ్డి

    • సింగరేణి భవిష్యత్తు అంధకారమవడానికి కారణం కేసీఆరే: కిషన్‌రెడ్డి

  • Jul 14, 2026 09:00 IST

    విశాఖపట్నంలో నేటి నుంచి 2 రోజుల పాటు శాసనసభ కమిటీ పర్యటన

    • ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీ పర్యటన

    • ఇందిరాగాంధీ నేషనల్‌ జూ పార్క్‌ను సందర్శించనున్న కమిటీ

    • కలెక్టరేట్‌లో అటవీ అధికారులతో కమిటీ సమావేశం

  • Jul 14, 2026 08:50 IST

    కర్నూలు: బళ్లారి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

    • హైవేపై జాగింగ్ చేస్తుండగా ఘటన

    • వాహనం ఢీకొట్టడంతో వంతెనపై నుంచి కిందపడి హెడ్‌కానిస్టేబుల్‌ వరప్రసాద్ మృతి

  • Jul 14, 2026 08:40 IST

    హైదరాబాద్‌ చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు

    • మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు

    • కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించిన అధికారులు

  • Jul 14, 2026 08:30 IST

    నేడు గద్వాల జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన

    • అలంపూర్‌, గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి పలు పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన

  • Jul 14, 2026 08:15 IST

    విజయవాడ: సింగ్‌నగర్‌లో ఆన్‌లైన్‌లో పెట్టుబడుల పేరుతో టోకరా

    • లాభాల ఆశతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు

    • విడతల వారీగా రూ.21.7 లక్షలను వసూలు చేసిన కేటుగాళ్లు

  • Jul 14, 2026 08:01 IST

    విశాఖపట్నం: జిల్లాలో నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన

    • ఇటీవల చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న వైసీపీ అధినేత

    • జబ్బార్ తోట జంక్షన్ సమీపంలోని బాధితుల ఇంటికి వెళ్లనున్న జగన్

  • Jul 14, 2026 07:55 IST

    అమరావతి: నేడు మంత్రులు, శాఖల కార్యదర్శులు, HODలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

    • కీలక శాఖల పురోగతిపై చర్చ

    • టూరిజం, వ్యవసాయం సర్వీస్ రంగాలపై ప్రత్యేక సమీక్ష

    • వచ్చే మూడు నెలల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించనున్న సీఎం

  • Jul 14, 2026 07:37 IST

    హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ మిసైల్ దాడి

    • ఇరాన్ దాడిలో ఓ భారతీయుడి మృతి

    • మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు

    • గాయపడ్డవారిలో ఆరుగురు భారతీయులు

  • Jul 14, 2026 07:15 IST

    కడప: జిల్లాలో రెండు రోజుల పాటు ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • నేడు, రేపు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్

    • రేపు దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్‌కు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్న మంత్రి

    • జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో రూ.3,478కోట్లతో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న సంస్థ

  • Jul 14, 2026 07:02 IST

    తిరుమల: నేడు శ్రీవారి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    • జులై 17వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి

    • ఏడాదిలో నాలుగుసార్లు ఆలయ శుద్ధి చేయనున్న టీటీడీ

  • Jul 14, 2026 06:57 IST

    ఇంగ్లండ్‌తో నేడు భారత్‌ తొలి వన్డే

    • బర్మింగ్‌హామ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

    • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ తొలిపోరు

  • Jul 14, 2026 06:09 IST

    నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • ఉదయం 9:45కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ

    • ట్రిపుల్‌ ఆర్‌, తెలంగాణలోని రహదారుల నిర్మాణంపై చర్చ

    • ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ

    • అదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ పెండింగ్‌ పనులపై చర్చించనున్న సీఎం రేవంత్‌రెడ్డి